సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ న్యూఢిల్లీలో 64వ వార్షిక సమావేశాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో కేంద్ర రోడ్డు రవాణా & రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. హైడ్రోజన్ ఉత్పత్తి గురించి ప్రస్తావించారు.
ప్రపంచవ్యాప్తంగా హైడ్రోజన్ ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉండగల దేశాల జాబితాలో భారత్ ముందు వరుసలో ఉండాలని గడ్కరీ పేర్కొన్నారు. ఆటోమోటివ్ పరిశ్రమ దేశం మొత్తం జీడీపీకి 6.8 శాతం అని వెల్లడిస్తూ.. తయారీ రంగం దేశాభివృద్ధికి కీలకమని అన్నారు. 2030 నాటికి కార్బన్ ఉద్గారాలను తగ్గించాలని చెప్పారు.
దేశంలో హైడ్రోజన్ ఉత్పత్తిని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని.. ఎలక్ట్రోలైజర్ల ఉత్పత్తిలో భారతదేశాన్ని అగ్రస్థానానికి తీసుకురావడానికి హైడ్రోజన్ ఉత్పత్తిని స్థానికీకరించే సాంకేతికత అవసరమని ఆయన అన్నారు. బయోహైడ్రోజన్‌ను ఉత్పత్తి చేయడానికి వ్యర్థాలను ఉపయోగించాలనే ప్రతిపాదన గురించి ఆయన మాట్లాడారు.
ఇదీ చదవండి: వైకల్యాన్ని జయించి.. బిలియనీర్‌గా నిలిచి: జీవితాన్ని మార్చే స్టోరీ
భారతదేశం ప్రస్తుతం ఆటోమొబైల్ రంగంలో ప్రపంచవ్యాప్తంగా మూడవ అతిపెద్ద మార్కెట్‌గా ఉంది. రాబోయే రోజుల్లో ఇది మరింత వృద్ధి చెందుతుంది. కాబట్టి ఫ్యూయెల్ వాహనాలను వీలైనంత వరకు తగ్గించాలని గడ్కరీ సూచించారు. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా ఉపయోగపడుతుందని అన్నారు. పెట్రోల్ దిగుమతులను తగ్గించుకోవాలని.. దీనికి ప్రత్యామ్నాయ ఇంధనాలను ఉపయోగించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
📍𝑵𝒆𝒘 𝑫𝒆𝒍𝒉𝒊
64th SIAM Annual Convention 2024 pic.twitter.com/jZP0723nAa— Nitin Gadkari (@nitin_gadkari) September 10, 2024
Comments
Please login to add a commentAdd a comment