సాక్షి, అమరావతి: జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, డాక్టర్లకు ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఆరోగ్య విపత్తుల సమయంలో ప్రజారోగ్య పరిరక్షణే ధ్యేయంగా పని చేస్తున్న వైద్యులు దైవంతో సమానమని, వారి సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. కోవిడ్‌పై పోరాటంలో వైద్యుల సేవలు త్యాగపూరితమైనవని, మహమ్మారిని ఎదుర్కొనే క్రమంలో ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి రోగులకు సేవలందించిన ప్రతి డాక్టర్ సేవలు అసమానమని ప్రశంసించారు. కోవిడ్‌పై పోరాటంలో వైద్యుల కుటుంబ సభ్యుల సహకారం అభినందనీయమన్నారు. తల్లిదండ్రులు జన్మనిస్తే వైద్యులు పునర్జన్మను ఇస్తారని, బాధలనుంచి శరీరాన్ని, విపత్తుల నుంచి ప్రాణాన్ని కాపాడే ప్రత్యక్ష దైవాలే డాక్టర్లని కొనియాడారు.
On this #DoctorsDay, Hon’ble CM @ysjagan has expressed his deepest gratitude to the medical fraternity for their dedicated and unparalleled service to the humanity, especially during the trying times of #covid19.
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) July 1, 2021
Comments
Please login to add a commentAdd a comment