పండుగ సీజన్‌లో వ్యాపారాలు మూడు పువ్వులు, ఆరు కాయలుగా జరుగుతాయని అందరూ నమ్ముతారు. అయితే ఆ పండుగ సీజన్ కంటే వరల్డ్‌కప్ బాగా కలిసొచ్చిందని ఎయిర్‌లైన్స్ తాజాగా వెల్లడించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్ రోజు దేశంలో సుమారు 4.6 లక్షలమంది విమాన ప్రయాణం చేశారని, దీపావళికి కూడా చేయలేని పనిని క్రికెట్ వరల్డ్ కప్ చేసిందని ఎయిర్‌లైన్స్ స్పష్టం చేసింది. గత దీపావళి కంటే కూడా ప్రయాణికుల సంఖ్య చాలా ఎక్కువని తెలిపారు.
దీపావళి సమయంలో విమాన ప్రయాణికుల సంఖ్య పెరిగింది, కానీ అంత కంటే ఎక్కువ వరల్డ్‌కప్ ఫైనల్ రోజు ప్రయాణించారు. భారత్ ప్రపంచకప్ ఫైనల్ చేరడంతో అహ్మదాబాద్ చేరుకోవాలనే ఉత్సాహం అభిమానుల్లో కనిపించి సరికొత్త రికార్డు సృష్టించింది.
పెరిగిన చార్జీలను కూడా లెక్క చేయకుండా ఒక్కసారిగా ప్రయాణికులు రావడంతో విమానయాన సంస్థల ఆదాయం భారీగా పెరిగింది. ప్రపంచకప్ ఫైనల్ రోజు కొందరు రూ. 20,000 నుంచి రూ. 40,000 వెచ్చించి కూడా టికెట్స్ కొనుగోలు చేశారు. ఫ్లైట్ చార్జీలు ఎక్కువని కొందరు ట్రైన్ ఏసీ క్లాసులు బుక్ చేసుకుని ప్రయాణించారు. అటు విమానయాన సంస్థలు, ఇటు రైల్వే సంస్థలు బాగా సంపాదించుకోగలిగాను.
ఒకే రోజులో 4 లక్షల మంది విమాన ప్రయాణం చేయడం ఓ అరుదైన రికార్డ్. ఇది మాకు చారిత్రాత్మకమైన అవకాశం అని అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ ట్విటర్ ద్వారా వెల్లడించారు.
ఇదీ చదవండి: టీమిండియా ఓటమి - పారిశ్రామిక వేత్తల ట్వీట్స్ వైరల్
అక్టోబర్ నెలలో ప్రారంభమయ్యే పండుగ సీజన్ సద్వినియోగం చేసుకోవడానికి విమానయాన సంస్థలు గత సెప్టెంబర్ చివరి వారంలో అడ్వాన్స్ బుకింగ్ చార్జీలను పెంచడం ప్రారంభించాయి. కొందరు పెరిగిన చార్జీలను దృష్టిలో ఉంచుకుని ట్రైన్ జర్నీ చేయడానికి సిద్ధమయ్యారు. మొత్తం మీద ఇండియా వరల్డ్‌కప్ కోల్పోయినప్పటికీ.. విమానయాన సంస్థలు మాత్రం లాభాలను గడించాయి.
Comments
Please login to add a commentAdd a comment