
క్షీణించిన కార్ల అమ్మకాలు
- సియామ్ ఏప్రిల్ గణాంకాలు
- ఏడాది కాలంలో ఇదే అత్యధిక క్షీణత
న్యూఢిల్లీ: దేశీయ కార్ల అమ్మకాలు గత నెలలో 10.15 శాతం క్షీణించాయని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (సియామ్) తెలిపింది. ఒక ఏడాది కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే గత నెలలోనే కార్ల అమ్మకాలు అధికంగా క్షీణించాయని సియామ్ డిప్యూటీ డెరైక్టర్ జనరల్ సుగతో సేన్ పేర్కొన్నారు. స్థూల ఆర్థిక పరిస్థితులు ఆశావహంగా లేకపోవడంతో ఎక్సైజ్ సుంకం తగ్గించినప్పటికీ, డిమాండ్ పుంజుకోలేదని ఫలితంగా కార్ల అమ్మకాలు క్షీణించాయని వివరించారు. అధికంగా ఉన్న వడ్డీరేట్లు, ఇంధనం ధరలు, ద్రవ్యోల్బణం వంటి అంశాలు కూడా తీవ్రంగానే ప్రభావం చూపుతున్నాయని పేర్కొన్నారు. ఎక్సైజ్ సుంకం తగ్గించినప్పటికీ అమ్మకాలు పుంజుకోలేదని. ప్రతికూల సెంటిమెంట్ నుంచి బయటపడలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.