
న్యూఢిలీల్లో కేజీ రూ.97,100
కొన్ని నగరాల్లో రూ.లక్ష పైకి..!
న్యూఢిల్లీ: వెండి ధర దేశంలో సరికొత్త రికార్డులను చూస్తోంది. దేశ రాజధాని న్యూఢిల్లీలో కేజీ ధర క్రితం ముగింపుతో పోల్చితే బుధవారం రూ.1,150 ఎగిసి రూ.97,100కి ఎగసింది. ఆర్థిక రాజధాని ముంబైలో రూ. 3,707 ఎగసి రూ.94,118కి చేరింది. చెన్నైసహా పలు నగరాలు, కొన్ని పట్టణాల స్పాట్ మార్కెట్లలో ఏకంగా రూ.లక్ష దాటినట్లు కూడా సమాచారం అందుతోంది.
గడచిన పది రోజుల్లో వెండి ధర దాదాపు రూ.11,000 పెరిగింది. అంతర్జాతీయ ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం భయాలు విలువైన మెటల్స్ ధర పెరగడానికి కారణమన్న విశ్లేషణలు ఉన్నాయి. ఢిల్లీలో పసిడి 10 గ్రాములు పూర్తి స్వచ్ఛత ధర క్రితంతో పోలి్చతే రూ.250 పెరిగి రూ.73,200కు చేరగా, ముంబైలో రూ.222 ఎగసి రూ.72,413కి చేరింది.
Comments
Please login to add a commentAdd a comment