
సాక్షి, తాడేపల్లి: ఇవాళ(మే 12న) అంతర్జాతీయ నర్సుల దినోత్సవం. ఈ సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ట్విటర్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు.
అత్యవసర సమయాల్లో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సేవలు అందించే సేవామూర్తులు నర్సులు అని, ‘ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న’ అన్నట్లుగా ఎంతోమందికి జీవం పోసే ప్రాణదాతలు వార’ని సీఎం జగన్ కొనియాడారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా.. నర్సులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు ఆయన.
అత్యవసర సమయాల్లో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సేవలు అందించే సేవామూర్తులు నర్సులు. `ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న` అన్నట్లుగా ఎంతోమందికి జీవం పోసేప్రాణదాతలు వారు. #InternationalNursesDay సందర్భంగా నర్సులందరికీ శుభాకాంక్షలు.
— YS Jagan Mohan Reddy (@ysjagan) May 12, 2022