ముంబై: త్వరలో జరగబోయే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ల కోసం గట్టి పోటీ నెలకొంది.మహావికాస్ అఘాడీ(ఎంవీఏ) కూటమిలో భాగంగా ఎన్‌సీపీ,శివసేన(ఉద్ధవ్)పార్టీలతో కలిసి కాంగ్రెస్ ఈసారి ఎన్నికల్లో పోటీ చేయనుంది. పొత్తులో కాంగ్రెస్‌కు సుమారు 100 నుంచి 110 సీట్లు కేటాయించే అవకాశాలున్నాయి.
ఈ సీట్లలో టికెట్ల కోసం ఇప్పటికే 1800కుపైగా దరఖాస్తులు వచ్చాయని నేతలు చెబుతున్నారు. ఒక్కో దరఖాస్తుకు రూ.20వేల రుసుము నిర్ణయించారు.ఎన్నికల తేదీలు ఇంకా ప్రకటించకముందే ఇన్ని దరఖాస్తులు వచ్చాయంటే తేదీలు ప్రకటించాక వీటి సంఖ్య ఇంకా పెరిగే ఛాన్సుందని నేతలు అంచనా వేస్తున్నారు.
ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో మహావికాస్‌అఘాడీ కూటమి మంచి ప్రదర్శన కనబరిచింది. ఈ ప్రభావంతోనే అసెంబ్లీ ఎన్నికల్లోనూ కూటమి మంచి ఫలితాలు సాధించనుందన్న అంచనాలు ఏర్పడ్డాయి. ఈ అంచనా ఫలితంగానే పార్టీ టికెట్ల కోసం గట్టి పోటీ నెలకొందని మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత పృథ్వీరాజ్ చవాన్ తెలిపారు.
ఇదీ చదవండి: హర్యానా ఎన్నికల వేళ బీజేపీకి షాక్
Comments
Please login to add a commentAdd a comment