రాజమహేంద్రవరం విమానాశ్రయం నుంచి త్వరలో కార్గో సేవలు | Foundation stone of Vijayawada airport's new terminal laid | Sakshi
Sakshi News home page

రాజమహేంద్రవరం విమానాశ్రయం నుంచి త్వరలో కార్గో సేవలు

Published Wed, Mar 30 2016 1:43 AM | Last Updated on Sun, Sep 3 2017 8:49 PM

రాజమహేంద్రవరం విమానాశ్రయం  నుంచి త్వరలో కార్గో సేవలు

రాజమహేంద్రవరం విమానాశ్రయం నుంచి త్వరలో కార్గో సేవలు

సాక్షి, రాజమండ్రి: రాజమహేంద్రవరం విమానాశ్రయం నుంచి త్వరలో కార్గో సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ దిశగా జరుగుతున్న ప్రయత్నాల్లో భాగంగా ఢిల్లీకి చెందిన కార్గో సర్వీసుల నిర్వహణాధికారి,  కార్గో సంస్థల ప్రతినిధులతో విమానాశ్రయం డెరైక్టర్ ఎం.రాజ్‌కిశోర్ సోమవారం సమావేశమయ్యారు. ఉభయ గోదావరి జిల్లాల్లో పరిస్థితులు, కార్గో సంస్థల వివరాలు, సేవల విషయమై చర్చించారు. ఈ సందర్భంగా రాజ్‌కిశోర్ మాట్లాడుతూ...జంబోజెట్, ఇతర భారీ విమానాల రాకపోలకు వీలుగా విమానాశ్రయాన్ని అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. రాజమహేంద్రవరం నుంచి ఇప్పటికే హైదరాబాద్‌తోపాటు బెంగళూర్, చెన్నైకి కొన్ని సర్వీసులు నడుస్తున్నాయని, త్వరలో తిరుపతి, గోవా, ముంబై తదితర ప్రాంతాలకు విమానాలు నడిపేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement