సేల్స్, టెక్నాలజీ ఉద్యోగులకు డిమాండ్‌ | Sales, Tech Roles Dominate Job Demand in BFSI Sector | Sakshi
Sakshi News home page

సేల్స్, టెక్నాలజీ ఉద్యోగులకు డిమాండ్‌

Published Sat, Jun 24 2023 4:20 AM | Last Updated on Sat, Jun 24 2023 4:20 AM

Sales, Tech Roles Dominate Job Demand in BFSI Sector - Sakshi

న్యూఢిల్లీ: బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా (బీఎఫ్‌ఎస్‌ఐ) రంగంలో సేల్స్, టెక్నాలజీ సంబంధ ఉద్యోగులకు భారీగా డిమాండ్‌ నెలకొంది. టెక్నాలజీకి సంబంధించి సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్, సైబర్‌సెక్యూరిటీ, డేటా అనలిటిక్స్, డిజిటల్‌ మార్కెటింగ్‌ నిపుణులకు.. సేల్స్‌లో కస్టమర్లతో మాట్లాడాల్సిన సిబ్బందికి డిమాండ్‌ నెలకొందని సియెల్‌ హెచ్‌ఆర్‌ సర్వీసెస్‌ ఒక అధ్యయన నివేదికలో వెల్లడించింది.

ఈ ఏడాది మార్చి 15 నుంచి మే 15 వరకు, 11 లక్షల పైచిలుకు ఉద్యోగులు ఉన్న 60 బీఎఫ్‌ఎస్‌ఐల మానవ వనరుల ఎగ్జిక్యూటివ్‌లతో నిర్వహించిన సర్వే ఆధారంగా సియెల్‌ దీన్ని రూపొందించింది. ఇందుకోసం పోర్టల్స్‌లో 33,774 జాబ్‌ పోస్టింగ్స్‌ను విశ్లేíÙంచింది. నివేదిక ప్రకారం .. కరోనా మహమ్మారి నేపథ్యంలో డిజిటల్‌ ఆర్థిక లావాదేవీలు, బ్యాంకింగ్‌ కార్యకలాపాలు గణనీయంగా పెరిగాయి. దీంతో కొన్ని రకాల ఉద్యోగాలకు డిమాండ్‌ పెరిగింది.

నివేదికలోని మరిన్ని అంశాలు..
► బీఎఫ్‌ఎస్‌ఐ రంగంలో మహిళల ప్రాతినిధ్యం కేవలం 18 శాతమే ఉంది. 10 శాతం మహిళలు మాత్రమే నాయకత్వ స్థానాల్లో ఉంటున్నారు.
► ఆరి్టఫిíÙయల్‌ ఇంటెలిజెన్స్, టెక్నాలజీతో పని ప్రదేశాల రూపురేఖలు మారిపోతున్నాయి. ఆర్థిక రంగం కూడా కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా మారుతున్నాయి. దీంతో టెక్నాలజీ నిపుణులకు డిమాండ్‌ పెరుగుతోంది. ఫలితంగా టెక్నాలజీ–డేటా గవర్నెన్స్‌ స్పెషలిస్ట్, ట్రెజరీ హెడ్, ప్రోడక్ట్‌ హెడ్, ప్రీమియం బ్యాంకింగ్‌–రిలేషన్‌షిప్‌ హెడ్‌ వంటి కొత్త హోదాలు పుట్టుకొస్తున్నాయి.  
► మొత్తం బీఎఫ్‌ఎస్‌ఐ జాబ్‌ పోస్టింగ్స్‌లో ముంబై వాటా అత్యధికంగా 20 శాతంగా ఉంది. పోస్టింగ్స్‌లో 19 శాతం వాటాతో బెంగళూరు రెండో స్థానంలో నిలి్చంది. ఇక పుణె (13 శాతం), హైదరాబాద్‌ (8 శాతం), చెన్నై (8 శాతం) తర్వాత స్థానాల్లో ఉన్నాయి.  
► కృత్రిమ మేథ, మెషిన్‌ లెరి్నంగ్, బ్లాక్‌చెయిన్, రోబోటిక్స్‌ ప్రాసెస్‌ ఆటోమేషన్‌ వంటి కొత్త సాంకేతికతల్లో నైపుణ్యాలు ఉన్న వారికి భారీగా డిమాండ్‌ నెలకొంది.
► మహిళలకు ప్రాతినిధ్యం కలి్పంచడంలో అట్టడుగున ఉన్న అయిదు రంగాల్లో బీఎఫ్‌ఎస్‌ఐ కూడా ఒకటి. పరిశ్రమలో లింగ సమానత్వాన్ని, వైవిధ్యాన్ని ప్రోత్సహించాల్సిన అవసరాన్ని ఇది తెలియజేస్తోంది.
► ఉద్యోగార్థుల్లో టెక్నాలజీ అనుభవం, కొత్త ఆవిష్కరణల సామర్థ్యం, మారే పరిస్థితులకు అలవాటుపడటం వంటి నైపుణ్యాలను బీఎఫ్‌ఎస్‌ఐ సంస్థలు పరిశీలిస్తున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement