
సాక్షి, స్పోర్ట్స్ : పాకిస్థాన్ ఓపెనర్లు కమ్రాన్ అక్మల్, సల్మాన్ బట్‌లు సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు. టీ-20 క్రికెట్‌లో అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం నెలకొల్పిన జంటగా నిలిచారు. శుక్రవారం రావల్పిండిలో జరిగిన నేషనల్ టీ-20 కప్ మ్యాచ్‌లో ఈ రికార్డు నమోదు అయ్యింది.
ఇస్లామాబాద్ రీజియన్-లాహోర్ రీజియన్ వైట్స్ మధ్య ఈ మ్యాచ్ జరిగింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లాహోర్ వైట్స్ ఓపెనర్లు బట్, అక్మల్‌లు బ్యాట్లను ఝుళిపించారు. అక్మల్ 71 బంతుల్లో 14 ఫోర్లు, 12 సిక్సర్లతో 150 పరుగులు చేయగా.. సల్మాన్ బట్ 49 బంతుల్లో 8 ఫోర్లతో 55 పరుగులు చేశాడు. వీరిద్దరూ నాటౌట్‌గా నిలవటం విశేషం. అంటే మొత్తం 20 ఓవర్లను వీరిద్దరే ఆడేశారన్న మాట. ఇక మిగతా నాలుగు పరుగులు వైడ్ల రూపంలో లభించాయి.
కాగా, తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఇస్లామాబాద్ రీజియన్స్ అసిఫ్ అలీ, బిలాల్ అలీ బౌలింగ్ దెబ్బకు 18.4 ఓవర్లలో 100 పరుగులకు ఆలౌటయ్యింది. గతంలో అత్యధిక మొదటి వికెట్ భాగస్వామ్యం 171 పరుగుల రికార్డు న్యూజిలాండ్ ఓపెనర్లు మార్టిన్ గుప్టిల్, కేన్ విలియమ్సన్‌ల పేరిట ఉండేది. 2016లో హమిల్టన్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లోనే కివీస్ ఓపెనర్లు క్రియేట్ చేశారు.
ఇది కూడా చదవండి.. తొలి బంతికే విజయం
Comments
Please login to add a commentAdd a comment