కోలుకున్న కార్ల అమ్మకాలు: సియామ్
న్యూఢిల్లీ: కార్ల అమ్మకాలు గత నెలలో కాస్త పుంజుకున్నాయి. వాహనాలపై ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడం, ఫిబ్రవరిలో జరిగిన ఆటో షో సానుకూల సెంటిమెంట్‌ను సృష్టించడం, మారుతీ సుజుకి, హోండా కార్లకు డిమాండ్‌తో పాటు అమ్మకాలు పెరగడం వంటి కారణాలతో కార్ల విక్రయాలు 1.39 శాతం పెరిగాయని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్(సియామ్) తెలిపింది.
గత ఏడాది ఫిబ్రవరిలో దేశీయంగా 1,58,512 కార్లు అమ్ముడవగా ఈ ఏడాది ఫిబ్రవరిలో 1.39 శాతం వృద్ధితో 1,60,718 కార్లు విక్రయమయ్యాయని సియామ్ డెరైక్టర్ జనరల్ విష్ణు మాధుర్ చెప్పారు. గత ఏడాది సెప్టెంబర్ నుంచి చూస్తే, గత నెలలోనే కార్ల అమ్మకాలు పెరిగాయని పేర్కొన్నారు.