అమెరికన్ సింగర్ టేలర్ స్విఫ్ట్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తాజాగా 2024 గ్రామీ అవార్డుల్లో మరోసారి తన సత్తా చాటింది. వరుసగా నాలుగో సారి బెస్ట్ ఆల్బమ్ ఆఫ్ ద ఇయర్ అవార్డును గెల్చుకుంది. తన మిడ్‌నైట్స్ ఆల్బమ్‌కు గాను ఈ అవార్డు దక్కింది. వరుసగా నాలుగు అవార్డులను దక్కించుకున్న తొలి మహిళా సింగర్ 66 ఏళ్ల గ్రామీ అవార్డు చరిత్రలోనే ఇది రికార్డు.
ఇది తన జీవితంలో గొప్ప క్షణాలన్ని టేలర్ ఆనందం వ్యక్తం చేసింది. అంతేకాదు
"ది టార్చర్డ్ పోయెట్స్ డిపార్ట్‌మెంట్" అనే కొత్త ఆల్బమ్‌ను కూడా ఏప్రిల్ 19వ రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించి అందర్నీ సర్‌ప్రైజ్ చేసింది.
ఇక ఎస్‌జెడ్‌ఏ ఆర్ అండ్ బి పాట కోసం ఎస్‌జెడ్‌ఏ అవార్డును దక్కించుకోవడంతో ఆమె భావోద్వేగానికి లోనైంది. ఇంకా మోనెట్, బిల్లీ ఎలిష్, మైలీ సైరస్ వంటి మహిళా కేటగిరీలో నామినేషన్లలో ఆధిపత్యాన్ని కొనసాగించారు. మూడుసార్లు బెస్ట్ ఆల్బమ్ గెలిచిన సింగర్లలో స్టీవ్ వండర్, పౌల్ సిమన్, ఫ్రాంక్ సినత్రాలు ఉండటం విశేషం.
మైలీ సైరస్ ఎట్టకేలకు తొలి సారి గ్రామీ అవార్డును గెలుచుకుంది "ఫ్లవర్స్" అనే సాంగ్ ఉత్తమ పాప్ సోలో అవార్డు సొంతం చేసుకుంది. ఇంతకు ముందు ఎనిమిది సార్లు నామినేట్ అయింది. కానీ అదృష్టం వరించలేదు. కాగా అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో జరిగిన 66వ వార్షిక గ్రామీ అవార్డుల సందర్భంగా విక్టోరియా మోనెట్ ఉత్తమ నూతన కళాకారిణిగా అవార్డును స్వీకరించింది.
Taylor Swift just took the album of the year trophy from Celine Dion without batting an eye and/or acknowledging that a legendary 🐐 was handing her the award. So cringey for my soul 🫠 pic.twitter.com/J7LggDVQD8
— eazy e (@estefs) February 5, 2024
Comments
Please login to add a commentAdd a comment