పాత విధానంలోనే టీఎస్‌ఎస్పీ కానిస్టేబుల్‌ పోస్టులు భర్తీ చేయాలి | Constable aspirants lay siege to Telangana Assembly, DGP office over GO 46 | Sakshi
Sakshi News home page

పాత విధానంలోనే టీఎస్‌ఎస్పీ కానిస్టేబుల్‌ పోస్టులు భర్తీ చేయాలి

Published Sat, Sep 2 2023 3:42 AM | Last Updated on Sat, Sep 2 2023 4:02 PM

Constable aspirants lay siege to Telangana Assembly, DGP office over GO 46 - Sakshi

ప్లకార్డులతో డీజీపీ కార్యాలయానికి దూసుకెళ్తున్న అభ్యర్థులను నిలువరిస్తున్న పోలీసులు

సాక్షి, హైదరాబాద్‌ (నాంపల్లి) : తెలంగాణ స్టేట్‌ స్పెషల్‌ పోలీస్‌(టీఎస్‌ఎస్పీ) కానిస్టేబుల్‌ పోస్టులను 2016, 2018 నోటిఫికేషన్‌లో మాదిరిగా పాతపద్ధతిలోనే భర్తీ చేయాలని అభ్యర్థులు డిమాండ్‌ చేశారు. జీవో 46 ప్రకారం కంటిజ్యుయస్‌ డిస్ట్రిక్ట్‌ కేడర్‌లో ఉన్న రిజర్వేషన్‌ మేరకు టీఎస్‌ఎస్పీ కానిస్టేబుల్‌ ఉద్యోగాలు ఉమ్మడి హైదరాబాద్‌ జిల్లాకే 53 శాతం వెళుతున్నాయని, మిగతా 26 జిల్లాలకు 47 శాతం మాత్రమే పోస్టులు దక్కుతాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

దీని వల్ల గ్రామీణ అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని, దీనిపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం కొందరు కానిస్టేబుల్‌ అభ్యర్థులు డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. అసెంబ్లీ పరిసరాల్లో పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ డీజీపీ కార్యాలయం వైపు దూసుకు వస్తున్న పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

‘జిల్లాల నుంచి పోటీ పడుతున్న అభ్యర్థులకు టీఎస్‌ఎస్పీ పోస్టులు 130, ఆపై మార్కులు సాధించినా ఉద్యోగం రాని పరిస్థితి నెలకొంది. అదే హైదరాబాద్‌ జిల్లా నుంచి పోటీలో ఉన్నవారికి 80 ప్లస్‌ మార్కులు వచ్చినా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది’అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి జీవో 46ను రద్దు చేయాలని వారు డిమాండ్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement