విమానంలో మంటలు.. 176 మంది ప్రయాణికులు సురక్షితం | South Korea Passenger Plane Catches Fire Airbus A321 At Gimhae Airport 176 Passengers Evacuated Safely | Sakshi
Sakshi News home page

విమానంలో మంటలు.. 176 మంది ప్రయాణికులు సురక్షితం

Published Wed, Jan 29 2025 7:57 AM | Last Updated on Wed, Jan 29 2025 9:51 AM

south Korea Fire Airbus A321 at Gimhae Airport 176 Passengers Evacuated Safely

సియోల్‌: దక్షిణ కొరియాలోని గిమ్హే అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్ బుసాన్ ఎయిర్‌బస్ ఏ321 ప్యాసింజర్ విమానం మంటల్లో చిక్కుకుంది. దీనిని గమనించిన అధికారులు వెంటనే అప్రమత్తమై విమానంలోని 169 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బందితో సహా మొత్తం 176 మందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఈ ఘటనలో ఒక వ్యక్తి స్వల్పంగా గాయపడ్డాడు.

మీడియాకు అందిన వివరాల ప్రకారం విమానం హాంకాంగ్‌కు బయలుదేరడానికి సిద్ధమవుతుండగా, విమానం వెనుక భాగంలో మంటలు చెలరేగాయి. ఈ సంఘటన మంగళవారం రాత్రి 10.15 జరిగింది. గాలితో నిండిన స్లయిడ్‌లను ఉపయోగించి ప్రయాణీకులను ఖాళీ చేయించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.
 

ఈ విమానం 17 ఏళ్ల క్రితం నాటి ఎయిర్‌బస్ ఏ321 సీఈఓ మోడల్ అని దాని టెయిల్ నంబర్  హెచ్‌ఎల్‌ 7763 అని ఏవియేషన్ సేఫ్టీ నెట్‌వర్క్ మీడియాకు తెలిపింది. గత నెలలో కూడా ఇటువంటి ప్రమాదం చోటుచేసుకుంది. 2024 డిసెంబర్ 29న మువాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జెజు ఎయిర్ బోయింగ్ 737-800 విమానం కూలిపోయింది. విమానంలో ఉన్న 181 మందిలో 179 మంది మృతి చెందారు.

ఇది కూడా చదవండి: Mahakumbh-2025: యూపీ, బీహార్‌ సరిహద్దుల్లో భారీ ట్రాఫిక్‌ జామ్‌.. 70 కి.మీ. పొడవునా..

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement