
సాక్షి, న్యూఢిల్లీ : ప్రజారోగ్యం కోసం తమ జీవితాలను పణంగా పెట్టి పోరాడే నర్సుల సేవలు అభినందనీయమని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్బంగా ప్రధాని వారికి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రపంచం ఆరోగ్యంగా ఉండేందుకు నర్సులు 24 గంటలూ అవిశ్రాంతంగా శ్రమిస్తారని కొనియాడారు. కోవిడ్-19 మహమ్మారిని ఓడించేందుకు ప్రస్తుతం వారు గొప్ప సేవలు అందిస్తున్నారని ప్రధాని మోదీ మంగళవారం ట్వీట్ చేశారు.
నర్సులు, వారి కుటుంబాలకు మనం కృతజ్ఞతలు తెలపాలని అన్నారు. నర్సుల సంక్షేమానికి ఈరోజు మనంపునరంకితం కావాలని, పెద్దసంఖ్యలో ఈ రంగంలోకి పలువురు వచ్చేలా ప్రోత్సహించాలని చెప్పారు. కాగా, ఆధునిక నర్సింగ్ సేవలకు గుర్తుగా ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతిని ప్రపంచ నర్సుల దినోత్సవంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ఈ ఏడాది ఆమె 200వ జయంతి కావడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment