International Nurses Day
-
విశాఖపట్నం : అంతర్జాతీయ నర్సుల వారోత్సవాలు (ఫొటోలు)
-
కరోనా సమయంలో ప్రాణాలను పణంగా పెట్టారు
గాంధీఆస్పత్రి: కరోనా బారిన పడ్డవాళ్లను కన్నవాళ్లు, కట్టుకున్నవాళ్లూ వదిలేస్తే, ప్రాణాలను పణంగా పెట్టి నర్సింగ్ సిబ్బంది సేవలు అందించారని, వారి సేవలకు వెలకట్టలేమని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు కొనియాడారు. కోవిడ్‌తో మృతి చెందిన నర్సుల కుటుంబాలను అన్నివిధాలా ఆదుకుంటామని తెలిపారు. ప్రపంచ నర్సుల దినోత్సవాన్ని పురస్కరించుకుని గాంధీ మెడికల్ కాలేజీలోని వివేకానంద ఆడిటోరియంలో గురువారం జరిగిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... వైద్యరంగంలో తెలంగాణ నంబర్‌వన్ కావాలని, అందుకు నర్సింగ్ సిబ్బంది తమవంతు కృషి చేయాలని అన్నారు. 4,722 స్టాఫ్‌నర్సుల పోస్టులకు త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు. నర్సింగ్ కౌన్సిల్ బలోపేతానికి ప్రణాళికలు రూపొందించామని, నర్సింగ్ డైరెక్టరేట్ విషయమై సీఎం కేసీఆర్‌తో చర్చించామని, ఆయన పాజిటివ్‌గా ఉన్నారని వివరించారు. నర్సింగ్ విద్యను పటిష్ట పరిచేందుకు జిల్లాకు ఒకటి చొప్పున 33 బీఎస్సీ నర్సింగ్ కాలేజీల ఏర్పాటుతో పాటు నర్సింగ్ స్కూళ్లను అప్‌గ్రేడ్ చేస్తామని తెలిపారు. నర్సింగ్ విద్యలో మార్పులకు అనుగుణంగా ఎస్ఎన్సీయూ, ఆంకాలజీ, మెంటల్ హెల్త్ విభాగాల్లో స్పెషలైజేషన్ శిక్షణ ఇస్తామన్నారు. చిత్తశుద్ధితో విధులు నిర్వహించిన 33 జిల్లాలకు చెందిన 106 మంది స్టాఫ్‌నర్సులు, ఆరుగురు నర్సింగ్ సూపరింటెండెంట్లకు అవార్డు, ప్రశంసాపత్రాన్ని అందించారు. కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ, వైద్య విధాన పరిషత్ కమిషనర్లు వాకాటి కరుణ, అజయ్‌కుమార్, డీఎంఈ రమేశ్‌రెడ్డి, డీహెచ్ శ్రీనివాసరావు, గాంధీ, ఉస్మానియా సూపరింటెండెంట్లు రాజారావు, నాగేందర్, గాంధీ వైస్ ప్రిన్సిపాల్ కృష్ణమోహన్, అసిస్టెంట్ డైరెక్టర్ విజయనిర్మల, నర్సింగ్ పిన్సిపాల్స్ విద్యుల్లత, విజయ, వివిధ జిల్లాలకు చెందిన నర్సింగ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఎనలేని సేవకు ప్రతిరూపం
దేవుడు అన్నిచోట్లా ఉండలేడు కాబట్టి అమ్మను సృష్టించాడని అంటారు.. అనారోగ్యంపాలై.. ఆస్పత్రిలో ఉన్నప్పుడు అమ్మ కన్నా మిన్నగా చూసే నర్సునూ సృష్టించాడంటే అతిశయోక్తి కాదు.. తెల్లని దుస్తుల్లో మిలమిలా మెరుస్తూ.. చిరునవ్వులు చిందిస్తూ.. వారు అందించే సేవలు నిరుపమానం. కరోనా సమయంలో ప్రాణాలను సైతం పణంగా పెట్టి రోగులకు పునర్జన్మనిచ్చిన ఆ అమృతమూర్తులకు నేడు నర్సుల దినోత్సవం సందర్భంగా వందనం.. అభివందనం. గుంటూరు మెడికల్: అనారోగ్యం పాలైనప్పుడు రక్తసంబంధీకులే దరి చేరని రోజులివీ.. ఆస్పత్రిలో ఉన్నప్పుడు వచ్చి ప్రేమగా పలకరించేందుకూ మనసురాని కుటుంబ సభ్యులున్న సమాజమిదీ.. ఆస్పత్రి బెడ్‌పై కాలిన, కుళ్లిన గాయాలతో, దుర్గంధం వెదజల్లే శరీరభాగాలతో ఉన్న స్థితిలో ఎవరైనా ఆ రోగివైపు కన్నెత్తి చూస్తారా? కానీ ఆ స్థితిలోనూ అతనితో ఏ సంబంధం లేకపోయినా చిరునవ్వుతో సకల సేవలూ చేసే నర్సులు దేవతలతో సమానం. ఏమిచ్చినా వారి రుణం తీర్చుకోలేం. జీవితాంతం కృతజ్ఞత చూపించడం తప్ప. ఈ రోజే ఎందుకంటే.. రెండో ప్రపంచ యుద్ధకాలంలో గాయపడిన సైనికులకు విశేష సేవలందించిన నర్సు ఫ్లోరెన్స్ నైటింగేల్ పుట్టిన రోజు మే 12న. అందుకే ఏటా ఆ రోజున అంతర్జాతీయ నర్సుల దినోత్సవం జరుపుకుంటారు. నర్సింగ్ పోస్టుల భర్తీకి సీఎం ప్రాధాన్యం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్ని టీచింగ్ ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో స్టాఫ్‌నర్సుల పోస్టులు మంజూరు చేశారు. గతంలో పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో కేవలం ఏఎన్ఎంలు ఉండేవారు. ఇప్పుడు వారి స్థానంలో జీఎన్ఎం నర్సులను నియమించారు. గ్రామాల్లోనూ బీఎస్సీ నర్సింగ్ చదివిన వారిని మిడ్‌లెవల్ హెల్త్ ప్రొవైడర్లుగా నియమించారు. 200 మందికి ఇన్ సర్వీస్ కోటాలో జీఎన్ఎం కోర్సును అభ్యసించే అవకాశం కల్పించారు. గుంటూరు జీజీహెచ్‌లో ఒకే సారి 250 స్టాఫ్‌నర్సు పోస్టులను మంజూరు చేశారు. అమ్మ కూడా నర్సే అమ్మ సముద్రాదేవి స్టాఫ్‌నర్సుగా గుంటూరు జీజీహెచ్‌లో వైద్యసేవలు అందించారు. ఆమెతోపాటు అప్పుడప్పుడు ఆస్పత్రికి వచ్చేదానిని. ఆమె స్ఫూర్తితో నేనూ ఈ వృత్తిలోకి వచ్చా. హైదరాబాద్‌లో 2000లో జీఎన్ఎం కోర్సును పూర్తి చేశా. ప్రభుత్వ నర్సుగా ఉద్యోగం వచ్చింది. తొలి పోస్టింగ్ డిచ్‌పల్లిలో. 22 ఏళ్లుగా ఈ వృత్తిలో ఉన్నా. రోగులకు సేవలందించడం సంతృప్తినిస్తోంది. – చిలువూరి కిరణ్మయి, గ్రేడ్–2 నర్సింగ్ సూపరింటెండెంట్ డాక్టర్ కావాలనుకున్నా.. డాక్టర్ కావాలనుకున్నా.. కానీ అనివార్య కారణాల వల్ల కుదరలేదు. అందుకే నర్సునయ్యా. 22 ఏళ్లుగా పనిచేస్తున్నా. కోవిడ్ సమయంలో చేసిన సేవలకు ఉన్నతాధికారులు వచ్చి అభినందించడం మరిచిపోలేని అనుభూతి. – పొట్లూరు మంజు, జీజీహెచ్ నర్సింగ్ సూపరింటెండెంట్ (గ్రేడ్–2) అమ్మ కోరిక మేరకు.. అమ్మ కోరిక మేరకు నర్సింగ్ వృత్తిలోకి ప్రవేశించాను. 39 ఏళ్లుగా ఈ వృత్తిలో ఉన్నాను. ఎక్కువగా పసికందులకు చికిత్స అందించే ఎన్ఐసీయూలో పనిచేశాను. చికిత్స అనంతరం పిల్లలు వెళ్లే సమయంలో వారి తల్లిదండ్రులు చేతులు జోడించి చూపే కృతజ్ఞతతో పడిన కష్టమంతా మరిచిపోతాను. – షేక్ సమీనా, జీజీహెచ్ నర్సింగ్ సూపరింటెండెంట్ (గ్రేడ్–2) -
ప్రాణాలను సైతం లెక్కచేయని సేవామూర్తులు: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: ఇవాళ(మే 12న) అంతర్జాతీయ నర్సుల దినోత్సవం. ఈ సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్విటర్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. అత్యవసర సమయాల్లో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సేవలు అందించే సేవామూర్తులు నర్సులు అని, ‘ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న’ అన్నట్లుగా ఎంతోమందికి జీవం పోసే ప్రాణదాతలు వార’ని సీఎం జగన్ కొనియాడారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా.. నర్సులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు ఆయన. అత్యవసర సమయాల్లో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సేవలు అందించే సేవామూర్తులు నర్సులు. `ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న` అన్నట్లుగా ఎంతోమందికి జీవం పోసేప్రాణదాతలు వారు. #InternationalNursesDay సందర్భంగా నర్సులందరికీ శుభాకాంక్షలు. — YS Jagan Mohan Reddy (@ysjagan) May 12, 2022 చదవండి: కోనసీమలో సీఎం వైఎస్ జగన్ పర్యటన -
వారికి ఉచితంగా లక్ష విమాన టికెట్లు..
దోహా: అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఖతార్ ఎయిర్వేస్ కీలక ప్రకటన చేసింది. కరోనా వైరస్‌పై పోరులో ముందుండి పోరాడుతున్న వైద్య సిబ్బందికి కృతజ్ఞతా భావంగా లక్ష టికెట్లు ఉచితంగా ఇవ్వనున్నట్లు పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా సేవలు అందిస్తున్న హెల్త్ వర్కర్ల సేవా భావానికి ప్రతిఫలంగా తమవంతుగా కాప్లిమెంటరీ రౌండ్‌ట్రిప్ అందిస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఖతార్ ఎయిర్వేస్ గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అక్బర్ అల్ బాకర్..‘‘ కష్టకాలంలో కఠిన శ్రమకోర్చి పూర్తి నిబద్ధతతో, సేవా నిరతితో పనిచేస్తున్న వైద్య సిబ్బందికి ఖతార్ ఎయిర్వేస్ ధన్యవాదాలు తెలుపుతోంది. వారు చూపుతున్న దయ, అంకితభావం విలువకట్టలేనిది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో లక్షల మంది ప్రాణాలు వారు కాపాడుతున్నారు. అలాంటి వారికోసం లక్ష టికెట్లు కేటాయించాం’’ అని అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు.(మరణాల రేటును నియంత్రించిన చిన్న దేశాలు) వివిధ దేశాలకు చెందిన డాక్టర్లు, నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఇతర వైద్య సిబ్బందికి రెండు చొప్పున టికెట్లు అందజేస్తామని ఆయన పేర్కొన్నారు. ఇందుకోసం వారు అప్లికేషన్ ఫాం నింపాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఇందులో నుంచి ఎంపిక చేసిన వైద్య సిబ్బందితో పాటు మరొకరు ఎకానమీ క్లాసులో ప్రయాణించే అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా ఖతార్ ఎయిర్వేస్ అన్ని విమానాల్లో ఈ వెసలుబాటు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. అంతేగాక దోహాలోని హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం గుండా ప్రయాణించేందుకు టికెట్లు బుక్‌చేసుకున్న హెల్త్ వర్కర్లకు 35 శాతం రాయితీ ఇస్తున్నట్లు అల్ బాకర్ తెలిపారు. అయితే నవంబరు 26కు ముందుకు టికెట్లు బుక్ చేసుకున్న వారికి మాత్రమే ఈ సౌలభ్యం ఉంటుందని స్పష్టం చేశారు. డిసెంబరు 10 వరకు ఈ టికెట్లు చెల్లుబాటు అవుతాయని పేర్కొన్నారు. ఇక ఈ ఆఫర్ వివరాల కోసం ఖతార్ ఎయిర్వేస్ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చని... మే 11 నుంచి మే 18 వరకు వారం రోజుల పాటు ఈ ఆఫర్ ఉంటుందని వెల్లడించారు. United in dedication, we share our gratitude. On the occasion of International Nurses Day, from tomorrow until 18 May we're giving away 100,000 complimentary return tickets to healthcare professionals to anywhere on our network at https://t.co/DmXa4ZXLqp. #ThankYouHeroes pic.twitter.com/d88GIaOmZo — Qatar Airways (@qatarairways) May 11, 2020 -
‘వారి పోరాట పటిమకు సలాం’
సాక్షి, న్యూఢిల్లీ : ప్రజారోగ్యం కోసం తమ జీవితాలను పణంగా పెట్టి పోరాడే నర్సుల సేవలు అభినందనీయమని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్బంగా ప్రధాని వారికి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రపంచం ఆరోగ్యంగా ఉండేందుకు నర్సులు 24 గంటలూ అవిశ్రాంతంగా శ్రమిస్తారని కొనియాడారు. కోవిడ్-19 మహమ్మారిని ఓడించేందుకు ప్రస్తుతం వారు గొప్ప సేవలు అందిస్తున్నారని ప్రధాని మోదీ మంగళవారం ట్వీట్ చేశారు. నర్సులు, వారి కుటుంబాలకు మనం కృతజ్ఞతలు తెలపాలని అన్నారు. నర్సుల సంక్షేమానికి ఈరోజు మనంపునరంకితం కావాలని, పెద్దసంఖ్యలో ఈ రంగంలోకి పలువురు వచ్చేలా ప్రోత్సహించాలని చెప్పారు. కాగా, ఆధునిక నర్సింగ్ సేవలకు గుర్తుగా ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతిని ప్రపంచ నర్సుల దినోత్సవంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ఈ ఏడాది ఆమె 200వ జయంతి కావడం గమనార్హం. చదవండి : మేయరమ్మ నీకు వందనం! -
ఆస్పత్రిలో నర్సులందరూ భయంగానే..
కళ్లల్లో కరుణ. చూపుల్లో ప్రేమ. చేతల్లో దయాగుణం. మాటల్లో మానవత్వం. సహనానికి వారు ప్రతిరూపం. నిరుపమాన సేవకు ప్రతిబింబం. అనుపమాన కర్తవ్యానికి తార్కాణం.ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న రోగుల పాలిట వారు ప్రత్యక్ష దైవాలు. రోజుల తరబడి కుటుంబాలకు దూరంగా ఉండి వైద్య సేవలే పరమావధిగా భావిస్తారు. వారే నర్సులు. రోగికి నయమయ్యే వరకూ కంటికి రెప్పలా చూసుకుని కాపాడతారు. విధి నిర్వహణలో రేయనకా..పగలనకా శక్తివంచన లేకుండా పని చేస్తారు. వైద్యుల తర్వాత ప్రధాన భూమిక పోషిస్తారు. ఫ్లోరెన్స్ నైటింగేల్ చూపిన దారే వీరికి ఆదర్శం. ప్రస్తుతం కరోనా వైరస్ బారిన పడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న అభాగ్యుల పాలిట ‘దేవుళ్లు’గా మారారు. వైరస్‌తో మానసికంగా కుంగిపోతున్న రోగులకు మనోస్థైర్యం కల్పించి వారిని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దుతున్నారు. సేవా తత్పరత చాటుతున్న కొందరు నర్సులపై ప్రత్యేక కథనం. లక్డీకాపూల్: సేవకు ప్రతిరూపమైన నర్సులు ప్రస్తుతం కరోనా వైరస్‌తో పోరాటం చేస్తున్నారు. విధి నిర్వహణలో భాగంగా శక్తివంచన లేకుండా రోగులకు సేవలు అందిస్తున్నారు. ఇందుకు తమ ప్రాణాలనే ఫణంగా పెడుతున్నారు. వైద్యులు మందులు రాస్తే.. ఆ మందులను ఎప్పుడు? ఎలా? వాడాలో వివరించి వారికి అండగా నిలుస్తున్నారు. కరోనా పాజిటివ్ రావడంతో మానసికంగా కుంగిపోతున్న రోగులకు మనోధైర్యం కల్పించి వారిని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దుతున్నారు. ప్రస్తుతం గాంధీ, నిమ్స్, ఉస్మానియా, నిలోఫర్, కింగ్‌కోఠి, ఫీవర్, చెస్ట్ ఆస్పత్రి, నేచర్ క్యూర్, సరోజినిదేవి కంటి ఆస్పత్రుల్లో విధులు నిర్వహిస్తూ ఇతరులకు మార్గదర్శకంగా నిలుస్తున్నారు నర్సులు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం! మాది రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి. మానవతామూర్తి మదర్ థెరిస్సా స్ఫూర్తితో సుమారు 14 ఏళ్ల క్రితం అవుట్ సోర్సింగ్ ప్రతిపాదికన నిలోఫర్ నవజాత శిశువుల ఆరోగ్య కేంద్రంలో స్టాఫ్ నర్సుగా చేరాను. పెళ్లయిన తర్వాత ఉద్యోగం మానేయమన్నారు. కానీ పేదలకు సేవ చేయాలనే ఆలోచనతో ఇంట్లో వాళ్లను ఒప్పించి విధులు నిర్వహిస్తున్నా. ఆస్పత్రికి వచ్చే ప్రతి బిడ్డను సొంత బిడ్డలా చూసుకుంటూ అనుక్షణం వారిని కంటికి రెప్పలా కాపాడుతున్నా. ఏప్రిల్ 15న ఓ బేబీ నిలోఫర్ అత్యవసర విభాగంలో అడ్మిటైంది. విధి నిర్వహణలో భాగంగా సదరు శిశువుకు ఇంజక్షన్లు ఇచ్చాను. శిశువు గుక్కపట్టి ఏడుస్తుంటే చూస్తూ ఊరుకోలేక ఎత్తుకుని హత్తుకున్నాను. సదరు బేబీకి 17వ తేదీన కరోనా పాజిటివ్ వచ్చింది. శిశువుకు సన్నిహితంగా మెలిగిన నాతో సహా ఆ రోజు విధుల్లో ఉన్నవారందరీనీ క్వారంటైన్ చేశారు. 25వ తేదీన నా నుంచి శాంపిల్ కలెక్ట్ చేసి, వ్యాధి నిర్ధారణ పరీక్షలకు పంపారు. రిపోర్ట్ జారీలో ఆలస్యం కావడం, అప్పటికే ఇంటి వద్ద పిల్లలు ఏడుస్తుండటంతో 27న మధ్యాహ్న మా తమ్ముని బైక్‌పై శివరాంపల్లికి వెళ్లాను. పాప ఆకలేస్తోందని ఏడ్వడం.. వంట చేసిన తర్వాత, స్వయంగా తినిపించాలని ఒత్తిడి చేయడంతో రాత్రి పాపకు అన్నం తినిపించాను. ఆ తర్వాత ఆస్పత్రి నుంచి ఫోన్ వచ్చింది. నాకు కరోనా పాజిటివ్ అని చెప్పి, గచ్చిబౌలి నుంచి 108 అంబులెన్స్‌ను పంపించారు. అదే రోజు రాత్రి గాంధీ ఆస్పత్రిలో చేర్పించారు. భర్త, ఇద్దరు పిల్లలు, అత్తామామలకు పరీక్షలు నిర్వహించగా.. నా చేత్తో అన్నం తిన్న నా కుమార్తెకు పాజిటివ్ వచ్చింది. నెగిటివ్ వచ్చిన నా భర్త సహా అత్తామామలను హోం క్వారంటైన్ చేశారు. పాజిటివ్ వచ్చిన నా బిడ్డను కింగ్‌కోఠి ఆస్పత్రిలో.. నన్ను గాంధీలో ఉంచారు. ఇలా ఒక్కొక్కరం ఒక్కో చోట ఉండిపోవాల్సి వచ్చింది. నా విజ్ఞప్తిని మన్నించి వైద్యులు నా బిడ్డను కూడా నా వద్దకే చేర్చారు. ప్రస్తుతం ఇద్దరం వైరస్‌తో పోరాడుతూనే ఉన్నాం. ఒకటి రెండు రోజుల్లో పూర్తిగా కోలుకుని ఇంటికి చేరుకుంటాం. – పద్మ, స్టాఫ్ నర్సు, నిలోఫర్ కరోనా దూరం చేసింది.. కరోనా వైరస్ కారణంగా కుటుంబ సభ్యులకు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఇప్పటికే ఒక సిస్టర్ కరోనా వైరస్‌తో బాధపడుతోంది. దాంతో ఆస్పత్రిలో నర్సులందరూ భయంగానే డ్యూటీ చేస్తున్నాం. ఈ క్రమంలో కుటుంబసభ్యులతో కాకుండా విడిగా ఉండాల్సి వస్తోంది. మా విభాగం ఎప్పుడూ పేషెంట్లతో ఫుల్‌గా ఉంటుంది. కీమోథెరపీ, రేడియాలజీ చేయించుకునే వారు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. కరోనా సమయంలో వీరందరికీ వైద్యసేవలు అందిస్తున్నాం. దాంతో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాం. – కనక తార, నర్సు,మెడికల్ ఆంకాలజీ విభాగం, నిమ్స్ చాలా ఇబ్బందిగా ఉంది.. వైరస్‌తో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ వ్యాధి సొకకుండా తీసుకుంటున్న చర్యలతో డ్యూటీ చేయడం కష్టంగానే ఉంది. రోజంతా పీపీఈతో ఉండటంతో వేడిని తట్టుకోలేకపోతున్నాం. అయినా తప్పడం లేదు. మా ఎస్ఐసీయూలో ఎప్పుడూ పేషెంట్లు ఫుల్‌గానే ఉంటున్నారు. లాక్డౌన్ ఎఫెక్ట్‌లో మాకేమీ లేదు. ఈ విభాగానికి కరోనా ప్రభావం అసల్సేదు. ఫస్ట్‌లో ఈఎండీ, ఓటీ విభాగాల్లో వైరస్ ఛాయలు కన్పించాయి. ఇద్దరు నర్సులకు.. ఇద్దరు వర్కర్లకు వైరస్ లక్షణాలు కన్పించినా ఆ తర్వాత రిపోర్ట్స్ నెగెటివ్ వచ్చాయి. ఇప్పుడు వాళ్లంతా ఆరోగ్యంగానే ఉన్నారు. ఏది ఏమైనా ఈ కరోనా చాలా గందరగోళం చేస్తోంది. – స్లీవమ్మ, నర్సు, న్యూరాలజీ విభాగం, నిమ్స్ -
మానవతామూర్తులు – నర్సులు
ఫ్లోరెన్స్ నైటింగేల్ రోగుల సపర్యల నిమిత్తం కొత్త ఒరవడిని సృష్టించిన వ్యక్తి. ఎలాంటి సౌకర్యాలూ లేని రోజుల్లో, చేతిలో దీపంతో క్షతగాత్రులకు ప్రేమతో పరిచర్యలు చేసిన మానవతామూర్తి. ప్రపంచంలోనే తొలి నర్సింగ్ స్కూల్ స్థాపించింది. ఆమె జన్మించి నేటికి 200 సంవత్సరాలు. ప్రతి ఏడాది ఫ్లోరెన్స్ నైటింగేల్ పుట్టినరోజైన మే 12న అంతర్జాతీయ నర్సుల దినోత్సవంగా ప్రపంచ వ్యాప్తంగా ఒక పండుగలా జరుపుకుంటారు. ఇప్పుడు ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ మహమ్మారిని అరికట్టేందుకు నర్సులు అహోరాత్రులు శ్రమిస్తున్నారు. బాధితులకు చికిత్స సంరక్షణను అందిస్తున్నారు. ప్రాణాలను పణంగా పెట్టి కంటికి కనిపించని వైరస్‌తో యుద్ధం చేస్తున్నారు. ఈ విపత్కర సమయంలో నర్సుల సేవలకు వెలకట్టలేం. కుటుంబాలను, తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి పని చేస్తున్నారు. కానీ, ఇప్పటికీ కొన్ని కాలనీలలో వారిని అనుమానంగా చూస్తూ వారిని అపార్ట్మెంట్లలోకి, కాలనీలలోకి రానివ్వడం లేదు. కొన్నిసార్లు మాత్రం కొన్ని ప్రదేశాల్లో పూలు జల్లి స్వాగతం పలుకుతున్నారు. మన సైన్యం కూడా కరోనా వైద్యం అందిస్తున్న వైద్య సిబ్బందిపై హెలికాఫ్టర్లతో హాస్పిటల్స్ ప్రాంతాలలో పూలు జల్లి వారికి మన అందరి తరపున కృతజ్ఞతలు తెలిపారు. వారి సేవలకు పూలు జల్లడమే కాదు వారి జీవితాలకు భరోసా ఇవ్వగలగాలి. వారికీ సహకరించి, మద్దతుగా నిలబడటం మన కనీస ధర్మం. వీరి సేవలకు గుర్తింపు తీసుకురావడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ‘నర్సులకు, ప్రసూతి ఆయాలకు మద్దతుగా నిలవాలనే‘ నినాదం ఈ సంవత్సరం తీసుకున్నది. ప్రజల ఆరోగ్యం కోసం తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సేవాదృక్పథంతో తమ విధులు నిర్వహిస్తున్న నర్సులందరికి కృతజ్ఞతలు తెలుపుకోవడం మన బాధ్యత. నర్సులను గౌరవిద్దాం. ఆస్పత్రులలోని అమ్మలూ మీకు వందనం. (నేడు అంతర్జాతీయ నర్సుల దినోత్సవం, నైటింగేల్ 200 జయంతి) పుల్లూరు వేణుగోపాల్, మొబైల్ 97010 47002 -
సేవా దీప్తి.. సహనమే స్ఫూర్తి
నేడు ప్రపంచ నర్సుల దినోత్సవం మానవ సేవయే మాధవ సేవగా భావిస్తూ.. ప్రార్థించే పెదవుల కన్నా సేవ చేసే చేతుల మిన్న.. అన్న మాటను నిజం చేస్తూ నిరంతరం అంకిత భావంతో రోగులకు సేవలందిస్తున్నారు నర్సులు. బాధితులను మేమున్నామంటూ ఓదారుస్తూ సపర్యలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆత్మీయ పలకరింపు, స్ఫూర్తిదాయక సేవలతో రోగికి స్వాంతన చేకూర్చడంలో కీలక భూమిక పోషిస్తున్నారు. ఫ్లోరెన్స్ నైటింగేల్ తమకు ఆదర్శమంటూ ఆమెను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగుతున్నారు. యుద్ధంలో, ప్రకృతి వైపరీత్యాలలో గాయపడిన క్షతగాత్రులను ప్రేమతో ఆప్యాయంగా ఆదరించి.. సేవలందించి బాధితులలో మానసిక ధైర్యాన్ని నింపిన ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతి సందర్భంగా మే 12న ప్రపంచ వ్యాప్తంగా నర్సుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. మంగళవారం నర్సుల దినోత్సవం సందర్భంగా పలువురు నర్సుల అభిప్రాయూలు వారి మాటల్లోనే.. -జంగారెడ్డిగూడెం రూరల్ నైటింగేల్ మాకు ఆదర్శం రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో వేలాది మంది నర్సులు సేవలందిస్తున్నారు. ఫ్లోరెన్స్ నైటింగేల్ మా అందరికీ ఆదర్శం. ప్రస్తుతం పలువురు నర్సులకు ఉద్యోగ భద్రత కరువైంది. కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరించి వారి ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. - డి.దయామణి, జిల్లా కాంట్రాక్టు స్టాఫ్ నర్సుల అసోసియేషన్ కార్యదర్శి సంతృప్తిగా ఉంది నర్సు వృత్తిలో చేరినప్పటి నుంచి విధిగా కాకుండా సేవగా భావించి పనిచేస్తున్నాను. రోగులను ఆప్యాయంగా పలకిస్తూ వారితో అనురాగాన్ని పంచుకుంటున్నా. వారికి ఆత్మీయతను పంచుతున్నా. ఈ వృత్తి నాకెంతో సంతృప్తిగా ఉంది. రోగులకు సేవ చేస్తూ దైవానికి సేవ చేసినట్టుగా భావిస్తున్నా. - బోడా రాజరాజేశ్వరి, నర్సు, జంగారెడ్డిగూడెం సేవే లక్ష్యంగా.. రోగి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ సపర్యలు చేస్తుంటారు నర్సులు. జిల్లాలో ఒకే ఒక్క మేల్ నర్సుగా సేవలందిస్తూ అవార్డు కూడా అందుకున్నాను. మాకు నైటింగేల్ ఆదర్శం. రెగ్యులర్, కాంట్రాక్టు సిబ్బంది అనే తారతమ్యం లేకుండా సేవే పరమావధిగా పనిచేస్తున్నాం. - దాగం వేణుగోపాలచారి, కాంట్రాక్టు స్టాఫ్ నర్సుల యూనియన్ జిల్లా అధ్యక్షుడు