హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా ప్యాసింజర్ వాహనాల హోల్‌సేల్ విక్రయాలు జూన్ నెలలో 3.27 లక్షల యూనిట్లు నమోదయ్యాయి. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 2.2 శాతం పెరిగాయి. ఎంట్రీ లెవెల్ ఎస్‌యూవీలకు డిమాండ్ ఈ పెరుగుదలకు కారణమని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ (సియామ్) తెలిపింది. కస్టమర్లు ఎస్‌యూవీలకు మళ్లడంతో హ్యాచ్‌బ్యాక్స్ విక్రయాలు తగ్గాయని వెల్లడించింది.
2023 జనవరి–జూన్‌లో పీవీల అమ్మకాలు తొలిసారిగా అత్యధికంగా 20 లక్షల యూనిట్ల మైలురాయిని చేరుకున్నాయి. సియామ్ గణాంకాల ప్రకారం.. జూన్ నెలలో తయారీ కంపెనీల నుంచి డీలర్íÙప్‌లకు చేరిన ద్విచక్ర వాహనాల సంఖ్య 1.7 శాతం అధికమై 13.30 లక్షల యూనిట్లుగా ఉంది. త్రిచక్ర వాహనాలు దాదాపు రెండింతలై 53,019 యూనిట్లను తాకాయి. ప్యాసింజర్ వెహికిల్స్ (పీవీ) విక్రయాల పరంగా ఎటువంటి ఆందోళన లేదని సియామ్ ప్రెసిడెంట్ వినోద్ అగర్వాల్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ పెరగడం కలిసి వచ్చే అంశం అని అన్నారు. రానున్న రోజుల్లో పీవీ విభాగం సానుకూలంగా ఉంటుందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment