Society of Indian Automobile Manufacturers
-
హైడ్రోజన్ ఉత్పత్తిలో అగ్రస్థానం!.. నితిన్ గడ్కరీ
సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ న్యూఢిల్లీలో 64వ వార్షిక సమావేశాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో కేంద్ర రోడ్డు రవాణా & రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. హైడ్రోజన్ ఉత్పత్తి గురించి ప్రస్తావించారు.ప్రపంచవ్యాప్తంగా హైడ్రోజన్ ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉండగల దేశాల జాబితాలో భారత్ ముందు వరుసలో ఉండాలని గడ్కరీ పేర్కొన్నారు. ఆటోమోటివ్ పరిశ్రమ దేశం మొత్తం జీడీపీకి 6.8 శాతం అని వెల్లడిస్తూ.. తయారీ రంగం దేశాభివృద్ధికి కీలకమని అన్నారు. 2030 నాటికి కార్బన్ ఉద్గారాలను తగ్గించాలని చెప్పారు.దేశంలో హైడ్రోజన్ ఉత్పత్తిని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని.. ఎలక్ట్రోలైజర్ల ఉత్పత్తిలో భారతదేశాన్ని అగ్రస్థానానికి తీసుకురావడానికి హైడ్రోజన్ ఉత్పత్తిని స్థానికీకరించే సాంకేతికత అవసరమని ఆయన అన్నారు. బయోహైడ్రోజన్ను ఉత్పత్తి చేయడానికి వ్యర్థాలను ఉపయోగించాలనే ప్రతిపాదన గురించి ఆయన మాట్లాడారు.ఇదీ చదవండి: వైకల్యాన్ని జయించి.. బిలియనీర్‌గా నిలిచి: జీవితాన్ని మార్చే స్టోరీభారతదేశం ప్రస్తుతం ఆటోమొబైల్ రంగంలో ప్రపంచవ్యాప్తంగా మూడవ అతిపెద్ద మార్కెట్‌గా ఉంది. రాబోయే రోజుల్లో ఇది మరింత వృద్ధి చెందుతుంది. కాబట్టి ఫ్యూయెల్ వాహనాలను వీలైనంత వరకు తగ్గించాలని గడ్కరీ సూచించారు. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా ఉపయోగపడుతుందని అన్నారు. పెట్రోల్ దిగుమతులను తగ్గించుకోవాలని.. దీనికి ప్రత్యామ్నాయ ఇంధనాలను ఉపయోగించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.📍𝑵𝒆𝒘 𝑫𝒆𝒍𝒉𝒊64th SIAM Annual Convention 2024 pic.twitter.com/jZP0723nAa— Nitin Gadkari (@nitin_gadkari) September 10, 2024 -
పీవీ విక్రయాలు స్వల్పంగా పెరిగాయ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా ప్యాసింజర్ వాహనాల హోల్‌సేల్ విక్రయాలు జూన్ నెలలో 3.27 లక్షల యూనిట్లు నమోదయ్యాయి. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 2.2 శాతం పెరిగాయి. ఎంట్రీ లెవెల్ ఎస్‌యూవీలకు డిమాండ్ ఈ పెరుగుదలకు కారణమని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ (సియామ్) తెలిపింది. కస్టమర్లు ఎస్‌యూవీలకు మళ్లడంతో హ్యాచ్బ్యాక్స్ విక్రయాలు తగ్గాయని వెల్లడించింది. 2023 జనవరి–జూన్‌లో పీవీల అమ్మకాలు తొలిసారిగా అత్యధికంగా 20 లక్షల యూనిట్ల మైలురాయిని చేరుకున్నాయి. సియామ్ గణాంకాల ప్రకారం.. జూన్ నెలలో తయారీ కంపెనీల నుంచి డీలర్íÙప్లకు చేరిన ద్విచక్ర వాహనాల సంఖ్య 1.7 శాతం అధికమై 13.30 లక్షల యూనిట్లుగా ఉంది. త్రిచక్ర వాహనాలు దాదాపు రెండింతలై 53,019 యూనిట్లను తాకాయి. ప్యాసింజర్ వెహికిల్స్ (పీవీ) విక్రయాల పరంగా ఎటువంటి ఆందోళన లేదని సియామ్ ప్రెసిడెంట్ వినోద్ అగర్వాల్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ పెరగడం కలిసి వచ్చే అంశం అని అన్నారు. రానున్న రోజుల్లో పీవీ విభాగం సానుకూలంగా ఉంటుందని చెప్పారు. -
భారీగా పెరిగిన ప్యాసింజర్ వెహికల్ సేల్స్.. గత నెలలో అమ్మకాలు ఇలా!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా 2023 మే నెలలో హోల్‌సేల్‌లో ప్యాసింజర్ వెహికిల్స్ 3,34,247 యూనిట్లు అమ్ముడయ్యాయి. 2022 మే నెలతో పోలిస్తే ఇది 13.54 శాతం అధికమని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (సియామ్) తెలిపింది. టాటా మినహా యుటిలిటీ వెహికిల్స్ 33.5 శాతం పెరిగి 1,55,184 యూనిట్లు నమోదయ్యాయి. టాటా మోటార్స్ మూడు నెలలకోసారి అమ్మకాల వివరాలను వెల్లడిస్తోంది. ద్విచక్ర వాహనాలు 17.42 శాతం అధికమై 14,71,550 యూనిట్లు విక్రయం అయ్యాయి. (అపుడు పాల ప్యాకెట్ కొనలేక పాట్లు, ఇపుడు 800 కోట్ల ఆస్తులు!) ఇందులో మోటార్‌సైకిల్స్ 20.63 శాతం పెరిగి 9,89,120 యూనిట్లు, స్కూటర్స్ 12.18 శాతం దూసుకెళ్లి 4,46,593 యూనిట్లకు చేరాయి. త్రీవీలర్లు 28,595 నుంచి 48,732 యూనిట్లకు ఎగశాయి. అన్ని విభాగాల్లో కలిపి తయారీ కంపెనీల నుంచి డీలర్‌షిప్‌లకు చేరిన వాహనాల సంఖ్య టాటా మోటార్స్ మినహా 15,32,861 నుంచి 18,08,686 యూనిట్లకు చేరింది. 2022 మే నెలతో పోలిస్తే గత నెలలో అన్ని వాహన విభాగాల్లో రెండంకెల వృద్ధి నమోదైందని సియామ్ ప్రెసిడెంట్ వినోద్ అగర్వాల్ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఈ ట్రెండ్ కొనసాగుతుందని అంచనా వేస్తున్నామని చెప్పారు. (నెలకు లక్షన్నర జీతం: యాపిల్ ఫోనూ వద్దు, కారూ వద్దు, ఎందుకు? వైరల్ ట్వీట్) మరిన్ని ఇంట్రస్టింగ్ కథనాలు, బిజినెస్ వార్తల కోసం చదవండి సాక్షిబిజినెస్ -
ప్యాసింజర్ వాహనాలు పెరిగాయ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా 2023 ఏప్రిల్‌లో కంపెనీల నుంచి డీలర్లకు చేరిన ప్యాసింజర్ వాహనాల సంఖ్య 3,31,278 యూనిట్లు నమోదైంది. 2022 ఏప్రిల్‌తో పోలిస్తే ఇది 13 శాతం పెరుగుదల అని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (సియామ్) తెలిపింది. ‘మారుతీ సుజుకీ ఇండియా గత నెలలో 1,37,320 యూనిట్లను డీలర్లకు సరఫరా చేసింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో 1,21,995 యూనిట్లు నమోదైంది. హ్యుండై మోటార్ ఇండియా హోల్‌సేల్ విక్రయాలు 44,001 నుంచి 49,701 యూనిట్లకు చేరాయి. అలాగే ఈ ఏడాది ఏప్రిల్‌లో డీలర్లకు 13,38,588 యూనిట్ల ద్విచక్ర వాహనాలు సరఫరా అయ్యాయి. 2022 ఏప్రిల్‌లో ఈ సంఖ్య 11,62,582 యూనిట్లు. మోటార్‌సైకిళ్లు 7,35,360 నుంచి 8,39,274 యూనిట్లు, స్కూటర్లు 3,88,442 నుంచి 4,64,389 యూనిట్లకు చేరాయి. త్రిచక్ర వాహనాలు రెండింతలై కోవిడ్ ముందస్తు స్థాయికి చేరువలో 42,885 యూనిట్లకు ఎగశాయి. ‘ఏప్రిల్ 2022తో పోలిస్తే అన్ని వాహన విభాగాలు గత నెలలో వృద్ధిని నమోదు చేశాయి. 2023 ఏప్రిల్ 1 నుండి పరిశ్రమ బీఎస్–6 ఫేజ్–2 ఉద్గార నిబంధనలకు చాలా సాఫీగా మారిందని ఇది స్పష్టంగా సూచిస్తోంది. పరిశ్రమ క్రమంగా రుతుపవనాల సీజన్లోకి ప్రవేశిస్తున్నందున మంచి వర్షపాతం కూడా ఈ రంగం వృద్ధిని కొనసాగించడంలో సహాయపడుతుంది’ అని సియామ్ ప్రెసిడెంట్ వినోద్ అగర్వాల్ తెలిపారు. -
విదేశాలకు 6.62 లక్షల కార్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశం నుంచి గత ఆర్థిక సంవత్సరంలో 6,62,891 యూనిట్ల ప్యాసింజర్ వాహనాలు ఎగుమతి అయ్యాయి. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 15 శాతం అధికం. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (సియామ్) ప్రకారం.. ప్యాసింజర్ కార్లు 10 శాతం వృద్ధితో 4,13,787 యూనిట్లు, యుటిలిటీ వాహనాలు 23 శాతం ఎగసి 2,47,493 యూనిట్లకు చేరుకున్నాయి. వ్యాన్ల ఎగుమతులు 1,853 నుంచి 1,611 యూనిట్లకు వచ్చి చేరాయి. ప్యాసింజర్ వాహన ఎగుమతుల్లో మారుతీ సుజుకీ తొలి స్థానాన్ని కైవసం చేసుకుంది. 2021–22తో పోలిస్తే ఈ కంపెనీ 8 శాతం అధికంగా 2,55,439 యూనిట్లను విదేశాలకు సరఫరా చేసింది. హ్యుండై మోటార్ ఇండియా నుంచి 18 శాతం ఎక్కువగా 1,53,019 యూనిట్లు ఎగుమతి అయ్యాయి. కియా ఎగుమతులు 50,864 నుంచి 85,756 యూనిట్లకు ఎగశాయి. నిస్సాన్ మోటార్ ఇండియా 60,637 యూనిట్లు, రెనో ఇండియా 34,956, ఫోక్స్‌వ్యాగన్ ఇండియా 27,137, హోండా కార్స్ ఇండియా 22,710, మహీంద్రా అండ్ మహీంద్రా 10,622 యూనిట్లను విదేశాలకు సరఫరా చేశాయి. అన్ని విభాగాల్లో కలిపి మొత్తం వాహన ఎగుమతులు 2022–23లో 47,61,487 యూనిట్లు నమోదయ్యాయి. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 15 శాతం తగ్గుదల. -
కొత్త ఏడాదిలో రయ్రయ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారత వాహన పరిశ్రమ 2021–22లో బలమైన వృద్ధి నమోదు చేయనుందని నోమురా రిసర్చ్ ఇన్స్టిట్యూట్ కన్సల్టింగ్, సొల్యూషన్స్ ఇండియా శుక్రవారం వెల్లడించింది. కోవిడ్–19 కారణంగా ఎదుర్కొన్న తీవ్ర ప్రభావం నుంచి ఈ రంగం కోలుకుంటుందని.. ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు తోడవడంతో పరిశ్రమ సానుకూలంగా ఉంటుందని వివరించింది. అయితే వ్యక్తిగత వాహనాల అమ్మకాలు 2018–19 స్థాయికి చేరుకునేది 2022–23లోనే అని స్పష్టం చేసింది. అలాగే ద్విచక్ర వాహనాలకు మరో ఏడాది (2023–24) పట్టొచ్చని నోమురా ప్రతినిధి ఆశిమ్ శర్మ తెలిపారు. కొత్త నిబంధనలను ప్రవేశపెట్టడంతో కొంత ధరల పెరుగుదలకు అవకాశం ఉండడమూ ఇందుకు కారణమని అన్నారు. సియామ్ లెక్కల ప్రకారం.. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (సియామ్) ప్రకారం.. 2019–20లో ప్యాసింజర్ వాహనాల విక్రయాలు 17.88 శాతం తగ్గి 27,73,575 యూనిట్లుగా ఉంది. ద్విచక్ర వాహనాలు 17.76 శాతం తగ్గి 1,74,17,616 యూనిట్లు నమోదైంది. 2018–19లో ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు అంత క్రితం ఏడాదితో పోలిస్తే 2.7 శాతం వృద్ధి చెంది 33,77,389 యూనిట్ల స్థాయికి చేరాయి. 2017–18లో ఇది 32,88,581 యూనిట్లుగా ఉంది. 2018–19లో ద్విచక్ర వాహనాల విక్రయాలు 4.86 శాతం అధికమై 2,11,81,390 యూనిట్లకు చేరుకున్నాయి. అంత క్రితం ఏడాది ఇది 2,02,00,117 యూనిట్లు నమోదైంది. కొత్త కంపెనీల రాకతో..: వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఎలక్ట్రిక్ వాహనాల సేల్స్ మెరుగ్గా ఉంటాయని నోమురా వెల్లడించింది. ప్రధానంగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు డిమాండ్ ఉంటుందని తెలిపింది. కొత్త కంపెనీల రాకతో ఈ విభాగం సానుకూలంగా ఉంటుందని వివరించింది. ఈవీ విడిభాగాల విషయానికి వస్తే.. సాంకేతిక భాగస్వామ్యంతో సెల్ స్థాయి తయారీ భారత్‌లో ప్రారంభం అయింది. లిథియం టైటానియం ఆక్సైడ్ (ఎల్‌టీవో) బ్యాటరీల వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఙానంపై కంపెనీలు దృష్టిసారించాయి. ఎల్‌టీవో బ్యాటరీలతో త్వరితగతిన చార్జింగ్ పూర్తి అవుతుంది. 10 వేల సార్లకుపైగా చార్జీ చేయవచ్చు. ఎగుమతి అవకాశాలు.. మోటార్స్, కంట్రోలర్స్ సైతం భారత్‌లో తయారవుతున్నాయి. స్థానిక ఉత్పత్తిదార్లతోపాటు.. ఎలక్ట్రిక్ ద్విచక్ర, త్రిచక్ర వాహనాలకు ఆదరణ పెరుగుతుండడంతో విడిభాగాల తయారీలోకి కొత్తవారు ప్రవేశిస్తున్నారు. విడిభాగాలు, బ్యాటరీల తయారీలో ఉన్న దేశీయ వాహన కంపెనీలకు ఎగుమతి అవకాశాలూ పెరగనున్నాయి. వీటి నిరంతర సరఫరా కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీలు ప్రత్యామ్నాయ వనరులను కనుగొనే పనిలో ఉన్నాయని నివేదిక గుర్తు చేసింది. -
తొమ్మిది నెలల క్షీణతకు బ్రేక్..!
న్యూఢిల్లీ: ప్యాసింజర్ వాహన అమ్మకాలు తొమ్మిది నెలల తర్వాత తొలిసారి ఈ ఆగస్ట్‌లో వృద్ధిని సాధించాయి. లాక్డౌన్ సడలింపులకు తోడు డిమాండ్ ఊపందుకోవడంతో ఆగస్ట్‌లో మొత్తం 2,15,916 ప్యాసింజర్ వాహన విక్రయాలు జరిగాయి. గతేడాది ఇదే నెలలో అమ్ముడైన 1,89,129 యూనిట్లతో పోలిస్తే ఇవి 14.16శాతం అధికమని ఇండియా అటోమొబైల్ మ్యానుఫ్యాక్చర్స్(సియామ్) తెలిపింది. సియామ్ గణాంకాల ప్రకారం... ప్యాసింజర్ కార్ల అమ్మకాల్లో 14.13శాతం వృద్ది నమోదైంది. ఈ గతేడాదిలో ఇదే ఆగస్ట్‌లో 1,09,277 యూనిట్ల విక్రయాలు జరగ్గా, ఈసారి 1,24,715 యూనిట్లకు పెరిగాయి. సమీక్షా కాలంలో యుటిలిటి వాహన అమ్మకాలు కూడా పెరిగాయి. ఈ విభాగంలో మొత్తం 81,842 యూనిట్లు విక్రయాలు జరగ్గా, గతేడాది ఇదే నెలలో 70,837 యూనిట్ల అమ్మకాలు నమోదయ్యాయి. మోటర్‌సైకిల్ అమ్మకాల్లో 10శాతం వృద్ధిని సాధించాయి. అయితే స్కూటర్, త్రీ–వీలర్స్ విక్రయాలు క్షీణతను చవిచూశాయి. ముఖ్యంగా త్రీ–వీలర్స్ విభాగంలో విక్రయాలు ఏకంగా 75.29 శాతం క్షీణతను చవిచూశాయి. గతేడాది నెలలో 58,818 యూనిట్ల అమ్మకాలు జరగ్గా, ఈ నెలలో 14,534 యూనిట్లకు పరిమితమయ్యాయి. రానున్న రోజుల్లో మరింత అవకాశం: ఆయుకవ రానున్న రోజుల్లో వాహన విక్రయాలు మరింత పెరిగే అవకాశం ఉందని సియామ్ అధ్యక్షుడు కెనిచి ఆయుకవ అన్నారు. ద్విచక్ర, ప్యాసింజర్ వాహన విభాగాల్లో నమోదైన బలమైన విక్రయ గణాంకాలు అటో పరిశ్రమకు ఉత్సాహానిస్తున్నాయని అన్నారు. ఈ నెలతో పండుగుల సీజన్ ప్రారంభం కానుండటం, లాక్డౌన్ సడలింపులు మరింత విస్తృతంగా జరగడం కలిసొచ్చే అంశాలని కెనిచి ఆయుకవ చెప్పుకొచ్చారు. -
భారీగా పెరిగిన వాహన విక్రయాలు
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్‌తో అమ్మకాలు లేక డీలా పడిన భారత ఆటో పరిశ్రమ తిరిగి గాడినపడుతోంది. గత కొద్దినెలలుగా వాహన విక్రయాలు పడిపోతున్న క్రమంలో జులైలో 14,64,133 ప్రయాణీకుల వాహన విక్రయాలు జరిగాయి. అంతకుముందు నెలతో పోలిస్తే జులైలో వాహన విక్రయాలు 30 శాతం అధికమని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యాన్యుఫ్యాక్చరర్స్ (ఎస్ఐఏఎం) గణాంకాలు వెల్లడించింది. జూన్‌లో 11,19,048 యూనిట్ల విక్రయాలు సాగాయని ఎస్ఐఏఎం తెలిపింది. అయితే గత ఏడాది జులైతో పోలిస్తే తాజా అమ్మకాలు భారీగా పడిపోయాయి. చదవండి : కరోనా భయం.. కారే నయం! గత ఏడాది జులైలో దేశంలో 17,01,832 వాహన అమ్మకాలు నమోదయ్యాయి. కోవిడ్-19 నేపథ్యంలో గత కొద్దినెలలుగా వాహన విక్రయాలు భారీగా పడిపోగా జులైలో ప్రయాణీకుల వాహనాలు, ద్విచక్రవాహన విక్రయాలు పుంజుకోవడం పరిశ్రమ రికవరీకి సంకేతమని ఎస్ఐఏఎం అధ్యక్షుడు రాజన్ వధేరా పేర్కొన్నారు. కాగా బీఎండబ్ల్యూ మెర్సిడెస్, టాటా మోటార్స్, వోల్వో ఆటో వంటి బ్రాండ్స్ అమ్మకాల వివరాలు అందుబాటులో లేనందున వాటి వివరాలు ఈ గణాంకాల్లో కలుపలేదని ఎస్‌ఐఏఏం తెలిపింది. ఇక ఈ ఏడాది జూన్‌తో పోలిస్తే జులైలో ద్విచక్ర వాహన విక్రయాలు ఏకంగా 26 శాతం పెరగడం ప్రోత్సాహకరమని ఎస్ఐఏఎం పేర్కొంది. ఇక కార్ల విక్రయాలు అంతకుముందు నెలతో పోలిస్తే జులైలో 73 శాతం ఎగబాకాయని వెల్లడించింది. -
ప్లాంట్లు మూసేయండి – ఉత్పత్తి ఆపేయండి
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి నియంత్రణ చర్యల్లో భాగంగా వాహనాలు, విడిభాగాల తయారీ సంస్థలు కొంత కాలం పాటు ఉత్పత్తి నిలిపివేయాలని, ప్లాంట్లను తాత్కాలికంగా మూసివేసే అంశాలను పరిశీలించాలని పరిశ్రమల సమాఖ్యలు సూచించాయి. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యాన్యుఫాక్చరర్స్ (సియామ్), ఆటో కాంపోనెంట్ మ్యాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ (ఏసీఎంఏ).. కంపెనీలకు ఈ మేరకు విజ్ఞప్తి చేశాయి. ఇలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే.. సిబ్బంది వైరస్ బారిన పడకుండా చూసేందుకు కొంతైనా తోడ్పడగలవని సియామ్ ప్రెసిడెంట్ రాజన్ వధేరా తెలిపారు. బాధ్యతాయుతంగా జాతి నిర్మాణంలో భాగం కావాలన్న సియామ్ నినాదానికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ప్లాంట్ల మూసివేత బాటలో మరిన్ని సంస్థలు.. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మరికొన్ని కంపెనీలు తమ ప్లాంట్లలో తయారీ కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. హ్యుందాయ్ మోటార్, టయోటా కిర్లోస్కర్ మొదలైనవి ఈ జాబితాలో ఉన్నాయి. మార్చి 23 నుంచే (సోమవారం) చెన్నై ప్లాంట్‌లో ఉత్పత్తి నిలిపివేస్తున్నట్లు హ్యుందాయ్ ప్రకటించగా, టయోటా కిర్లోస్కర్ .. కర్ణాటకలోని బిడది ప్లాంటులో తయారీ ఆపివేస్తున్నట్లు తెలిపింది. టీవీఎస్ మోటార్ తమ ప్లాంట్లన్నింటిలోనూ మార్చి 23 నుంచి రెండు రోజుల పాటు ఉత్పత్తి నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. పరిస్థితిని బట్టి తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొంది. అటు బజాజ్ ఆటో కూడా తమ ఫ్యాక్టరీల్లో తయారీ కార్యకలాపాలు ఆపేసినట్లు సోమవారం ప్రకటించింది. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా మహారాష్ట్రలోని చకన్‌తో పాటు మిగతా ప్రాంతాల్లోని ఫ్యాక్టరీల్లో కూడా ఉత్పత్తి నిలిపివేసినట్లు బజాజ్ ఆటో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాకేశ్ శర్మ ఒక ప్రకటనలో తెలిపారు. అత్యవసర సర్వీసుల కోసం స్వల్ప సంఖ్యలో మాత్రమే సిబ్బంది ఉంటారని పేర్కొన్నారు. ఉద్యోగుల విదేశీ ప్రయాణాలను, సమావేశాలను రద్దు చేశామని.. పలువురికి వర్క్ ఫ్రం హోమ్ విధానం అమలు చేస్తున్నామని శర్మ చెప్పారు. కాంట్రాక్టు ప్రాతిపదికన తమకు వాహనాలు తయారు చేసి అందించే సుజుకీ మోటార్ గుజరాత్ (ఎస్ఎంజీ) ఉత్పత్తి నిలిపివేసినట్లు మారుతీ సుజుకీ తెలిపింది. కార్ల తయారీ సంస్థలు కియా మోటార్స్, బీఎండబ్ల్యూ, రెనో కూడా ఉత్పత్తి నిలిపివేస్తున్నట్లు తెలిపాయి. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలో ప్లాంటు, కంపెనీ కార్యాలయం కార్యకలాపాలు కొన్నాళ్లు ఆపివేస్తున్నట్లు కియా మోటార్స్ వెల్లడించింది. సిబ్బంది, వినియోగదారులు, భాగస్వాములు మొదలైన వారందరి క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. మరోవైపు, మార్చి నెలాఖరు దాకా తమిళనాడు, ఉత్తర్ ప్రదేశ్, హర్యానాలోని ప్లాంట్లలో ఉత్పత్తి నిలిపివేస్తున్నట్లు జపాన్ ద్విచక్ర వాహన దిగ్గజం ఇండియా యమహా మోటార్ (ఐవైఎం) తెలిపింది. హర్యానా, ఉత్తర్‌ప్రదేశ్ ప్లాంట్లలో మార్చి 23 నుంచి 31 దాకా, తమిళనాడు ప్లాంటులో మార్చి 24 నుంచి 31 దాకా తయారీ కార్యకలాపాలు ఉండవని వివరించింది. మారుతీ సుజుకీ, హోండా కార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఫియట్, హీరో మోటోకార్ప్, హోండా మోటార్ సైకిల్, సుజుకీ మోటార్‌సైకిల్ వంటి సంస్థలు తయారీని నిలిపివేస్తున్నట్లు ఆదివారమే ప్రకటించిన సంగతి తెలిసిందే. -
ఆదుకోండి మహాప్రభో!!
న్యూఢిల్లీ: అమ్మకాలు లేకపోవడంతో పాటు పలు సవాళ్లతో సతమతమవుతున్న ఆటోమొబైల్ సంస్థలు ఆపన్న హస్తం అందించాలంటూ కేంద్రానికి విజ్ఞప్తి చేశాయి. పరిశ్రమను ఆదుకునేందుకు ఉద్దీపన ప్యాకేజీ ఇవ్వాలని, వాహనాలపై వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) తగ్గించాలని కోరాయి. బుధవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయిన పరిశ్రమ దిగ్గజాలు ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. మారుతీ సుజుకీ చైర్మన్ ఆర్సీ భార్గవ, ఎంఅండ్ఎం ప్రెసిడెంట్ (ఆటోమోటివ్ విభాగం).. ఆటోమొబైల్ తయారీ సంస్థల సమాఖ్య సియామ్ ప్రెసిడెంట్ కూడా అయిన రాజన్ వధేరాతో పాటు ఆటో పరికరాల తయారీ సంస్థల సమాఖ్య ఏసీఎంఏ, డీలర్ల సమాఖ్య ఎఫ్ఏడీఏ ప్రతినిధులు ఈ భేటీలో పాల్గొన్నారు. ‘ఆటో పరిశ్రమకు ఊతమిచ్చేలా చర్యలు తీసుకోవాలంటూ మేం కోరాము. డిమాండ్‌ను పెంచే దిశగా వాహనాలపై జీఎస్టీ రేటును 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించాలని విజ్ఞప్తి చేశాము. ప్రభుత్వానికి కూడా కొన్ని ఆలోచనలు ఉన్నాయి. ఆటో రంగానికి త్వరలో ఉద్దీపన ప్యాకేజీ లభించగలదని ఆశిస్తున్నాను‘ అని భేటీ అనంతరం రాజన్ వధేరా చెప్పారు. ఆటోమొబైల్ రంగ సమస్యలను పరిష్కరించేందుకు కేంద్రం తప్పక చర్యలు తీసుకుంటుందని భారీ పరిశ్రమల శాఖ మంత్రి అరవింద్ సావంత్ తెలిపారు. ‘చర్చల ప్రక్రియలో భాగంగానే ఈ సమావేశం జరిగింది. వారు చెప్పిన విషయాలన్నింటినీ పరిశీలిస్తాం. తాజాగా రిజర్వ్ బ్యాంక్ కీలక వడ్డీ రేట్లను తగ్గించడం సానుకూలాంశం. ఇక ఆ ప్రయోజనాలను కస్టమర్లకు బదలాయించాల్సిన బాధ్యత బ్యాంకులపై ఉంది‘ అని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి రాజీవ్ కుమార్ చెప్పారు. దాదాపు ఏడాదికాలంగా అమ్మకాలు క్షీణించి వాహన సంస్థలు సతమతమవుతున్న సంగతి తెలిసిందే. సియామ్ గణాంకాల ప్రకారం ఏప్రిల్–జూన్ మధ్య కాలంలో 60,85,406 యూనిట్లే అమ్ముడయ్యాయి. గతేడాది ఇదే వ్యవధిలో నమోదైన 69,47,742 వాహన విక్రయాలతో పోలిస్తే ఇది 12.35 శాతం తగ్గుదల. మందగమనం కారణంగా గడిచిన మూడు నెలల్లో దాదాపు రెండు లక్షల పైచిలుకు ఉద్యోగాల్లో కోత విధించాల్సి వచ్చిందని ఎఫ్ఏడీఏ ప్రకటించింది. రిజిస్ట్రేషన్ ఫీజు పెంపు ఇప్పుడే వద్దు.. రుణ లభ్యత, అధిక వడ్డీ రేట్లపరమైన సమస్యలు, వాహనాల కొనుగోలు ఖర్చులు పెరిగిపోతుండటం, వాణిజ్య వాహనాల యాక్సి లోడ్ సామర్థ్యం లో మార్పులు చేయడం తదితర అంశాలు డిమాండ్‌ను దెబ్బతీశాయని వివరించినట్లు వధేరా చెప్పారు. ఇప్పటికే పలు సవాళ్లతో సతమతమవుతున్న నేపథ్యంలో వాహనాల రిజిస్ట్రేషన్ ఫీజు పెంపు ప్రతిపాదనలను సత్వరం అమల్లోకి తెస్తే మరిన్ని సమస్యలు ఎదురవుతాయని పరిశ్రమ వర్గాలు మంత్రికి వివరించాయి. రుణ లభ్యత పెరిగేలా చూడాలి.. ‘తక్కువ వడ్డీ రేట్లపై రుణాలు లభించేలా చూసేందుకు సత్వరం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆర్బీఐ వడ్డీ రేట్ల కోత ప్రయోజనాలను కస్టమర్లకు వెంటనే బదలాయించేలా బ్యాంకులను కేంద్రం ఆదేశించాలంటూ కోరాము‘ అని వధేరా చెప్పారు. పాత, కాలుష్యకారకంగా మారుతున్న వాహనాలను రీప్లేస్ చేసేందుకు ప్రోత్సాహకాలతో కూడిన స్క్రాపేజీ పాలసీని ప్రవేశపెడితే కొత్త వాహనాలకు డిమాండ్ పెరగగలదని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు వధేరా చెప్పారు. -
జోరుగా కార్ల అమ్మకాలు..
గత ఆర్థిక సంవత్సరంలో 8% అప్: సియామ్ వెల్లడి న్యూఢిల్లీ: కార్ల అమ్మకాలు గత ఆర్థిక సంవత్సరంలో బాగా జోరందుకున్నాయి. గత ఐదేళ్లలో అత్యధిక విక్రయాలు చోటు చేసుకున్నాయని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్(సియామ్) తెలిపింది. కొత్త మోడళ్లు అధికంగా రావడం, అమ్మకాలు పెంచుకోవడానికి కంపెనీలు భారీగా డిస్కౌంట్లు ఆఫర్ చేయడం దీనికి కారణమని సియామ్ డిప్యూటీ డెరైక్టర్ జనరల్ సుగతో సేన్ తెలిపారు. 2014-15లో 18,77,706గా ఉన్న కార్ల విక్రయాలు గత ఆర్థిక సంవత్సరంలో 8% వృద్ధితో 20,25,479కు పెరిగాయని పేర్కొన్నారు. కార్ల విక్రయాల్లో అత్యధిక వృద్ధి 2010-11 ఏడాదిలో చోటు చేసుకుందని, ఆ ఏడాది కార్ల విక్రయాలు 29 శాతం వృద్ధి సాధించాయని వివరించారు. -
‘బీఎస్ ఫైవ్’ను విస్మరించకండి...
సియాం ప్రెసిడెంట్ విక్రమ్ కిర్లోస్కర్ న్యూఢిల్లీ: భారత్ స్టేజ్ (బిఎస్) పర్యావరణ నిబంధనల విషయంలో రాజీపడకూడదని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్(సియాం) పేర్కొంది. ఇలా రాజీపడితే వినియోగదారుల భద్రతకే ముప్పు రాగలదని హెచ్చరించింది. బిఎస్ ఫైవ్‌ను వదిలి వేసి నేరుగా బిఎస్ సిక్స్ నిబంధనలను తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోందన్న ఊహాగానాలున్నాయని, ఇది సరికాదని సియాం ప్రెసిడెంట్ విక్రమ్ కిర్లోస్కర్ చెప్పారు. ఇలా వదిలివేస్తే వినియోగదారుల భద్రత విషయంలో రాజీపడాల్సి వస్తుందని, ఇది వారి ప్రాణాలకే ముప్పు అని ఆయన వివరించారు. ప్రస్తుతం భారత్‌లోని 33 నగరాల్లో కార్లకు సంబంధించి బీఎస్-ఫోర్ నిబంధనలు అమలవుతున్నాయి. మిగిలిన చోట్ల బీఎస్ త్రీ నిబంధనలు అమల్లో ఉన్నాయి. -
పుంజుకున్న కార్ల అమ్మకాలు
మోడీ మేజిక్ ఎక్సైజ్ సుంకం తగ్గింపు కొనసాగించాలి: సియామ్ విజ్ఞప్తి న్యూఢిల్లీ: వరుసగా రెండు నెలలుగా క్షీణిస్తూ వచ్చిన కార్ల అమ్మకాలు మే నెలలో కాస్త పుంజుకున్నాయి. అలాగే వరుసగా ఎనిమిది నెలలుగా తగ్గుతూ వస్తున్న ప్రయాణికుల వాహనాల అమ్మకాలు కూడా మేలో పెరిగాయి. ఎన్నికల అనంతరం సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పడటంతో గత నెలలో కార్ల అమ్మకాలు 3 శాతం పెరిగాయని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (సియామ్) వెల్లడించింది. సెంటిమెంట్ మెరుగుపడిందని, ఎంక్వైరీలు పెరుగుతున్నాయని, అమ్మకాలు కూడా పుంజుకుంటున్నాయని సియామ్ డెరైక్టర్ జనరల్ విష్ణు మాధుర్ వెల్లడించారు. అయితే పరిస్థితులు మెరుగుపడ్డాయని ఇప్పుడే చెప్పడం తొందరపాటు అవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. సుదీర్ఘకాలంగా అమ్మకాల్లేక కుదేలైన వాహన రంగం కోలుకోవాలంటే ప్రభుత్వం తోడ్పాటు తప్పనిసరని పేర్కొన్నారు. మధ్యంతర బడ్జెట్లో అందించిన ఎక్సైజ్ సుంకం తగ్గింపును కొనసాగించాలని కోరుతున్నామని, అలాగే జీఎస్టీను అమలు చేయాలని సూచించారు. ఆర్థిక వృద్ధి జోరు పెంచడానికి పారిశ్రామిక ప్రాజెక్ట్‌లకు పర్యావరణ అనుమతిలివ్వాలని ఆయన కోరారు. ప్రభుత్వం అత్యవసర ప్రణాళికలకు సిద్ధంగా ఉందని, ఫలితంగా వర్షాలు సరిగ్గా కురవకపోయినా, వాహనరంగంపై పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఆయన వెల్లడించిన గణాంకాల ప్రకారం.. . * గత ఏడాది మేలో 1,44,132గా ఉన్న దేశీయ కార్ల అమ్మకాలు, ఈ ఏడాది మేలో 1,48,577కు పెరిగాయి. * ఫిబ్రవరిలో 1 శాతం పెరిగిన కార్ల అమ్మకాలు మార్చిలో 5 శాతం, ఏప్రిల్‌లో 10 శాతం చొప్పున క్షీణించాయి. * స్కూటర్ల అమ్మకాలు 2,65,892 నుంచి 34 శాతం వృద్ధితో 3,57,564కు పెరిగాయి. హోండా మోటార్, సైకిల్స్ ఇండియా స్కూటర్ల అమ్మకాలు 41 శాతం, హీరో మోటొకార్ప్ అమ్మకాలు 15 శాతం చొప్పున వృద్ధి చెందాయి. ఇక టీవీఎస్ మోటార్ కంపెనీ స్కూటర్ల అమ్మకాలు కూడా 59 శాతం వృద్ధి సాధించాయి. * వాణిజ్య వాహనాల విక్రయాలు 55,458 నుంచి 15 శాతం క్షీణించి 46,986కు పడిపోయాయి. ఈ సెగ్మెంట్ వాహన విక్రయాలు క్షీణించడం ఇది వరుసగా 19వ నెల. * మొత్తం మీద అన్ని సెగ్మెంట్ల వాహన విక్రయాలు 14,99,893 నుంచి 13 శాతం వృద్ధితో 16,98,138కు పెరిగాయి. -
క్షీణించిన కార్ల అమ్మకాలు
సియామ్ ఏప్రిల్ గణాంకాలు ఏడాది కాలంలో ఇదే అత్యధిక క్షీణత న్యూఢిల్లీ: దేశీయ కార్ల అమ్మకాలు గత నెలలో 10.15 శాతం క్షీణించాయని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (సియామ్) తెలిపింది. ఒక ఏడాది కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే గత నెలలోనే కార్ల అమ్మకాలు అధికంగా క్షీణించాయని సియామ్ డిప్యూటీ డెరైక్టర్ జనరల్ సుగతో సేన్ పేర్కొన్నారు. స్థూల ఆర్థిక పరిస్థితులు ఆశావహంగా లేకపోవడంతో ఎక్సైజ్ సుంకం తగ్గించినప్పటికీ, డిమాండ్ పుంజుకోలేదని ఫలితంగా కార్ల అమ్మకాలు క్షీణించాయని వివరించారు. అధికంగా ఉన్న వడ్డీరేట్లు, ఇంధనం ధరలు, ద్రవ్యోల్బణం వంటి అంశాలు కూడా తీవ్రంగానే ప్రభావం చూపుతున్నాయని పేర్కొన్నారు. ఎక్సైజ్ సుంకం తగ్గించినప్పటికీ అమ్మకాలు పుంజుకోలేదని. ప్రతికూల సెంటిమెంట్ నుంచి బయటపడలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. -
కోలుకున్న కార్ల అమ్మకాలు: సియామ్
న్యూఢిల్లీ: కార్ల అమ్మకాలు గత నెలలో కాస్త పుంజుకున్నాయి. వాహనాలపై ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడం, ఫిబ్రవరిలో జరిగిన ఆటో షో సానుకూల సెంటిమెంట్‌ను సృష్టించడం, మారుతీ సుజుకి, హోండా కార్లకు డిమాండ్‌తో పాటు అమ్మకాలు పెరగడం వంటి కారణాలతో కార్ల విక్రయాలు 1.39 శాతం పెరిగాయని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్(సియామ్) తెలిపింది. గత ఏడాది ఫిబ్రవరిలో దేశీయంగా 1,58,512 కార్లు అమ్ముడవగా ఈ ఏడాది ఫిబ్రవరిలో 1.39 శాతం వృద్ధితో 1,60,718 కార్లు విక్రయమయ్యాయని సియామ్ డెరైక్టర్ జనరల్ విష్ణు మాధుర్ చెప్పారు. గత ఏడాది సెప్టెంబర్ నుంచి చూస్తే, గత నెలలోనే కార్ల అమ్మకాలు పెరిగాయని పేర్కొన్నారు. -
12వ ఆటో ఎక్స్‌పోలో కొత్త కార్ల సందడి