హైదరాబాద్, 4 జూలై, 2023: హైదరాబాద్ మెట్రో రైలు (HMR) 3 జూలై 2023, సోమవారం నాడు 5.10 లక్షల మంది ప్రయాణికుల సంఖ్యతో ఒక చారిత్రాత్మక మైలురాయిని చేరుకుంది. ఈ రికార్డు సంఖ్య పర్యావరణ అనుకూలమైన, వేగవంతమైన, హైదరాబాద్‌లో సౌకర్యవంతమైన, అత్యంత సుఖవంతమైన ప్రయాణ విధానం పట్ల ప్రయాణీకుల విశ్వాసం, ఆమోదాన్ని సూచిస్తుంది.
ఈ మైలురాయిని సాధించినందుకు హెచ్ఎమ్ఆర్ ప్రయాణీకులకు ధన్యవాదాలు తెలిపిన.. L&TMRHL, MD & CEO, శ్రీ కేవీబీ రెడ్డి మాట్లాడుతూ, ఇది నిజంగా ఒక ముఖ్యమైన సందర్భం, మా విలువైన ప్రయాణికులకు మేము ఈ విజయాన్ని అంకితం చేస్తున్నామన్నారు.
(ఇదీ చదవండి: హార్లే డేవిడ్సన్ బైక్ ధర ఇంత తక్కువంటే ఎవరైనా కొనేస్తారు - వివరాలు!)
కొవిడ్-19 సమయంలో ప్రయాణికుల సంఖ్య కొంత మందగించినా.. ఆ తరువాత ప్రయాణికుల సంఖ్య క్రమంగా పెరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ నుంచి నిరంతర సహకారం, మద్దతు వల్ల నగర ప్రజలకు అత్యంత అనుకూలమైన, వేగవంతమైన ప్రజా రవాణా వ్యవస్థను అందించడం మాకు సాధ్యపడిందని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment