'పుష్ప' ట్రైలర్‌పై సమంత రియాక్షన్‌.. ఏమందో తెలుసా ? | Samantha Tweet On Pushpa Movie Trailer | Sakshi
Sakshi News home page

Samantha On Pushpa Trailer: 'పుష్ప' ట్రైలర్‌పై సమంత ట్వీట్‌.. ఏమందో తెలుసా ?

Published Tue, Dec 7 2021 11:52 AM | Last Updated on Tue, Dec 7 2021 12:05 PM

Samantha Tweet On Pushpa Movie Trailer - Sakshi

Samantha Tweet On Pushpa Movie Trailer: టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ కాంబినేషనల్‌లో పదేళ్ల తర్వాత వస్తున్న చిత్రం 'పుష్ప: ది రైజ్‌'. పాన్‌ ఇండియాగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు. ఇప్పటికే విడుదలైన పాటలు, పాత్రల ఫస్ట్ లుక్‌ పోస్టర్లు, మేకింగ్ వీడియో ప్రేక్షకులను అలరిస్తున్నాయి. తాజాగా సినిమా ట్రైలర్‌ను ఊరించి ఊరించి సోమవారం (డిసెంబర్‌ 6) విడుదల చేశారు. ఈ ట్రైలర్‌ జనాలను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇందులో అల్లు అర్జున్‌ మాస్‌ గెటప్‌కు ఫ్యాన్స్‌ ఫిదా అయిపోతున్నారు. ఈ ట్రైలర్‌పై పలువురు సెలబ్రిటీలు తమదైన స్టైల్‌లో స్పందిస్తున్నారు. 

తాజాగా పుష్ప మూవీ ట్రైలర్‌పై స్టార్‌ హీరోయిన్‌ సమంత స్పందించింది. 'పుష్ప రాజ్‌.. తగ్గేదే లే..' అని రాసి ఫైర్‌ ఎమోజీస్‌ను ట్వీట్‌ చేసింది సామ్‌. ఈ సినిమాలో సమంత ఐటెం సాంగ్‌ చేస్తున్నట్లు తెలిసిందే. ప్రస్తుతం ఈ స్పెషల్‌ సాంగ్‌కు సంబంధించిన షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది. మరో రెండు రోజుల్లో ఈ పాట చిత్రీకరణ పూర్తవుతుందని సమాచారం. హైదరాబాద్‌లోనే గ్రాండ్‌గా ప్రీరిలీజ్‌ ఈవెంట్ ప్లాన్‌ చేస్తున్నారట. 'పుష్ప' డిసెంబర్‌ 17న ప్రేక్షకుల మందుకు రానున్నాడు. 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

ఇదీ  చదవండి: 'పుష్ప' మేకింగ్‌ వీడియో వైరల్‌.. బన్నీ మెసేజ్‌ సూపర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement