సాక్షి, స్పోర్ట్స్ : మహిళల వన్డే మ్యాచ్‌లో అద్భుతం చోటుచేసుకుంది. విదర్భ జట్టు మీడియం పేస్ బౌలర్ కోమల్ జన్‌జాద్ బంతితో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఎనిమిది పరుగులిచ్చి ఏకంగా 9 వికెట్లు నేలకూల్చారు. గురువారం విదర్భ-హరియాణా జట్ల మధ్య జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఈ రికార్డు నెలకొంది.
మొత్తం 9.4 ఓవర్లలో 5 మెయిడెన్లు కాగా.. 8 పరుగులిచ్చి 9 వికెట్లు తీసుకున్నారు. కోమల్ దెబ్బకు హరియాణా బ్యాట్స్‌విమెన్ పెవిలియన్‌కు క్యూకట్టారు. ఆ జట్టు కెప్టెన్ ఎస్ఎం ఖత్రి చేసిన ఏడు పరుగులే అత్యధికం కావడం గమనార్హం. హరియాణా జట్టు 18.4 ఓవర్లలో 31 పరుగులకే కుప్పకూలింది.
అనంతరం 32 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన విదర్భ జట్టు కేవలం 4.4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా విజయాన్ని అందుకుంది. 32 పరుగుల్లో ఓపెనర్ ఎల్ఎం ఇనామ్‌దార్ 30 పరుగులు(18 బంతుల్లో ఏడు ఫోర్లు) సాధించగా.. మరో ఎండ్‌లో ఉన్న బ్యాట్స్ ఉమన్ రెండు పరుగులు సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment