వారికి ఉచితంగా లక్ష విమాన టికెట్లు.. | Qatar Airways 100000 Complimentary Tickets Covid 19 Healthcare Workers | Sakshi
Sakshi News home page

ఖతార్‌ ఎయిర్‌వేస్‌ కృతజ్ఞతా భావం.. లక్ష టికెట్లు..

Published Tue, May 12 2020 9:06 PM | Last Updated on Tue, May 12 2020 9:18 PM

Qatar Airways 100000 Complimentary Tickets Covid 19 Healthcare Workers - Sakshi

ఖతార్‌ ఎయిర్‌వేస్‌ విమానం(కర్టెసీ: ఖతార్‌ ట్విటర్‌)

దోహా: అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఖతార్‌ ఎయిర్‌వేస్‌ కీలక ప్రకటన చేసింది. కరోనా వైరస్‌పై పోరులో ముందుండి పోరాడుతున్న వైద్య సిబ్బందికి కృతజ్ఞతా భావంగా లక్ష టికెట్లు ఉచితంగా ఇవ్వనున్నట్లు పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా సేవలు అందిస్తున్న హెల్త్‌ వర్కర్ల సేవా భావానికి ప్రతిఫలంగా తమవంతుగా కాప్లిమెంటరీ రౌండ్‌ట్రిప్‌ అందిస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఖతార్‌ ఎయిర్‌వేస్‌ గ్రూప్ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ అక్బర్‌ అల్‌ బాకర్‌..‘‘ కష్టకాలంలో కఠిన శ్రమకోర్చి పూర్తి నిబద్ధతతో, సేవా నిరతితో పనిచేస్తున్న వైద్య సిబ్బందికి ఖతార్‌ ఎయిర్‌వేస్‌ ధన్యవాదాలు తెలుపుతోంది. వారు చూపుతున్న దయ, అంకితభావం విలువకట్టలేనిది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో లక్షల మంది ప్రాణాలు వారు కాపాడుతున్నారు. అలాంటి వారికోసం లక్ష టికెట్లు కేటాయించాం’’ అని అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు.(మరణాల రేటును నియంత్రించిన చిన్న దేశాలు)

వివిధ దేశాలకు చెందిన డాక్టర్లు, నర్సులు, ల్యాబ్‌ టెక్నీషియన్లు, ఇతర వైద్య సిబ్బందికి రెండు చొప్పున టికెట్లు అందజేస్తామని ఆయన పేర్కొన్నారు. ఇందుకోసం వారు అప్లికేషన్‌ ఫాం నింపాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఇందులో నుంచి ఎంపిక చేసిన వైద్య సిబ్బందితో పాటు మరొకరు ఎకానమీ క్లాసులో ప్రయాణించే అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా ఖతార్‌ ఎయిర్‌వేస్‌ అన్ని విమానాల్లో ఈ వెసలుబాటు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. అంతేగాక దోహాలోని హమద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం గుండా ప్రయాణించేందుకు టికెట్లు బుక్‌చేసుకున్న హెల్త్‌ వర్కర్లకు 35 శాతం రాయితీ ఇస్తున్నట్లు అల్‌ బాకర్‌ తెలిపారు. అయితే నవంబరు 26కు ముందుకు టికెట్లు బుక్‌ చేసుకున్న వారికి మాత్రమే ఈ సౌలభ్యం ఉంటుందని స్పష్టం చేశారు. డిసెంబరు 10 వరకు ఈ టికెట్లు చెల్లుబాటు అవుతాయని పేర్కొన్నారు. ఇక ఈ ఆఫర్‌ వివరాల కోసం ఖతార్‌ ఎయిర్‌వేస్‌ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చని... మే 11 నుంచి మే 18 వరకు వారం రోజుల పాటు ఈ ఆఫర్‌ ఉంటుందని వెల్లడించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement