Doha Airport
-
ప్రపంచంలో బెస్ట్ ఎయిర్పోర్ట్ ఇదే..
ఖతార్ రాజధాని దోహాలోని హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రపంచంలోనే అత్యుత్తమ విమానాశ్రయంగా నిలిచింది. లండన్‌కు చెందిన పరిశోధనా సంస్థ స్కైట్రాక్స్ ఇటీవల పరిశోధన నిర్వహించి విడుదల చేసిన ర్యాంకుల్లో దోహా హమద్ ఎయిర్పోర్ట్ 2024 సంవత్సరానికి గానూ ప్రపంచంలోనే బెస్ట్ ఎయిర్‌పోర్ట్‌గా ఎంపికైంది. ప్రయాణికులు చెక్-ఇన్ విధానాలు, రాకపోకలు, షాపింగ్, భద్రత, ఇమ్మిగ్రేషన్, నిష్క్రమణ ప్రక్రియలు తదితర అంశాలపై 2023 ఆగస్టు నుంచి 2024 ఫిబ్రవరి మధ్య కాలంలో నిర్వహించిన సమగ్ర గ్లోబల్ సర్వే ఆధారంగా స్కైట్రాక్స్ ర్యాంకులు విడుదల చేసింది. జర్మనీలో ఏప్రిల్ 17న 2024 వరల్డ్ ఎయిర్పోర్ట్ అవార్డుల కార్యక్రమం జరిగింది. స్కైట్రాక్స్ ర్యాంకుల్లో దోహా హమద్ ఎయిర్పోర్ట్ మొదటి స్థానం సాధించగా సింగపూర్‌లోని చాంగి విమానాశ్రయం రెండో స్థానంలో నిలిచింది. దక్షిణ కొరియాలోని ఇంచియాన్ అంతర్జాతీయ విమానాశ్రయం మూడో స్థానంలో నిలిచింది. ఇక భారత్ విషయానికి వస్తే ఈ జాబితాలో మొదటి వంద విమానాశ్రయాలలో నాలుగు మాత్రమే భారత్‌కు చెందిన ఎయిర్‌పోర్టులు ఉన్నాయి. ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం 36వ స్థానంలో ఉండగా, బెంగళూరు ఎయిర్పోర్ట్ 59, హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 61, ముంబై ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 95వ స్థానాలలో నిలిచాయి. -
వారికి ఉచితంగా లక్ష విమాన టికెట్లు..
దోహా: అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఖతార్ ఎయిర్వేస్ కీలక ప్రకటన చేసింది. కరోనా వైరస్‌పై పోరులో ముందుండి పోరాడుతున్న వైద్య సిబ్బందికి కృతజ్ఞతా భావంగా లక్ష టికెట్లు ఉచితంగా ఇవ్వనున్నట్లు పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా సేవలు అందిస్తున్న హెల్త్ వర్కర్ల సేవా భావానికి ప్రతిఫలంగా తమవంతుగా కాప్లిమెంటరీ రౌండ్‌ట్రిప్ అందిస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఖతార్ ఎయిర్వేస్ గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అక్బర్ అల్ బాకర్..‘‘ కష్టకాలంలో కఠిన శ్రమకోర్చి పూర్తి నిబద్ధతతో, సేవా నిరతితో పనిచేస్తున్న వైద్య సిబ్బందికి ఖతార్ ఎయిర్వేస్ ధన్యవాదాలు తెలుపుతోంది. వారు చూపుతున్న దయ, అంకితభావం విలువకట్టలేనిది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో లక్షల మంది ప్రాణాలు వారు కాపాడుతున్నారు. అలాంటి వారికోసం లక్ష టికెట్లు కేటాయించాం’’ అని అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు.(మరణాల రేటును నియంత్రించిన చిన్న దేశాలు) వివిధ దేశాలకు చెందిన డాక్టర్లు, నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఇతర వైద్య సిబ్బందికి రెండు చొప్పున టికెట్లు అందజేస్తామని ఆయన పేర్కొన్నారు. ఇందుకోసం వారు అప్లికేషన్ ఫాం నింపాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఇందులో నుంచి ఎంపిక చేసిన వైద్య సిబ్బందితో పాటు మరొకరు ఎకానమీ క్లాసులో ప్రయాణించే అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా ఖతార్ ఎయిర్వేస్ అన్ని విమానాల్లో ఈ వెసలుబాటు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. అంతేగాక దోహాలోని హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం గుండా ప్రయాణించేందుకు టికెట్లు బుక్‌చేసుకున్న హెల్త్ వర్కర్లకు 35 శాతం రాయితీ ఇస్తున్నట్లు అల్ బాకర్ తెలిపారు. అయితే నవంబరు 26కు ముందుకు టికెట్లు బుక్ చేసుకున్న వారికి మాత్రమే ఈ సౌలభ్యం ఉంటుందని స్పష్టం చేశారు. డిసెంబరు 10 వరకు ఈ టికెట్లు చెల్లుబాటు అవుతాయని పేర్కొన్నారు. ఇక ఈ ఆఫర్ వివరాల కోసం ఖతార్ ఎయిర్వేస్ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చని... మే 11 నుంచి మే 18 వరకు వారం రోజుల పాటు ఈ ఆఫర్ ఉంటుందని వెల్లడించారు. United in dedication, we share our gratitude. On the occasion of International Nurses Day, from tomorrow until 18 May we're giving away 100,000 complimentary return tickets to healthcare professionals to anywhere on our network at https://t.co/DmXa4ZXLqp. #ThankYouHeroes pic.twitter.com/d88GIaOmZo — Qatar Airways (@qatarairways) May 11, 2020 -
16.23 గంటలు.. 14,535 కి.మీ.
అత్యంత ఎక్కువ దూరం ప్రయాణించే విమానం ప్రారంభం వెల్లింగ్టన్: ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ దూరం ప్రయాణించే నాన్‌స్టాప్ విమాన సర్వీసును ఖతార్ ఎయిర్వేస్ ఆదివారం ప్రారంభించింది. దోహా విమానాశ్రయం నుంచి ఆదివారం ఉదయం గం.5.02 నిమిషాలకు (స్థానిక కాలమానం) బయలుదేరిన క్యూఆర్920 విమానం సోమవారం ఉదయం గం.7.25 నిమిషాలకు (స్థానిక కాలమానం) న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌కు చేరుకుంది. 16 గంటల 23 నిమిషాల్లో 14,535 కి.మీ పయనించి, ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ దూరం ప్రయాణించే విమానంగా రికార్డు నెలకొల్పింది. విమానంలో నలుగురు పైలట్లు, 15 మంది సిబ్బంది ఉన్నారు. ఆక్లాండ్‌లో విమానానికి ఘనస్వాగతం పలికారు. ఆకాశమార్గంలో కొలిచినపుడు ఎయిరిండియాకు చెందిన ఢిల్లీ–శాన్ ఫ్రాన్సిస్కో విమానాన్ని అత్యంత ఎక్కువ దూరం ప్రయాణించేదిగా చెబుతారు. భూపరితలంపై దూరాన్ని కొలిస్తే మాత్రం ఖతార్ ఎయిర్వేస్ విమానమే ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది.