
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ) కార్గో సేవలను మరింత విస్తరిస్తూ లాభాలలో దూసుకుపోతుంది. కార్గో ద్వారా ఇప్పటికే రైతుల పంట ఉత్పత్తులను కల్లాల నుంచే నేరుగా మార్కెట్‌కు రవాణా చేస్తున్న విషయం తెలిసిందే. అతితక్కువ ధరకే రైతు ఉత్పత్తులను రవాణా చేయడం ద్వారా అన్నదాతకు అండగా నిలుస్తూ.. సంస్థకూ ఆదాయం సమకూర్చుకుంటుంది. కార్గో ద్వారా తక్కువ ఖర్చుతోనే సరుకును రవాణా చేసుకొనే అవకాశం ఉంటుంది. అంతేగాక రైతు కల్లాల నుంచే పంట ఉత్పత్తులను రవాణా చేయడం ద్వారా రైతులకు దళారుల బెడద తప్పుతుంది. నేరుగా మార్కెట్‌కు తరలించడంతో గిట్టుబాటు ధర కూడా లభిస్తుంది.
చదవండి: ఎమ్మెల్యే కారుకే సైడ్ ఇవ్వవా’.. స్పందించిన ఎండీ వీసీ సజ్జనార్
కాగా ఇటీవల వీసీ సజ్జనార్ టీఎస్‌ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి చాలా యాక్టివ్‌గా పనిచేస్తున్నారు. ప్రతి చిన్న విషయంలో జాగ్రత్తగా చర్యలు తీసుకుంటూ ప్రజలకు ఆర్టీసీ సేవలను మరింత చేరవేస్తున్నారు. ఇటీవల ఆయన చేపట్టిన కార్యక్రమాలు, తీసుకున్న నిర్ణయాలు ప్రయాణికులకు నచ్చడంతోపాటు పాటు ఆర్టీసికి కూడా లాభాలు తెచ్చిపెడుతున్నాయి. తాజాగా ఓ వినూత్న వీడియోను సజ్జనార్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
టీఆఎస్‌ఆర్టీసీ కార్గో సదుపాయం ఉండగా.. చింత అవసరం లేదని ట్విటర్‌లో పేర్కొన్నారు. ‘సరసమైన ధరలకే రైతు చెంతకే కార్గో సదుపాయం ఉంది, రైతే రాజు, అన్నదాత సుఖీభవ. టీఆఎస్‌ఆర్టీసీ రైతు నేస్తం. జై జవాన్! జై కిసాన్!!’ అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ రైతులనే కాకుండా నెటిజన్లందరిని ఎంతగానో ఆకర్షిస్తుంది. ఆర్టీసీ అభివృద్ధి కోసం సజ్జనార్ చేస్తున్న సేవలను ప్రశంసిస్తున్నారు.
చింత ఎందుకు దండగ #TSRTC కార్గో సదుపాయం ఉండగా సరసమైన ధరలకే రైతు చెంతకే కార్గో సదుపాయం, రైతే రాజు, అన్నదాత #సుఖీభవ #TSRTC రైతు నేస్తం. జై జవాన్! జై కిసాన్!!#IchooseTSRTC #farming #Sukhibhava #tuesdayvibe #tuesdaymotivations @puvvada_ajay @Govardhan_MLA @SingireddyTRS @AgriGoI pic.twitter.com/QELgptOISE
— V.C Sajjanar IPS MD TSRTC Office (@tsrtcmdoffice) November 9, 2021