భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన మారుతి సుజుకి తన మానేసర్ ప్లాంట్‌లో ఏకంగా కోటి కార్లను ఉత్పత్తి చేసి సరికొత్త రికార్డును కైవసం చేసుకుంది. ఒకే ప్లాంట్‌లో ఇన్ని కార్లను ఉత్పత్తి చేయడానికి 18 సంవత్సరాల సమయం పట్టింది.
600 ఎకరాల్లో విస్తరించి ఉన్న మానేసర్ సదుపాయంలో కార్యకలాపాలు అక్టోబర్ 2006లో ప్రారంభమయ్యాయి. ఈ ప్లాంట్‌లో మారుతి బ్రెజ్జా, ఎర్టిగా, ఎక్స్ఎల్6, సియాజ్, డిజైర్, వ్యాగన్ఆర్, ఎస్-ప్రెస్సో, సెలెరియో కార్లను తయారు చేశారు. ఈ కారు భారతదేశంలో మాత్రమే కాకుండా లాటిన్ అమెరికా, ఆఫ్రికా, ఆసియా దేశాలకు కూడా ఎగుమతి అయ్యాయి.
ఇదీ చదవండి: ట్రైన్ టికెట్ అడ్వాన్స్ బుకింగ్‌లో కీలక మార్పు
జపాన్‌కు ఎగుమతి చేసిన మారుతి సుజుకి మొట్టమొదటి ప్యాసింజర్ కారు బాలెనో కూడా మనేసర్ ఫెసిలిటీలో తయారు చేశారు. మానేసర్, గురుగ్రామ్, గుజరాత్ ప్లాంట్‌లలో కార్ల మారుతి సుజుకి ఉత్పత్తి సామర్థ్యం సంవత్సరానికి 23.50 లక్షల యూనిట్లుగా ఉంది. ఈ సదుపాయాల్లో కార్ల తయారీ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 3.11 కోట్ల వాహనాలు ఉత్పత్తి అయినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment