Allu Arjun Pushpa Movie: New Record As Biggest Grosser At All Over Country In 2021 - Sakshi
Sakshi News home page

Pushpa Movie: 2021లో దేశంలోనే బిగ్గెస్ట్‌ గ్రాసర్‌గా 'పుష్ప'.. 3 రోజుల్లోనే..

Published Mon, Dec 20 2021 1:57 PM | Last Updated on Mon, Dec 20 2021 2:35 PM

Pushpa New Record As Biggest Grosser At All Over Country In 2021 - Sakshi

Pushpa New Record As Biggest Grosser At All Over Country In 2021: ఐకానిక్‌ స్టార్‌ అల్లు అర్జున్‌​, క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ కాంబినేషన్‌లో రూపొందిన 'పుష్ప' సినిమా బాక్సాఫీస్‌ వద్ద తగ్గేదేలే అంటూ కలెక్షన్లతో దూసుకుపోతోంది. డిసెంబర్‌17న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం ఓపెనింగ్స్‌ అదిరిపోయాయి. ఈ ఏడాది విడుదలైన చిత్రాలన్నింటిలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు నెలకొల్పింది. తొలిరోజే బిగ్గెస్ట్ గ్రాసర్‌గా నిలిచిన పుష్ప.. రెండో రోజు కూడా అదే జోరు చూపించింది. ప్రపంచ వ్యాప్తంగా తొలిరోజు 71 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం.. రెండో రోజు మరో 45 కోట్లు గ్రాస్ వసూలు చేసినట్లు తెలుస్తుంది. అలా రెండు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 116 కోట్ల గ్రాస్ సాధించినట్లు సమాచారం.  

తాజాగా 'పుష‍్ప: ది రైజ్‌' చిత్రం సరికొత్త రికార్డును నెలకొల్పింది. కేవలం మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 173 కోట్ల వసూళ్లు సాధించి అదిరిపోయే రికార్డు క్రియేట్‌ చేసింది. ఆదివారం (డిసెంబర్‌ 19) భారీ కలెక్షన్లతో దుమ్ములేపిన పుష్పరాజ్‌ 2021 సంవత్సరంలో దేశంలోనే బిగ్గెస్ట్ గ్రాసర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో మంగళవారం (డిసెంబర్‌ 21) తిరుపతిలో సక్సెస్‌ పార్టీ నిర్వహించనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. పుష్పరాజ్‌గా బన్నీ యాక్టింగ్‌ ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. తెలుగు, తమిళంతోపాటు హిందీలోనూ మంచి కలెక్షన్లను వసూలు చేసింది 'పుష‍్ప'. ఈ సినిమా సెకండ్‌ పార్ట్‌ 'పుష్ప: ది రూల్‌' షూటింగ్‌ ఫిబ్రవరిలో ప్రారంభం కానుంది. 



ఇదీ చదవండి: 'పుష్ప రాజ్‌'పై 'చిట్టిబాబు' రియాక్షన్‌.. ఏమన్నాడంటే ?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement