ఏటా పెరుగుతున్న ఎగుమతులు 2020–21లో దేశవ్యాప్తంగా రూ.6,027 కోట్లు
2022–23లో రూ.9,397 కోట్లకు పెరుగుదల
రాష్ట్రంలో 1,00,963 హెక్టార్లలో సాగు
2022–23లో 12,265 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి
దేశంలో నాలుగో స్థానంలో ఏపీ
కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెల్లడి
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సాగు చేసే కాఫీ పంట నాణ్యతతో పాటు మంచి రుచికరంగా ఉంటుండడంతో ఏటేటా ఎగుమతులు పెంచుకుంటూ.. తన సత్తా చాటుకుంటోంది. కాఫీ పంట ఉత్పత్తిలో దేశంలోనే నాలుగో స్థానంలో ఏపీ ఉందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో 1,00,963 హెక్టార్లలో కాఫీ సాగవుతుండగా 2022–23 ఆరి్థక సంవత్సరంలో 12,265 మెట్రిక్ టన్నుల కాఫీని ఉత్పత్తి చేసినట్లు తెలిపింది. దేశంలో ఆరు రాష్ట్రాలు, ఈశాన్య ప్రాంతాల్లోనే కాఫీ సాగు అవుతోందని, కాఫీ ఉత్పత్తుల ఎగుమతులు దేశవ్యాప్తంగానూ ఏటేటా పెరుగుతున్నాయని వెల్లడించింది.
దేశంలో 2020–21లో కాఫీ ఉత్పత్తుల ఎగుమతులు విలువ రూ.6,027 కోట్లు ఉండగా 2022–23 నాటికి రూ.9,397 కోట్లకు పెరిగిందని కేంద్ర మంత్రిత్వ శాఖ వివరించింది. భారతీయ కాఫీ రంగం అభివృద్ధికి కాఫీ బోర్డు వాణిజ్య విభాగం సంపూర్ణ మద్దతు అందిస్తోందని తెలిపింది. ఇంటిగ్రేటెడ్ కాఫీ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు ద్వారా రీఫ్లాంటేషన్‌కు, కాఫీ సాగు విస్తీర్ణం పెంచేందుకు చర్యలు తీసుకుంటోందని వివరించింది.
కాఫీ సాగు చేసే స్వయం సహాయక సంఘాలు, రైతు ఉత్పత్తిదారులను ప్రోత్సహించడంతో పాటు ఉత్పత్తిని పెంచడానికి అవసరమైన కాఫీ రకాలను అందిస్తున్నట్లు తెలిపింది. అలాగే ఎగుమతి మార్కెట్‌లో భారతీయ కాఫీని ప్రోత్సహించేలా చర్యలు చేపడుతుందని పేర్కొంది. సాంకేతిక సహాయం అందించడంతో పాటు, కాఫీ తోటల పెంపకం దారులకు క్షేత్రస్థాయి నిర్వహణ, పద్ధతులపై అవసరమైన శిక్షణను వర్క్‌షాపుల ద్వారా కాఫీ బోర్డు వాణిజ్య విభాగం అందిస్తున్నదని వివరించింది.
2022–23 ఆరి్థక సంవత్సరంలో కాఫీ సాగు విస్తీర్ణం, ఉత్పత్తి ఇలా
రాష్ట్రం పేరు విస్తీర్ణం సాగు (హెక్టార్లు) ఉత్పత్తి (మెట్రిక్ టన్నులు)
కర్ణాటక 2,46,550 2,48,020
కేరళ 85,957 72,425
తమిళనాడు 35,685 18,700
ఆంధ్రప్రదేశ్ 1,00,963 12,265
ఒడిశా 4,868 465
ఈశాన్య ప్రాంతాలు 5,647 125
Comments
Please login to add a commentAdd a comment