మండిపోయిన ఢిల్లీ.. దేశ చరిత్రలోనే అత్యధిక ఉష్ణోగ్రత | Highest Ever Record Temperatures Records In New Delhi Mungeshpur On May 29th 2024, More Details Inside | Sakshi
Sakshi News home page

Heatwave In New Delhi: మండిపోయిన ఢిల్లీ.. దేశ చరిత్రలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు

Published Wed, May 29 2024 4:57 PM | Last Updated on Wed, May 29 2024 5:39 PM

Record Temperatures In Delhi Mageshpuri On May 29th 2024
  • మంగే‌శ్‌పూర్‌లో 52.3 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డు
  • 8302 మెగావాట్లకు చేరిన విద్యుత్‌ వినియోగం 

సాక్షి,ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ఢిల్లీ వాసులకు హీట్‌వేవ్‌ సెగ తలుగుతోంది. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో రాజధాని వాసులు బెంబేలెత్తుతున్నారు.

భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపిన వివరాల ప్రకారం ఢిల్లీ మంగేశ్‌పూర్‌ బుధవారం (మే29) మధ్యాహ్నం 2.30 గంటలకు రికార్డు స్థాయిలో 52.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దేశచరిత్రలో ఇప్పటివరకు నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత ఇదే. 

మరోపక్క ఎండ వేడిమి తట్టుకోలేక ఉపశమనం కోసం ఢిల్లీ వాసులు కూలర్లు, ఏసీలు రికార్డుస్థాయిలో వినియోగిస్తున్నారు. దీంతో ఢిల్లీలో ఎప్పుడూ లేనంతగా విద్యుత్‌ వినియోగం 8302 మెగావాట్లకు చేరింది. ఢిల్లీతో పాటు రాజస్థాన్‌లోనూ 50 డిగ్రీల ఉష్ణోగ్రత రియల్‌ ఫీల్‌ పరిస్థితులు నెలకొన్నాయి.

అంతలోనే  వర్షం...
ఓ పక్క దేశచరిత్రలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన కొద్ది సేపటికే ఢిల్లీలో అకస్మాత్తుగా వర్షం పడింది. అరేబియా సముద్రంలో అల్పపీడనం, పశ్చిమ దిశగా వీస్తున్న గాలుల ప్రభావంతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. కొద్దిసేపు ఢిల్లీలో చిరు జల్లులు కురిశాయి. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement