T 20 format
-
టీ20 మ్యాచ్ లో డబుల్ సెంచరీ చేసిన కరేబియన్ ఆటగాడు
-
2019 ఎన్నికలకు ‘టీ20’ ఫార్ములా
న్యూఢిల్లీ: 2019 లోక్‌సభ ఎన్నికల్లో విజయం కోసం వ్యూహ, ప్రతివ్యూహాల్లో నిమగ్నమైన బీజేపీ.. టీ20 ఫార్ములాతో విస్తృత ప్రచారానికి శ్రీకారం చుట్టబోతోంది. ప్రతీ కార్యకర్త వారి ప్రాంతంలోని 20 ఇళ్లను సందర్శించి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలపై ప్రచారం నిర్వహించడమే దీని లక్ష్యమని ఆ పార్టీ సీనియర్ నాయకుడొకరు వెల్లడించారు. ఎలాగైనా మళ్లీ కేంద్రంలో అధికారం చేపట్టాలని బీజేపీ అగ్రనాయకత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అందుకనుగుణంగా టీ20 ఫార్ములాతో పాటు ‘హర్ బూత్ దస్ యూత్’(ప్రతి పోలింగ్ బూత్‌కు 10 మంది యువత), నమో యాప్‌కు మరింత మంది అనుసంధానం, బూత్ స్థాయిలో బృందాల ఏర్పాటు వంటి వాటితో ప్రతి ఇంటికి తమ ప్రభుత్వం సాధించిన విజయాల్ని ప్రచారం చేయాలని కార్యకర్తలకు లక్ష్యాల్ని నిర్దేశిస్తోంది. 2014 కంటే మరింత ఉధృతంగా.. ప్రభుత్వ పథకాలపై పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక, బూత్ స్థాయి కార్యకర్తలు వారి వారి ప్రాంతాల్లో ప్రజల్లో అవగాహన పెంచాలని బీజేపీ ఇప్పటికే ఆదేశించింది. ప్రజలతో నేరుగా సంభాషించడమే కాక వారితో అనుసంధానం కావడమే దీని లక్ష్యమని సీనియర్ నేత పేర్కొన్నారు. 2014 కంటే ఇప్పుడు ప్రచార ఉద్యమాన్ని మరింత ఉధృతంగా కొనసాగించాలనే లక్ష్యంతో బీజేపీ కసరత్తు చేస్తోంది. నేరుగా ప్రధాని సంభాషణ: మరోవైపు వచ్చే లోక్‌సభ ఎన్నికల్లోగా దేశంలోని మెజార్టీ నియోజవర్గాలకు చెందిన పార్టీ కార్యకర్తలతో నేరుగా మాట్లాడాలనే ఆలోచనలో ప్రధాని మోదీ ఉన్నారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. నేరుగా ప్రధానితో సంభాషించడం కార్యకర్తల్లో ప్రేరణ నింపుతుందన్నాయి. -
టీ-20 ఫార్మాట్.. రికార్డు బద్ధలు కొట్టారు
సాక్షి, స్పోర్ట్స్ : పాకిస్థాన్ ఓపెనర్లు కమ్రాన్ అక్మల్, సల్మాన్ బట్లు సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు. టీ-20 క్రికెట్లో అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం నెలకొల్పిన జంటగా నిలిచారు. శుక్రవారం రావల్పిండిలో జరిగిన నేషనల్ టీ-20 కప్ మ్యాచ్‌లో ఈ రికార్డు నమోదు అయ్యింది. ఇస్లామాబాద్ రీజియన్-లాహోర్ రీజియన్ వైట్స్ మధ్య ఈ మ్యాచ్ జరిగింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లాహోర్ వైట్స్ ఓపెనర్లు బట్, అక్మల్‌లు బ్యాట్లను ఝుళిపించారు. అక్మల్ 71 బంతుల్లో 14 ఫోర్లు, 12 సిక్సర్లతో 150 పరుగులు చేయగా.. సల్మాన్ బట్ 49 బంతుల్లో 8 ఫోర్లతో 55 పరుగులు చేశాడు. వీరిద్దరూ నాటౌట్‌గా నిలవటం విశేషం. అంటే మొత్తం 20 ఓవర్లను వీరిద్దరే ఆడేశారన్న మాట. ఇక మిగతా నాలుగు పరుగులు వైడ్ల రూపంలో లభించాయి. కాగా, తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఇస్లామాబాద్ రీజియన్స్ అసిఫ్ అలీ, బిలాల్ అలీ బౌలింగ్ దెబ్బకు 18.4 ఓవర్లలో 100 పరుగులకు ఆలౌటయ్యింది. గతంలో అత్యధిక మొదటి వికెట్ భాగస్వామ్యం 171 పరుగుల రికార్డు న్యూజిలాండ్ ఓపెనర్లు మార్టిన్ గుప్టిల్, కేన్ విలియమ్సన్ల పేరిట ఉండేది. 2016లో హమిల్టన్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లోనే కివీస్ ఓపెనర్లు క్రియేట్ చేశారు. ఇది కూడా చదవండి.. తొలి బంతికే విజయం -
చాంపియన్స్ ట్రోఫీ ఇక అనుమానమే!
నాలుగేళ్ల వ్యవధిలో రెండు టి20 ప్రపంచకప్‌లు లండన్: ఇటీవల ముగిసిన చాంపియన్స్ ట్రోఫీనే ఇక ఆఖరిది కానుందా..? షెడ్యూల్ ప్రకారం 2021లో భారత్‌లో జరగాల్సిన ట్రోఫీ ఇక ఉండదా? ఐసీసీ ఆలోచనలు చూస్తుంటే ఇదంతా వాస్తవంగానే కనిపిస్తోంది. నాలుగేళ్లకోసారి అభిమానులను అలరిస్తున్న చాంపియన్స్ ట్రోఫీకి శాశ్వతంగా గుడ్‌బై పలకాలని ఐసీసీ యోచిస్తోంది. టి20 ఫార్మాట్‌కు పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని నాలుగేళ్ల వ్యవధిలో రెండు టి20 ప్రపంచకప్‌లను జరపాలని భావిస్తున్నట్టు ఐసీసీ సీఈవో డేవిడ్ రిచర్డ్సన్ తెలిపారు. అయితే ఇప్పటికీ చాంపియన్స్ ట్రోఫీకి అభిమానుల నుంచి విపరీతమైన ఆదరణ ఉండటం ఆసక్తికరం. తాజా టోర్నమెంట్‌ను కూడా విశ్వవ్యాప్తంగా కోట్లాది మంది టీవీల్లో తిలకించారు. ఇదంతా ఎలా ఉన్నా వచ్చే ట్రోఫీ జరిగేది మాత్రం గ్యారంటీ లేదని, ఈ అంశంపై ఐసీసీ వార్షిక సమావేశంలో చర్చిస్తామని రిచర్డ్సన్ తెలిపారు. ‘ప్రస్తుతానికైతే షెడ్యూల్ ప్రకారం తర్వాతి చాంపియన్స్ ట్రోఫీ 2021లో భారత్‌లో జరుగుతుంది. మార్పులు జరిగితే మాత్రం ఈ మధ్య కాలంలో రెండు టి20 ప్రపంచకప్‌లు జరిగే అవకాశం ఉంది. 50 ఓవర్లలో రెండు ప్రపంచకప్‌లు జరపడం అవసరం లేదనిపిస్తోంది. వాస్తవంగా పొట్టి ఫార్మాట్లో జరిగే ప్రపంచకప్ అందరినీ ఎక్కువగా ఆకర్షిస్తోంది. టీవీ కంపెనీలకు కూడా అధిక ఆదాయాన్ని అందిస్తోంది. అలాగే భవిష్యత్‌లో 16 లేదా 20 జట్లను ఆడించాలనే ఆలోచన కూడా ఉంది’ అని డేవిడ్ రిచర్డ్సన్ వివరించారు. -
టీ 20 వరల్డ్ కప్‌కు సిద్ధమైన టీమిండియా
-
ఫటాఫట్ క్రికెట్