భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ టూ వీలర్లకు ఆదరణ భారీగా పెరుగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని చాలా వాహన తయారీ సంస్థలు దేశీయ విఫణిలో ఆధునిక ఎలక్ట్రిక్ వాహనాలను విరివిగా విడుదల చేస్తున్నాయి. ఇందులో భాగంగానే ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్.. ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేసింది.
కంపెనీ టీవీఎస్ ఐక్యూబ్ లాంచ్ చేసినప్పటి నుంచి మంచి అమ్మకాలను పొందుతూ ఎట్టకేలకు ఉత్పత్తిలో లక్ష యూనిట్ల మైలురాయిని దాటేసింది. 2022 జనవరిలో కేవలం 1,529 యూనిట్ల అమ్మకాలతో మొదలైన ఐక్యూబ్ 2023 మార్చి నెలలో ఏకంగా 15,364 యూనిట్ల అమ్మకాలను చేపట్టింది. దీన్ని బట్టి చూస్తే మార్కెట్లో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకాలు ఏవిధంగా సాగాయనేది స్పష్టంగా అర్థమవుతోంది.
ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో టీవీఎస్ ఐక్యూబ్ స్టాండర్డ్, ఎస్, ఎస్టి అనే మూడు వేరియంట్లలో లభిస్తోంది. ఐక్యూబ్ స్టాండర్డ్ ధర రూ. 98,564 కాగా, ఎస్ వేరియంట్ ధర రూ. 1,08,690 (ఆన్-రోడ్ ఢిల్లీ). అయితే కంపెనీ టాప్ వేరియంట్ ధరలను వెల్లడించలేదు, అయితే ఇది ఒక ఛార్జ్‌తో 140 కిమీ రేంజ్ అందిస్తుందని తెలుస్తోంది.
(ఇదీ చదవండి: క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ అకౌంట్‌కి ట్రాన్సాక్షన్ - సులభంగా ఇలా!)
టీవీఎస్ ఐక్యూబ్ ఎల్ఈడీ లైట్స్, TFT ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 12 ఇంచెస్ వీల్స్ వంటివి పొందుతుంది. ఆధునిక ఫీచర్స్ కలిగి ఉన్న ఈ స్కూటర్ నగర ప్రయాణాలను చాల అనుకూలంగా ఉంటుంది. కంపెనీ ప్రస్తుతం రిటైల్ నెట్‌వర్క్ కూడా విస్తరిస్తోంది. ఇప్పటికే వంద నగరాల్లో 200 టచ్‌పాయింట్‌లను ప్రారభించింది. ఇటీవల ఈ స్కూటర్ 2023 గ్రీన్ టూ-వీలర్ ఆఫ్ ది ఇయర్ టైటిల్ కూడా సొంతం చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment