ODI Records
-
అదేం బ్యాటింగ్ సామీ!.. ఊచకోతే.. రోహిత్ రికార్డు బద్దలు
పరిమిత ఓవర్ల క్రికెట్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ ట్రవిస్ హెడ్. విధ్వంసకర బ్యాటింగ్‌తో బౌలర్లకు చుక్కలు చూపిస్తూ తనకు తానే సాటి అన్నట్లుగా ముందుకు సాగుతున్నాడు. ఇప్పటికే టీ20 ఫార్మాట్లో పవర్ ప్లేలో అత్యధిక స్ట్రయిక్‌రేటుతో అత్యధిక పరుగులు రాబట్టిన క్రికెటర్‌గా కొనసాగుతున్న హెడ్.. వన్డేల్లోనూ హవా కొనసాగిస్తున్నాడు.ఆరోజు టీమిండియాపైటీమిండియాతో వన్డే వరల్డ్‌కప్-2023 ఫైనల్లో ఈ లెఫ్టాండర్ బ్యాటర్ సృష్టించిన పరుగుల సునామీని ఎవరూ అంత తేలికగా మర్చిపోలేరు. నీలిసంద్రమైన అహ్మదాబాద్ స్టేడియంలో.. అశేష టీమిండియా అభిమానుల నడుమ.. 137 పరుగులతో హెడ్ చెలరేగాడు. బౌండరీల వర్షం కురిపిస్తూ చేతికే బ్యాట్ మొలిచిందా అన్నట్లు పరుగుల వరద పారించాడు. 120 బంతుల్లో 15 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో అద్భుత శతకం సాధించి.. రోహిత్ సేనకు పీడకలను మిగిల్చాడు. తాజాగా.. ట్రవిస్ హెడ్ మరోసారి అదే తరహా సునామీ ఇన్నింగ్స్‌తో ప్రేక్షకులను అలరించాడు. అతడి పరుగుల దాహానికి ఇంగ్లండ్ బౌలర్లు బలిఈసారి అతడి పరుగుల దాహానికి ఇంగ్లండ్ బౌలర్లు బలయ్యారు. నాటింగ్‌హామ్‌లోని ట్రెంట్‌బ్రిడ్జ్ వేదికగా గురువారం జరిగిన వన్డేలో హెడ్ పరుగుల సునామీ సృష్టించాడు. 129 బంతులు ఎదుర్కొన్న అతడు ఇంగ్లండ్ బౌలింగ్‌ను చీల్చి చెండాడుతూ.. ఏకంగా 20 ఫోర్లు, 5 సిక్స్‌లు బాదాడు.రికార్డులు సాధించిన హెడ్మొత్తంగా 154 పరుగులతో అజేయంగా నిలిచి ఇంగ్లండ్‌పై ఆస్ట్రేలియాకు విజయాన్ని అందించాడు. ఈ క్రమంలో పలు రికార్డులను ట్రవిస్ హెడ్ తన ఖాతాలో జమచేసుకున్నాడు. ఆస్ట్రేలియా తరఫున ఇంగ్లండ్‌పై వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన రెండో ప్లేయర్‌గా నిలిచాడు. అంతకు ముందు షేన్ వాట్సన్ 2011లో 161 పరుగులతో అజేయంగా నిలిచాడు.ఇక ఆస్ట్రేలియా తరఫున వన్డే ఇన్నింగ్స్‌లో అత్యధిక ఫోర్లు(20) బాదిన మూడో క్రికెటర్‌గానూ హెడ్ మరో రికార్డు సాధించాడు. ఈ జాబితాలో డేవిడ్ వార్నర్(24), గ్లెన్ మాక్స్వెల్(21) హెడ్ కంటే ముందున్నారు. అయితే, ఈ రెండు ఘనతలతో పాటు మరో అరుదైన ఫీట్‌ను కూడా ఈ లెఫ్టాండర్ బ్యాటర్ అందుకున్నాడు. రోహిత్ శర్మ పేరిట ఉన్న రికార్డు బద్దలుట్రెంట్బ్రిడ్జి స్టేడియంలో వన్డే లక్ష్య ఛేదనలో విజయవంతమైన జట్టు తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన క్రికెటర్‌గా హెడ్ చరిత్రకెక్కాడు. తద్వారా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పేరిట ఉన్న రికార్డును బద్దలుకొట్టాడు. 2018లో రోహిత్ ఇదే స్టేడియంలో 114 బంతుల్లో 137 పరుగులు చేసి భారత్‌ను గెలిపించాడు.ఇదిలా ఉంటే.. ఇప్పటికే రోహిత్ శర్మ సృష్టించిన ఓ అరుదైన రికార్డును హెడ్ బ్రేక్ చేసిన విషయం తెలిసిందే. వన్డే ప్రపంచకప్-2023 సందర్భంగా.. న్యూజిలాండ్‌పై హెడ్ 59 బంతుల్లోనే శతకం పూర్తి చేసుకున్నాడు. తద్వారా వన్డే వరల్డ్‌కప్ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన తొలి ఓపెనర్‌గా హెడ్ నిలిచాడు. అంతకుముందు ఈ రికార్డు రోహిత్ పేరిట ఉండేది.ఇదే ఎడిషన్‌లో అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్‌లో రోహిత్ 63 బంతుల్లోనే సెంచరీ మార్కు అందుకున్నాడు. ఇలా రోహిత్ సాధించిన రెండు అరుదైన రికార్డులను బద్దలు కొట్టాడు హెడ్. అత్యంత దురదృష్టవంతుడైన వ్యక్తిఇక వరల్డ్‌కప్ ఫైనల్లో టీమిండియాపై ఆసీస్ విజయం తర్వాత హెడ్ మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అత్యంత దురదృష్టవంతుడైన వ్యక్తి బహుశా రోహితే అయ్యుంటాడని పేర్కొన్న విషయం తెలిసిందే. అద్భుత ఫామ్‌లో ఉన్నా జట్టుకు ట్రోఫీ అందించలేకపోయాడనే ఉద్దేశంతో హెడ్ అలా వ్యాఖ్యానించాడు.చదవండి: Eng Vs Aus: లబుషేన్ ప్రపంచ రికార్డు.. వన్డే చరిత్రలోనే తొలి క్రికెటర్‌గాThe perfect 𝐇𝐄𝐀𝐃 start for the Aussies in the ODI series 💯 🇦🇺#SonySportsNetwork #ENGvAUS #TravisHead | @travishead34 pic.twitter.com/PBItCBhPKE— Sony Sports Network (@SonySportsNetwk) September 20, 2024 -
విధ్వంసకర ఇన్నింగ్స్.. వన్డేల్లో హెన్రిచ్ క్లాసెన్ వరల్డ్ రికార్డు
దక్షిణాఫ్రికా బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ తన విశ్వరూపం ప్రదర్శించాడు. ఆస్ట్రేలియాతో శుక్రవారం జరిగిన నాలుగో వన్డేలో 83 బంతుల్లో 13 ఫోర్లు, 13 సిక్స్‌లు బాది 174 పరుగులు సాధించాడు. 38 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న క్లాసెన్ 57 బంతుల్లోనే సెంచరీని అందుకున్నాడు. ఆ తర్వాత 26 బంతుల్లో మరో 74 పరుగులు సాధించాడు. రికార్డుల క్లాసెన్ తద్వారా క్లాసెన్ పలు అరుదైన రికార్డులు నెలకొల్పాడు. వన్డే చరిత్రలో అత్యంత వేగంగా ఆస్ట్రేలియాపై శతకం బాదిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు. అంతకు ముందు టీమిండియా బ్యాటర్ 52 బంతుల్లో ఆసీస్‌పై శతక్కొట్టాడు. అత్యధిక సిక్సర్లు కొట్టిన రెండో బ్యాటర్‌గా అదే విధంగా.. వన్డే క్రికెట్ చరిత్రలో క్లాసెన్ ఐదో వేగవంతమైన సెంచరీ నమోదు చేశాడు. అంతేకాదు.. ఒకే బౌలర్ బౌలింగ్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన రెండో బ్యాటర్‌గానూ నిలిచాడు. ఆడం జంపా బౌలింగ్‌లో ఆరు సిక్సర్లు బాది ఈ ఘనత సాధించాడు. గతంలో ఆడం ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ అఫ్గనిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ బౌలింగ్‌లో ఏడు సిక్స్‌లు కొట్టాడు. 2019 వరల్డ్‌కప్ సందర్భంగా మోర్గాన్ ఈ రికార్డు సాధించాడు. వన్డేల్లో క్లాసెన్ వరల్డ్ రికార్డు ఇవన్నీ ఒకెత్తైతే.. వన్డేల్లో 200కు పైగా స్ట్రైక్‌రేటుతో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన తొలి క్రికెటర్‌గా క్లాసెన్ చరిత్ర సృష్టించడం వేరే లెవల్! అంతకు ముందు ఈ రికార్డు సంయుక్తంగా.. సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్(245.45 స్ట్రైక్‌రేటుతో 162 పరుగులు నాటౌట్), ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్(231.41 స్ట్రైక్‌రేటుతో 162 పరుగులు, నాటౌట్) పేరిట ఉండేది. ఆడం జంపా చెత్త రికార్డు ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో క్లాసెన్‌తో పాటు.. మిల్లర్ (45 బంతుల్లో 82 నాటౌట్; 6 ఫోర్లు, 5 సిక్స్‌లు), డసెన్ (62; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) కూడా అదరగొట్టారు. దాంతో తొలుత దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 416 పరుగులు సాధించింది. ఈ క్రమంలో వన్డేల్లో అత్యధికంగా ఏడుసార్లు 400 అంతకంటే ఎక్కువ పరుగులు సాధించిన జట్టుగా దక్షిణాఫ్రికా రికార్డు నెలకొల్పింది. భారత్ ఆరుసార్లు ఈ ఘనత సాధించింది. సిరీస్ సమం మరోవైపు ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడమ్ జంపా 10 ఓవర్లలో 113 పరుగులిచ్చాడు. వన్డే మ్యాచ్‌లో అత్యధిక పరుగులిచ్చిన బౌలర్‌గా మిక్ లూయిస్ (10 ఓవర్లలో 113; ఆస్ట్రేలియా; 2006లో దక్షిణాఫ్రికాపై) పేరిట ఉన్న చెత్త రికార్డును జంపా సమం చేశాడు. ఇక 417 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆ్రస్టేలియా 34.5 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. అలెక్స్ క్యారీ (77 బంతుల్లో 99; 9 ఫోర్లు, 4 సిక్స్‌లు) సెంచరీ కోల్పోయాడు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో రెండు జట్లు 2–2తో సమంగా ఉన్నాయి. చివరిదైన ఐదో వన్డే ఆదివారం జరుగుతుంది. చదవండి: టీమిండియాకు షాక్.. ఫైనల్‌కు ఆల్‌రౌండర్ దూరం! లంకకు యువ క్రికెటర్.. #Klassen🥵@Heini22 🔥#OrangeArmy 💥@SunRisers 🧡#SAvsAUS😺😸 pic.twitter.com/DEoOrZuCpp — Bhagi👰 (@orangearmylub) September 16, 2023 💯 for Klassen infront of his home crowd !! 100(57)* He was batting on 29(28) Scored the next 71 runs off 29 balls#Klassen #SAvAus pic.twitter.com/wCrMXYiB0r — Karthik Rao (@Cric_Karthikk) September 15, 2023 -
‘ఈజీగా 80 సెంచరీలు కొట్టేస్తాడు’
ముంబై : టీమిండియా సారథి విరాట్ కోహ్లిపై మాజీ టెస్టు బ్యాట్స్‌మన్ వసీం జాఫర్ ప్రశంసల జల్లు కురిపించాడు. వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో కోహ్లి సెంచరీ సాధించిన అనంతరం జాఫర్ ట్విటర్ వేదికగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 11 ఇన్నింగ్స్‌ల అనంతరం వెస్టిండీస్‌పై సెంచరీ సాధించి కోహ్లి తన పరుగుల దాహం తీర్చుకున్నాడని ప్రశంసించాడు. ప్రసుత ఫామ్ దృష్ట్యా టీమిండియా సారథి విరాట్ కోహ్లి వన్డేల్లో సులువుగా 75-80 శతకాలు నమోదు చేస్తాడని జోస్యం చెప్పాడు. అంతేకాకుండా తన అంచనా తప్పకుండా నిజమవుతుందని ధీమా వ్యక్తం చేశాడు. టీమిండియా తరుపున 31 టెస్టులాడిన జాఫర్ 34.11 సగటుతో 1944 పరుగులు సాధించాడు. ఇందులో రెండు డబుల్ సెంచరీలు, ఐదు సెంచరీలు ఉన్నాయి. ప్రస్తుతం జాఫర్ బంగ్లాదేశ్ బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా సేవలు అందిస్తున్నాడు. ప్రపంచకప్‌లో టీమిండియా ఓటమి అనంతరం జాఫర్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లి కెప్టెన్సీని టెస్టులకే పరిమితం చేసి, రోహిత్ శర్మకు వన్డే, టీ20 కెప్టెన్సీ పగ్గాలు అప్పగించాలని బీసీసీఐకి సూచించిన విషయం తెలిసిందే. ఇక వెస్టిండీస్‌పై సాధించిన శతకం కోహ్లికి 42వది కావడం విశేషం. మరో ఎనిమిది సెంచరీలు సాధిస్తే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్(49) రికార్డును బ్రేక్ చేస్తాడు. ఇక ఇప్పటివరకు 238 వన్డేలు ఆడిన కోహ్లి 59.91 సగటుతో 11,406 పరుగులు సాధించాడు. ఇందులో 42 శతకాలు, 54 అర్దసెంచరీలు ఉన్నాయి. ఇక ఓవరాల్‌గా పరుగుల పరంగా వన్డేల్లో సచిన్(18,426) తర్వాత స్థానంలో కోహ్లి కొనసాగుతున్నాడు. (చదవండి: పాట వినిపిస్తే చాలు చిందేస్తా) -
ఎవరు సాధిస్తారు.. కోహ్లినా? గేలా?
గయానా: టీమిండియా పరుగుల యంత్రం, సారథి విరాట్ కోహ్లి మరో అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. ఇంగ్లండ్ వేదికగా జరిగిన ప్రపంచకప్‌లో అంతగా ఆకట్టుకోలేకపోయిన ఈ స్టార్ బ్యాట్స్‌మన్.. వెస్టిండీస్‌తో జరిగిన టి20 సిరీస్‌లో మళ్లీ ఫామ్ అందుకున్నాడు. గురువారం నుంచి ఆరంభం కానున్న మూడు వన్డేల సిరీస్‌లో కోహ్లి మరో రికార్డును సృష్టించే అవకాశం ఉంది. ఈ సిరీస్‌లో కోహ్లి 144 పరుగులు సాధిస్తే విండీస్ మాజీ ఆటగాడు రామ్‌నరేశ్ శర్వాన్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొడతాడు. వెస్టిండీస్ గడ్డపై టీమిండియా-విండీస్ వన్డే సిరీస్‌లలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్లలో శర్వాన్( 17 మ్యాచ్‌ల్లో 700 పరుగులు) ఆగ్రస్థానంలో ఉన్నాడు. అయితే కోహ్లి ఇప్పటివరకు కరేబియన్ గడ్డపై 12 వన్డేల్లో 55.60 సగటుతో 556 పరుగులు సాధించాడు. దీంతో ఈ సిరీస్‌లోనే కోహ్లి ఈ రికార్డును అధిగమిస్తాడని అభిమానులు, విశ్లేషకులు అభిప్రాయపడతున్నారు. అంతేకాకుండా విండీస్ విధ్వంసకర ఆటగాడు క్రిస్ గేల్ కూడా శర్వాన్, కోహ్లి రికార్డులపై కన్నేశాడు. ఇప్పటివరకు 512 పరుగులు సాధించిన గేల్‌కు శర్వాన్ రికార్డును అందుకోవడం అంత కష్టమేమి కాదు. టీమిండియాతో సిరీస్ అనంతరం గేల్ వీడ్కోలు పలకనున్నాడు. దీంతో ఈ సిరీస్‌లో మెరుగైన ప్రదర్శన చేసి ఘనంగా వీడ్కోలు పలకాలని భావిస్తున్నాడు. ఇక ఇప్పటికే ఓవరాల్‌గా భారత్-వెస్టిండీస్ వన్డే సిరీస్‌లలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా కోహ్లి రికార్డు సృష్టించాడు. అతడు 33 మ్యాచ్‌ల్లో 70.81 సగటుతో 1912 పరుగులు సాధించాడు. అతడి తర్వాత మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 39 మ్యాచ్‌ల్లో 1573 పరుగులు సాధించి రెండో స్థానంలో ఉన్నాడు. -
రోహిత్ ఒకే ఒక్కడు..
హైదరాబాద్ : టీమిండియా హిట్‌మ్యాన్ రోహిత్ శర్మకు సంబంధించిన ఓ ఘనత సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. 2017 అగస్టు 1 నుంచి ప్రపంచకప్ ముగిసేవరకు అత్యధిక వన్డేలు(95) ఆడిన ఆటగాడిగా రోహిత్ రికార్డు సృష్టించాడు. సారథి విరాట్ కోహ్లి టెస్టులకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో రోహిత్ విరామం లేకుండా వన్డేల్లో ఆడుతున్నాడు. దీంతో 2017 అగస్టు నుంచి టీమిండియా 111 వన్డేలు ఆడగా రోహిత్ కేవలం పదహారు మ్యాచ్‌ల్లో మాత్రమే ఆడకపోవడం విశేషం. ఇక ఈ వ్యవధిలోనే అత్యధిక వన్డే మ్యాచ్‌లు ఆడిన జట్టుగా టీమిండియా(111) నిలిచింది. ఈ జాబితాలో తర్వాతి స్థానాల్లో ఇంగ్లండ్(89), శ్రీలంక(88), పాకిస్తాన్(88)జట్లు ఉన్నాయి. ఇక ఓవరాల్‌గా ఇలాంటి ఘనత అందుకున్న ఒకే ఒక ఆటగాడిగా రోహిత్ నిలిచాడని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. తాజాగా ముగిసిన ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా, అదేవిధంగా ఒక ప్రపంచకప్‌లో అత్యధిక సెంచరీలు(5) సాధించిన ఆటగాడిగా రోహిత్ రికార్డు నెలకొల్పిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనకు రోహిత్ సన్నద్దమవుతున్నాడు. ఇక ఈ పర్యటనలో టీమిండియా మూడు వన్డేలు, మూడు టీ20లు, రెండు టెస్టుల ఆడునుంది. ఈ పర్యటనకు ముందుగా వన్డే, టీ20లకు కోహ్లికి విశ్రాంతినిచ్చి రోహిత్‌ను సారథ్య పగ్గాలు అప్పగించాలని సెలక్టర్లు భావించారు. అయితే విశ్రాంతి తీసుకోవడానికి కోహ్లి అయిష్టత చూపడంతో అతడి సారథ్యంలోని భారత జట్టునే సెలక్టర్లు ప్రకటించారు. -
కైఫ్ రికార్డును సమం చేసిన వోక్స్
నాటింగ్‌హామ్: ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్తాన్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ క్రిస్ వోక్స్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. స్థానిక ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో వోక్స్ ఏకంగా నాలుగు క్యాచ్‌లు అందుకున్నాడు. ఇందులో ఓ క్యాచ్ ఇన్నింగ్స్‌కే హైలెట్‌గా నిలిచింది. దీంతో వోక్స్ ప్రపంచకప్‌లో అత్యధిక క్యాచ్‌లు(4) పట్టిన ఫీల్డర్‌గా టీమిండియా మాజీ ఆటగాడు మహ్మద్ కైఫ్ సరసన చేరాడు. ఇక ఇదే మ్యాచ్‌లో ఈ ఆల్‌రౌండర్ మూడు కీలక వికెట్లు పడగొట్టడం విశేషం. పాక్ సరికొత్త రికార్డు ఇక పాక్ బ్యాట్స్‌మెన్ బాబర్ అజామ్(63), హఫీజ్ (84), సర్పరాజ్ అహ్మద్(55)లు రాణించడంతో పాక్ 348 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అయితే ఏ ఒక్క బ్యాట్స్‌మెన్ సెంచరీ చేయనప్పటికీ భారీ స్కోర్ సాధించడంతో ప్రపంచకప్‌లో పాక్ సరికొత్త రికార్డును సృష్టించింది. గత వరల్డ్‌కప్‌లో యూఏఈపై దక్షిణాఫ్రికా జట్టులో ఎవరూ శతకం సాధించకుండానే 341 పరుగుల చేసింది. ఇదే ఇప్పటివరకు అత్యుత్తం కాగా ఆ రికార్డును తాజాగా పాక్ బద్దలుకొట్టింది. గెలిస్తే ఇంగ్లండ్ రికార్డే.. పాకిస్తాన్ నిర్దేశించిన 349 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తే ఇంగ్లండ్ సరికొత్త రికార్డును సృష్టిస్తుంది. ప్రపంచకప్‌లో 329 పరుగుల ఛేజింగే ఇప్పటివరకు అత్యుత్తమం. అది కూడా 2011 ప్రపంచకప్ సందర్భంగా ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ రికార్డును ఇంగ్లండ్ సాధించింది. అయితే ప్రపంచకప్‌కు ముందు పాక్‌తో జరిగిన సిరీస్‌లో భారీ లక్ష్యాలను అవలీలలగా ఛేదించిన విషయం తెలిసిందే. -
కోహ్లి రికార్డులను అందుకుంటా..
హైదరాబాద్ : ప్రస్తుత క్రికెట్లో అత్యంత గొప్ప బ్యాట్స్‌మన్‌గా ఖ్యాతి గండించిన ఆటగాడు టీమిండియా సారథి విరాట్ కోహ్లి. ఇప్పటికే ప్రపంచ క్రికెట్లో ఎదురులేని బ్యాట్స్‌మన్‌గా ఎదిగిన కోహ్లి పరగుల వరద పారిస్తున్నాడు. ఎన్నో రికార్డులు.. మరెన్నో అవార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. అయితే కోహ్లి రికార్డులపై ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ జోస్ బట్లర్ కన్నేశాడు. వన్డే క్రికెట్లో కోహ్లిని అందుకుంటానని ఈ ఇంగ్లీష్ బ్యాట్స్‌మన్ ధీమా వ్యక్తం చేస్తున్నాడు. ఎవరు అత్యున్నత శిఖరాలను అవరోధించకూడదని కోరుకుంటారని ప్రశ్నించారు. ప్రస్తుతం వన్డే క్రికెట్లో కోహ్లి అత్యున్నత శిఖరంలో ఉన్నాడని.. ఆ శిఖరాన్ని అందుకోవడమే తన కర్తవ్యమని పేర్కొన్నాడు. ఇక ఇప్పటివరకు 227 వన్డేలు ఆడిన కోహ్లి 41 సెంచరీలు, 49 అర్ధసెంచరీల సహాయంతో 10,843 పరుగులు సాధించాడు. ప్రతిష్టాత్మక విదేశీ టెస్టులపై ఫోకస్ పెట్టిన కోహ్లి.. 2016 నుంచి పరిమిత ఓవర్ల క్రికెట్లో చాలా తక్కువ మ్యాచ్‌లు ఆడుతున్నాడు. లేకుంటే వన్డేల్లో మరిన్ని రికార్డులు కొల్లగొట్టేవాడు. ఇక 28 ఏళ్ల బట్లర్ 126 వన్డేల్లో ఏడు సెంచరీలు, 18 అర్ధ సెంచరీల సహాయంతో 3387 పరుగులు సాధించాడు. గతేడాది ఐపీఎల్లో బట్లర్ సుడిగాలి ఇన్నింగ్స్‌లు ఆడి రాజస్తాన్ రాయల్స్‌కు అపూర్వ విజయాలు అందించాడు. ఆ సీజన్లో 13 మ్యాచ్‌లాడిని ఈ ఇంగ్లీష్ బ్యాట్స్‌మన్ 155.24 స్ట్రైక్ రేట్‌తో 548 పరగులు సాధించాడు. (ధోని లేకుంటే కోహ్లి డమ్మీనే!) -
అజేయంగా 370 పరుగులు చేశాడు!
బులవాయో: అంతర్జాతీయ వన్డే క్రికెట్లో ఫఖర్ ‘జమానా’ మొదలైంది. పరిమిత ఓవర్ల క్రికెట్ ఫార్మెట్లోకి అడుగుపెట్టిన కొద్ది రోజుల్లోనే పాకిస్థాన్ ఓపెనర్ ఫఖర్ జమాన్ రికార్డుల మోత మోగిస్తున్నాడు. ఈ క్రమంలో వన్డే క్రికెట్లో వేగవంతంగా 1000 పరుగులు మైలురాయిని అందుకున్నాడు. తాజాగా జింబాబ్వేతో జరిగిన ఐదు వన్డేల ద్వైపాక్షిక సిరీస్‌లో ఫఖర్ పరుగుల పండుగ చేసుకున్నాడు. అత్యద్భుతంగా రాణించి బ్యాటింగ్‌లో పలు రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు. ఐదు వన్డేల ద్వైపాక్షిక సిరీస్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన ఘనత కూడా దక్కించుకున్నాడు. ఐదు మ్యాచ్‌ల్లో 257.5 సగటుతో 515 పరుగులు చేశాడు. ఇందులో డబుల్ సెంచరీ(210), సెంచరీ(117), రెండు అర్ధసెంచరీలు ఉన్నాయి. ఈ ఐదు వన్డేల్లో మూడుసార్లు అతడు నాటౌట్‌గా నిలవడం విశేషం. అంటే అజేయంగా 370 పరుగులు సాధించాడన్న మాట. 28 ఏళ్ల ఫఖర్ జమాన్ అంతర్జాతీయ వన్డే క్రికెట్లో ఇప్పటివరకు 18 మ్యాచ్‌లాడి 76.07 సగటుతో మొత్తం 1065 పరుగులు చేశాడు. అందులో మూడు సెంచరీలు, ఆరు అర్ధ సెంచరీలున్నాయి. అత్యధిక వ్యక్తిగత స్కోరు 210 పరుగులు నాటౌట్. ఐదు వన్డేల ద్వైపాక్షిక సిరీస్‌ల్లో అత్యధిక పరుగులు.. 1. ఫఖర్ జమాన్(515)- పాకిస్తాన్ 2. హెచ్. మసకజ్జా(467) - జింబాబ్వే 3. సల్మాన్‌భట్(451)- పాకిస్తాన్ 4. మహ్మద్ హఫీజ్(448)- పాకిస్తాన్ 5. రోహిత్ శర్మ(441)- భారత్ -
నా రికార్డు బద్దలు చేసేది అతనే: సచిన్
ముంబై : వన్డేల్లో తన పేరిట ఉన్న అత్యధిక సెంచరీల(49) రికార్డును టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి బద్దలు కోడుతాడని దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ అభిప్రాయపడ్డాడు. క్రికెట్ చరిత్రలో చెరుగని ముద్ర వేసుకున్న సచిన్ నేడు 45వ పుట్టినరోజు జరుపుకుంటున్న విషయం తెలిసిందే. తన పుట్టిన రోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సచిన్ తన రికార్డు బ్రేక్ అనంతరం కెప్టెన్ కోహ్లితో షాంపెన్ బాటిల్‌ను పంచుకుంటానన్నాడు. ‘‘నేను అతనికి షాంపెన్ బాటిల్‌ను పంపించను. నా రికార్డును అధిగమించిన అనంతరం నేనే స్వయంగా వెళ్లి అతనితో షాంపెన్ బాటిల్‌ను పంచుకుంటా.’’ అని సచిన్ వ్యాఖ్యానించాడు. ఇక కోహ్లి బ్యాటింగ్‌లో సూపర్ ఫాస్ట్ ట్రైన్‌లా దూసుకుపోతున్నాడు. ముఖ్యంగా గత నాలుగేళ్లుగా అతను స్థిరంగా రాణిస్తున్నాడు. వన్డేల్లో ఇప్పటికే 35 సెంచరీలు సాధించిన కోహ్లి.. సచిన్ రికార్డు (49)ను అధిగమించడానికి మరో 15 సెంచరీల దూరంలో ఉన్నాడు. ఇదే ఫామ్‌తో రాణిస్తే మరికొద్ది రోజుల్లోనే కోహ్లి ఈ ఘనతను అందుకుంటాడు. ప్రస్తుత తరంలో ఈ రికార్డు అధిగమించే శక్తి కోహ్లికి మాత్రమే ఉంది. ఈ విషయాన్ని టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సైతం పేర్కొన్నాడు. గతంలో సోషల్ మీడియా వేదికగా ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సెహ్వాగ్.. వన్డేల్లో కోహ్లి 62 సెంచరీలు సాధిస్తాడని తెలిపాడు. సచిన్ స్పూర్తితోనే క్రికెట్లోకి.. చాలా ఇంటర్వ్యూల్లో కోహ్లి సచిన్ స్పూర్తితోనే క్రికెట్ కెరీర్‌ను ఎంచుకున్నట్లు స్పష్టం చేశాడు. ‘సచిన్ వల్లనే నేను క్రికెట్ ఆడటం మొదలు పెట్టా. అతను దేశానికి చేసిన సేవ నాకు స్పూర్తిని కలిగించింది. నేను చాలా అదృష్టవంతుడిని. నా కెరీర్ ప్రారంభ దశల్లో సచిన్‌తో ఆడాను. అతని సూచనలతో నా ఆటను మెరుగుపరుచుకున్నా. అతనెప్పుడు యువ ఆటగాళ్లకు స్పూర్తేనని’ కోహ్లి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. -
మహిళల వన్డే మ్యాచ్‌లో అద్భుతం
సాక్షి, స్పోర్ట్స్ : మహిళల వన్డే మ్యాచ్‌లో అద్భుతం చోటుచేసుకుంది. విదర్భ జట్టు మీడియం పేస్ బౌలర్ కోమల్ జన్జాద్ బంతితో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఎనిమిది పరుగులిచ్చి ఏకంగా 9 వికెట్లు నేలకూల్చారు. గురువారం విదర్భ-హరియాణా జట్ల మధ్య జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఈ రికార్డు నెలకొంది. మొత్తం 9.4 ఓవర్లలో 5 మెయిడెన్లు కాగా.. 8 పరుగులిచ్చి 9 వికెట్లు తీసుకున్నారు. కోమల్ దెబ్బకు హరియాణా బ్యాట్స్‌విమెన్ పెవిలియన్‌కు క్యూకట్టారు. ఆ జట్టు కెప్టెన్ ఎస్ఎం ఖత్రి చేసిన ఏడు పరుగులే అత్యధికం కావడం గమనార్హం. హరియాణా జట్టు 18.4 ఓవర్లలో 31 పరుగులకే కుప్పకూలింది. అనంతరం 32 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన విదర్భ జట్టు కేవలం 4.4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా విజయాన్ని అందుకుంది. 32 పరుగుల్లో ఓపెనర్ ఎల్ఎం ఇనామ్దార్ 30 పరుగులు(18 బంతుల్లో ఏడు ఫోర్లు) సాధించగా.. మరో ఎండ్‌లో ఉన్న బ్యాట్స్ ఉమన్ రెండు పరుగులు సాధించారు. -
కోహ్లీ మీద పడి ఏడుస్తున్నాడుగా...
సాక్షి, స్పోర్ట్స్: మొదటి వన్డే ఓటమి అనంతరం ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. మీడియా సమావేశంలో ఓటమికి కారణాలు చెబుతూనే.. మరోపక్క టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వన్డే వ్యక్తిగత రికార్డుల గురించి స్మిత్ నోరు జారాడు. ‘టీమిండియా మా జట్టు కంటే ఎక్కువ వన్డేలు ఆడిన అనుభవం ఉంది. కోహ్లీ ఎన్ని ఆటలు ఆడి ఉంటాడో నాకు సరిగ్గా తెలీదు. కానీ, నేను మాత్రం వ్యక్తిగత రికార్డుల కోసం పాకులాడను. కేవలం మా జట్టు గెలుపు కోసమే ఆడతా. ఇప్పుడు భారత్‌తో సిరీస్‌ను గెలవాలనే ప్రయత్నిస్తున్నా’ అని స్మిత్ చెప్పాడు. అంతే ఇక ఈ మాటలపై సోషల్ మీడియాలో కోహ్లీ ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. కోహ్లీ రికార్డులను, విజయాలను తట్టుకోలేకనే స్మిత్ ఇలాంటి చౌవకబారు కామెంట్లు చేస్తున్నాడని వారంటున్నారు. అయితే సిరీస్ ప్రారంభానికి ముందు విరాట్ కోహ్లీ తనకు జట్టు విజయాలే ముఖ్యమని స్టేట్మెంట్ ఇవ్వటం తెలిసిందే. తృటిలో సెంచరీలు చేజారినా తాను బాధపడనని.. జట్టు విజయం సాధిస్తే అంతే చాలని కోహ్లీ తెలిపాడు. కెరీర్లో ఇప్పటిదాకా మొత్తం 195 వన్డేలు ఆడిన కోహ్లీ 30 సెంచరీలు చేయగా, 99 వన్డేలు ఆడిన స్టీవ్ స్మిత్ ఖాతాలో 8 సెంచరీలు ఉన్నాయి.