Coffee cultivation
-
ఏపీ కాఫీకి ‘భలే’ డిమాండ్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సాగు చేసే కాఫీ పంట నాణ్యతతో పాటు మంచి రుచికరంగా ఉంటుండడంతో ఏటేటా ఎగుమతులు పెంచుకుంటూ.. తన సత్తా చాటుకుంటోంది. కాఫీ పంట ఉత్పత్తిలో దేశంలోనే నాలుగో స్థానంలో ఏపీ ఉందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో 1,00,963 హెక్టార్లలో కాఫీ సాగవుతుండగా 2022–23 ఆరి్థక సంవత్సరంలో 12,265 మెట్రిక్ టన్నుల కాఫీని ఉత్పత్తి చేసినట్లు తెలిపింది. దేశంలో ఆరు రాష్ట్రాలు, ఈశాన్య ప్రాంతాల్లోనే కాఫీ సాగు అవుతోందని, కాఫీ ఉత్పత్తుల ఎగుమతులు దేశవ్యాప్తంగానూ ఏటేటా పెరుగుతున్నాయని వెల్లడించింది.దేశంలో 2020–21లో కాఫీ ఉత్పత్తుల ఎగుమతులు విలువ రూ.6,027 కోట్లు ఉండగా 2022–23 నాటికి రూ.9,397 కోట్లకు పెరిగిందని కేంద్ర మంత్రిత్వ శాఖ వివరించింది. భారతీయ కాఫీ రంగం అభివృద్ధికి కాఫీ బోర్డు వాణిజ్య విభాగం సంపూర్ణ మద్దతు అందిస్తోందని తెలిపింది. ఇంటిగ్రేటెడ్ కాఫీ డెవలప్మెంట్ ప్రాజెక్టు ద్వారా రీఫ్లాంటేషన్కు, కాఫీ సాగు విస్తీర్ణం పెంచేందుకు చర్యలు తీసుకుంటోందని వివరించింది.కాఫీ సాగు చేసే స్వయం సహాయక సంఘాలు, రైతు ఉత్పత్తిదారులను ప్రోత్సహించడంతో పాటు ఉత్పత్తిని పెంచడానికి అవసరమైన కాఫీ రకాలను అందిస్తున్నట్లు తెలిపింది. అలాగే ఎగుమతి మార్కెట్లో భారతీయ కాఫీని ప్రోత్సహించేలా చర్యలు చేపడుతుందని పేర్కొంది. సాంకేతిక సహాయం అందించడంతో పాటు, కాఫీ తోటల పెంపకం దారులకు క్షేత్రస్థాయి నిర్వహణ, పద్ధతులపై అవసరమైన శిక్షణను వర్క్‌షాపుల ద్వారా కాఫీ బోర్డు వాణిజ్య విభాగం అందిస్తున్నదని వివరించింది. 2022–23 ఆరి్థక సంవత్సరంలో కాఫీ సాగు విస్తీర్ణం, ఉత్పత్తి ఇలారాష్ట్రం పేరు విస్తీర్ణం సాగు (హెక్టార్లు) ఉత్పత్తి (మెట్రిక్ టన్నులు) కర్ణాటక 2,46,550 2,48,020 కేరళ 85,957 72,425 తమిళనాడు 35,685 18,700 ఆంధ్రప్రదేశ్ 1,00,963 12,265 ఒడిశా 4,868 465 ఈశాన్య ప్రాంతాలు 5,647 125 -
అరకు కాఫీకి సలాం.!
సాక్షి, విశాఖపట్నం : ‘‘మన దేశంలో స్థానిక ఉత్పత్తులు ప్రపంచ స్థాయి గుర్తింపును సాధిస్తుండడం భారతీయులంతా గర్వించదగ్గ విషయం. అలాంటి ఉత్పత్తుల్లో అరకువ్యాలీ కాఫీ ప్రథమ శ్రేణిలో ఉంటుంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో అరకు కాఫీని గిరిజనులు అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. శ్రేష్టమైన అరోమా రుచి గల ఇక్కడ పండే అరకు కాఫీ మంచి గుర్తింపు ఉంది. లక్షా 50 వేల మంది ఆదివాసీ కుటుంబాలు అరకు కాఫీ సాగు, ఉత్పత్తి, విక్రయాలతో ఆర్ధిక సాధికారత సాధిస్తున్నారు. కాఫీకి గ్లోబల్ గుర్తింపు తీసుకురావడంలో విశేషమైన కృషి చేస్తున్న జీసీసీ.. ఆదివాసీ రైతు సోదర,సోదరీమణుల్ని ఒక తాటిపైకి తీసుకువచ్చి, కాఫీ సాగుకు ప్రోత్సహిస్తోంది.ఈ ప్రక్రియలో గిరిజనుల ఆదాయం గణనీయంగా పెరగడంతో పాటు గౌరవనీయమైన జీవనాన్ని సాగిస్తున్నారు. అరకు కాఫీ రుచి గురించి చెప్పాల్సిన అవసరంలేదు..అద్భుతంగా ఉంటుంది. అరకు కాఫీకి ప్రపంచస్థాయి అవార్డులు ఎన్నో వచ్చాయి. గతేడాది సెప్టెంబర్‌లో ఢిల్లీలో జరిగిన జి 20 సమ్మిట్ లో కూడా అరకువ్యాలీ కాఫీకి ప్రాచుర్యం లభించింది. మీకు ఎప్పుడు వీలు దొరికినా అరకువ్యాలీ కాఫీ రుచిని ఆస్వాదించండి’’ఆదివారం నిర్వహించిన మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఏపీలో గిరిజనులు సాగు చేస్తున్న అరకువ్యాలీ కాఫీ గురించి ప్రధాని మోదీ ప్రస్తావించిన మాటలివీ. ప్రధాని ప్రశంసల వెనుక కాఫీకి రుచి తీసుకొచ్చి.. ప్రపంచ గుర్తింపు తీసుకురావడంలో గత ఐదేళ్లలో అనేక కృషి సల్పింది వైఎస్సార్సీపీ ప్రభుత్వం.2014–19 కాలంలో రాష్ట్రంలోని ప్రతి విభాగాన్ని నిర్వీర్యం చేసిన చంద్రబాబు.. గిరిజన సహకార సంస్థ (జీసీసీ)కీ అదే దుస్థితి పట్టించారు. ఇక కోలుకోలేదనుకున్న సంస్థకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం కొత్త ఊపిరి పోసింది. జీసీసీనే నమ్ముకున్న గిరిజనుల జీవితాలకు కొత్త వెలుగులు తీసుకొచ్చింది. ఉత్పత్తుల కొనుగోలు దగ్గర నుంచి.. విక్రయాల వరకూ తిరుగులేని శక్తిగా అభివృద్ధి పథంలోకి దూసుకుపోయింది. కాఫీ తోటలకు పునరుజ్జీవం పోశారు. ఫలితంగా చంద్రబాబు కాలంలో టర్నోవర్ కంటే.. ఈ ఐదేళ్లలో రెట్టింపు టర్నోవర్‌ని జీసీసీ సొంతం చేసుకుంది.తొలిసారిగా కాఫీతోటలకు సేంద్రీయ ధృవీకరణ లభించడంతో పాటు.. ఐదు జాతీయ అవార్డులు సొంతం చేసుకుంది. త్వరలోనే విదేశాలకు కాఫీని సొంతంగా ఎగుమతి చేసేందుకూ సిద్ధమవుతోంది. 2014–15 నుంచి 2018–19 వరకూ రూ.1209 కోట్లు మాత్రమే ఉన్న జీసీసీ టర్నోవర్ ఒక్కసారిగా గేర్ మార్చింది. గత సీఎం వైఎస్ జగన్ జీసీసీ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించడంతో 2019–20 నుంచి 2023–24 మధ్య కాలంలో రెట్టింపై ఏకంగా టర్నోవర్ రూ.2,303 కోట్లకు చేరుకుంది.మేడిన్ ఆంధ్రా పేరుతో...ఓ వైపు అరకు కాఫీ టేస్టీగా ఉండటమే కాకుండా.. ఆర్గానిక్‌గా పండించడం వల్ల గిరాకీ సొంతం చేసుకుంది. అల్లూరి జిల్లాలో మొత్తం 2.27 లక్షల ఎకరాల్లో కాఫీ తోటలు విస్తరించాయి. ఈ తోటల్లో ఏడాదికి 71, 258 మెట్రిక్ టన్నుల కాఫీపండ్లు ఉత్పత్తి అవుతున్నాయి. ఇందులో ప్రస్తుతానికి రెండు క్లస్టర్లలో 2,258.55 హెక్టార్ల విస్తీర్ణంలో ఆర్గానిక్ పద్ధతుల్లో కాఫీని పండిస్తున్నారు. చింతపల్లి క్లస్టర్ వరుసగా మూడో ఏడాది కూడా నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఆర్గానిక్ ప్రొడక్షన్ (ఎన్‌పీవోపీ) స్టాండర్డ్స్ సర్టిఫికెట్ తీసుకోగా.. జీకేవీధి క్లస్టర్ ఇప్పటికే రెండుసార్లు స్కోప్ సర్టిఫికెట్ దక్కించుకుంది. మూడో ఏడాదీ సేంద్రీయ సాగుకు సంబంధించి స్కోప్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకుంది. ప్రస్తుతం కాఫీ గింజల క్యూరింగ్, ప్రాసెసింగ్ అంతా బెంగళూరులోని అవుట్ సోర్సింగ్ ఏజెన్సీతో టై–అప్ కారణంగా కాఫీ ప్రాసెసింగ్ వ్యయం పెరుగుతూ వస్తోంది. డౌనూరులో క్యూరింగ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటైతే ఈ ఖర్చులు తగ్గే అవకాశం ఉంటుంది. పాడేరు ఏజెన్సీలోని 11 మండలాల్లో 2,27,021 ఎకరాల విస్తీర్ణంలో కాఫీ తోటలున్నాయి. మొత్తం 93,521 మంది గిరిజనులు కాఫీ సాగులో పాల్గొంటున్నారు, వీరిలో 2,600 మంది రైతులు టాప్ గ్రేడ్ రకాన్ని సాగు చేస్తున్నారు. వీరి వద్ద నుంచి సేకరించిన బీన్స్‌ని ఫిల్టర్ కాఫీ ఉత్పత్తి కోసం బెంగళూరుకు, ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ ఉత్పత్తి, రిటైల్ మార్కెటింగ్ కోసం ఏలూరుకు పంపిస్తుంటారు. ఇకపై ఇక్కడి నుంచే చేసేలా క్యూరింగ్ వ్యవస్థ సిద్ధమవుతోంది. త్వరలోనే మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ పేరుతో అరకు కాఫీ ఉత్పత్తుల్ని మార్కెట్లోకి పంపించేందుకు అవకాశం ఉంది.తొలిసారిగా భారీగా ధరలు పెంపుగిరిజన రైతుల జీవనోపాధి, ఆదాయ స్థాయిల్ని కాఫీ తోటల పెంపకం ద్వారా మెరుగుపరచడమే ప్రధాన లక్ష్యంగా సీఎంగా ఉన్న సమయంలో వైఎస్ జగన్ పాడేరు ఏజెన్సీ పరిధిలోని 11 మండలాల్లో సుమారు లక్షకు పైగా ఎకరాల్లో కాఫీ ప్లాంటేషన్ ఏర్పాటు చేశారు. గిరిజనులు పండించిన కాఫీకి జీసీసీ ద్వారా మార్కెటింగ్ సౌకర్యాన్ని కల్పించారు. ఎన్నడూ లేని విధంగా గిరిజన రైతు పండించిన కాఫీని జీసీసీ భారీ మద్దతు ధరకు కొనుగోలు చేసింది. పార్చ్మెంట్ కాఫీ కిలోకి రూ.285, చెర్రీ కాఫీ కిలోకి రూ.145 మార్కెట్ ధరగా ప్రకటించి కొనుగోలు చేయడంతో మధ్యవర్తుల దోపిడిని నిరోధించింది. 2023–24లో ఇప్పటి వరకూ 564.48 మెట్రిక్ టన్నుల ముడి కాఫీని రైతుల నుంచి జీసీసీ కొనుగోలు చేసి రూ.13.39 కోట్లు కాఫీ రైతు బ్యాంకు ఖాతాలకు నేరుగా జమ చేసింది.2019–24 మధ్యలో అరకు కాఫీ ఎదిగిందిలా..⇒ 2018–19 కాలంలో రూ.799.58 లక్షల కాఫీ కొనుగోలు చేయగా.. 2023–24 నాటికి రూ.1339.05 లక్షల కాఫీ కొనుగోలు చేసింది.⇒ డౌనూరులో ఇంటిగ్రేటెడ్ కాఫీ ప్రాసెసింగ్ యూనిట్‌ని స్థాపించేందుకు రూ.3 కోట్లుని ప్రభుత్వం మంజూరు చేయగా 2023 అక్టోబర్ 20న అప్పటి మంత్రులు శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం పనులు చురుగ్గా సాగుతున్నాయి. ⇒ కాఫీ తోటల నిర్వహణకు జీసీసీ ద్వారా గిరిజన రైతులకు ఏటా రూ.1.05 కోట్ల రుణాల్ని, వ్యవసాయ కార్యక్రమాల అమలుకు రూ.1.06 కోట్ల క్రెడిట్ రుణాల్ని పంపిణీ చేశారు.⇒ వివిధ నగరాలు, పట్టణాల్లో అరకు కాఫీ పేరుతో అవుట్‌లెట్స్ ఏర్పాటు చేశారు. ⇒ దేశానికి వచ్చే వివిధ దేశాల అతిథులకు, రాష్ట్రానికి వచ్చే ప్రముఖులకు అరకు కాఫీతో పాటు జీసీసీ ఉత్పత్తులు బహుమతులుగా అందించేలా వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రోత్సహించింది. విశాఖ వేదికగా నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కు హాజరైన దేశ, విదేశీ పెట్టుబడిదారులకు అరకు కాఫీతో పాటు జీసీసీ ఉత్పత్తులతో కూడిన కిట్స్ అందించారు.⇒ సేంద్రీయ పద్ధతుల్లో పండుతున్న కాఫీ ఘుమఘుమలకు విదేశీయులు ఫిదా అవుతోంది. విదేశీ విపణిలో పెరుగుతున్న డిమాండ్‌ని దృష్టిలో పెట్టుకొని ఇకపై సొంతంగా ఎగుమతులు చేపట్టాలని జీసీసీ భావిస్తోంది. ఇప్పటికే ఎక్స్పోర్ట్ సంస్థలతో అధికారులు సంప్రదింపులు జరిపారు.గిరిజనుల ఆర్ధిక సాధికారతకు ఊతమిస్తున్న అరకు కాఫీఅల్లూరి జిల్లాలో అరకు వ్యాలీ సాగు, గిరిజనులకు రాష్ట్ర ప్రభుత్వం, జీసీసీ అందిస్తున్న ప్రోత్సాహాన్ని ప్రధానినరేంద్ర మోడి మన్ కి బాత్ లో ప్రత్యేకంగా ప్రస్తావించడం గర్వంగా ఉంది. సీఎం చంద్రబాబుతో కలిసి అరకు కాఫీ తాగానని చెప్పారు. ప్రధాని స్ఫూర్తివంతమైన వ్యాఖ్యలు, ప్రశంస గిరిజన కాఫీ రైతులకు, జీసీసీ సిబ్బందికి, కాఫీ సాగుతో ముడిపడి వున్న అన్ని ప్రభుత్వ శాఖల సిబ్బంది, వర్గాల వారికీ ఎంతగానో ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని ఇచ్చింది. గిరిజనుల ఆర్ధిక సాధికారతకు అరకు కాఫీ ఎంతగానో ఊతమిస్తోంది. –జి. సురేష్ కుమార్, జీసీసీ ఉపాద్యక్షుడు, ఎండీ -
అరకు కాఫీకి ఆర్గానిక్ సర్టిఫికేట్... ఇంటర్నేషనల్ మార్కెట్లో ఫుల్ డిమాండ్
-
కాఫీ క్లాసులు.. జమీర్ కృషి వృథా పోలేదు
వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు వెళ్లడానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తారు కొందరు. కొందరు మాత్రం కాస్త ఆగి వెనక్కి చూసి ఆగిపోయిన వారికి ఆసరాగా నిలుస్తారు. అండగా నిలబడతారు. జకైట్సొనో జమీర్ రెండో కోవకు చెందిన మహిళ. ‘కాఫీ లేడీ ఆఫ్ నాగాలాండ్’గా పేరు తెచ్చుకున్న జమీర్ విజయవంతమైన వ్యాపారిగా ఎదగడం వెనుక కష్టాలు ఉన్నాయి. ఆ కష్టాలను తట్టుకొని నిలబడిన పట్టుదల ఉంది. కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగ లేకపోవడంతో చదువును మధ్యలోనే వదిలేయాల్సి వచ్చింది జమీర్‌కు. కుటుంబానికి ఆసరాగా నిలవడానికి ఏదైనా చిన్నవ్యాపారమో, ఉద్యోగమో చేయాలనుకుంది. కాని ఏం చేయాలి? అనే విషయంలో మాత్రం స్పష్టత లేదు. ఆ సమయంలోనే ఒక వర్క్‌షాప్‌కు హాజరైంది జమీర్. తోట నుంచి కప్పు వరకు కాఫీ ప్రస్థానాన్ని ఆ వర్క్‌షాప్‌లో చెప్పారు. కాఫీ రుచిగా ఉండడానికి ఎన్ని విషయాలు దోహద పడతాయో అనే విషయం తనకి ఆసక్తికరంగా అనిపించింది. కాఫీ ఎలా పుడుతుందో తెలుసుకున్న క్లాసులోనే ‘బిజినెస్ ఐడియా’ పుట్టింది! ఈ క్లాస్‌ల స్ఫూర్తితో ‘ఫార్మర్ స్క్వేర్’అనే కేఫ్‌ను దిమపూర్లో మొదలుపెట్టింది. అయితే మొదలుపెట్టిన కొన్ని నెలలకే ఆ కేఫ్ మూతపడింది. అనుకున్నది ఒకటి, అయ్యింది ఒకటి... అన్నట్లుగా తయారైంది పరిస్థితి. నిరాశ చీకట్లో కొట్టుమిట్టాడుతున్న రోజుల్లో తన కోసం మరో ద్వారం తెరుచుకుంది. జర్మనీకి సంబంధించిన ఒక డెవలప్మెంట్ కార్పోరేషన్ ఏజెన్సీ ‘హర్ అండ్ నౌ’ అనే సహాయక కార్యక్రమాన్ని చేపట్టింది. మరొకరైతే ‘కాఫీకో దండం. వ్యాపారం మనకు అచ్చిరాదు’ అని వెళ్లకుండా ఉండేవారేమో! కాని జమీర్ ఈ కార్యక్రమాల్లో భాగం కావడం ద్వారా తాను చేసిన తప్పులు, చేయకూడని తప్పులు, వ్యాపార వ్యూహం ఎలా ఉండాలి? మనదైన ప్రత్యేకత ఏమిటీ, ప్రాడక్ట్ మార్కెటింగ్ ప్లాన్స్ ఎలా ఉండాలి....ఇలా రకరకాల విషయాలు తెలుసుకుంది. ‘ఫార్మర్ స్క్వేర్’తో మరోసారి బరిలోకి దిగింది. ఈసారి మాత్రం తన కల తనని నిరాశ పరచలేదు. ‘లెస్ ఈజ్ మోర్’ అనేది తన కీలక వ్యాపార సూత్రంగా మారింది. తాజా గ్రౌండ్ కాఫీని అందించడంలో ‘ఫార్మర్ స్క్వేర్’ కేఫ్‌లకు మంచి పేరు వచ్చింది. పక్కన ఉన్న రాష్ట్రాలకు కూడా వ్యాపారం విస్తరించింది. తన విజయంతో సంతృప్తి పడకుండా తనలాంటి వారిని మరింత మందిని తయారుచేసే పనిలో ఉంది జమీర్. ఆర్థికంగా వెనకబడిన మహిళలకు కాఫీ నిపుణుల చేత వర్క్‌షాప్‌లు నిర్వహించడమే కాదు వ్యాపారం ఎలా చేయాలి? నష్టాలు రాకుండా ఎలా చూడాలి... ఇలా రకరకాల విషయాలు నేర్పిస్తుంది. మరోవైపు కాఫీ పంటల సాగులో మహిళలను ప్రోత్సహిస్తూ వారికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తుంది. ‘క్వాలిటీ కాఫీ కల్చర్’ అనేది ఆమె ఎజెండాగా మారింది. ‘రకరకాల కారణాల వల్ల తీవ్రమైన నిరాశాæనిస్పృహల్లో ఉన్న సమయంలో, పెద్దగా ఆసక్తి లేకపోయినా సరే కాఫీ వర్క్‌షాప్‌కు వెళ్లాను. అక్కడ కేవలం సాంకేతిక విషయాలు మాత్రమే నేర్చుకున్నానంటే పొరపాటు. మనో బలాన్ని ఇచ్చే విషయాలు అనేకం విన్నాను. సొంతంగా వ్యాపారం మొదలుపెట్టి నన్ను నేను నిరూపించుకోవాలనే ఉత్సాహంలో ఉన్నాను’ అంటుంది నలభై రెండు సంవత్సరాల కికాన్. జమీర్ కృషి వృథా పోలేదు అని చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణ ఏముంటుంది! చదవండి: Meenakshi Vashist: దీపం వెలిగింది -
మిరియాల సాగు.. బాగు
పాడేరు : మన్యంలో మిరియాల సాగు విస్తరిస్తోంది. గిరిజన రైతులు కాఫీలో అంతర పంటగా దీనిని సాగు చేస్తున్నారు. కాఫీ తోటల్లో నీడనిచ్చే సిల్వర్‌ఓక్ చెట్లపై మిరియాల మొక్కలను పెంచుతున్నారు. ఎకరా కాఫీ తోటలో సుమారు 100 మిరియాల మొక్కలు నాటుతున్నారు. ఎకరాకు సుమారు 60 నుంచి 70 కిలోల దిగుబడి వస్తోంది. వీటికి మార్కెట్లో మంచి డిమాండ్. కిలో రూ. 500 నుంచి రూ. 600ల వరకు ధర లభిస్తోంది. కాఫీలో అంతర పంటగా వీటి సాగుకు ఐటీడీఏ ప్రోత్సహిస్తోంది. హు ద్హుద్ ధాటికి సుమారు 40వేల ఎకరాల్లో కాఫీ తోటలకు నష్టం వాటిల్లింది. నీడనిచ్చే సిల్వర్‌ఓక్ చెట్లు కూలిపోవడంతో మిరియాల పంటకూ నష్టం వాటిల్లింది. ఏజెన్సీలో కొత్తగా కాఫీ తోటలు వేసే రైతులకు ఎకరాకు100 చొప్పున మిరి యా మొక్కలను కూడా ఇస్తున్నారు. 25 లక్షల మిరియాల మొక్కల పంపిణీ.. ఏజెన్సీలో ఈ ఏడాది కాఫీ రైతులకు 25లక్షల మిరియాల మొక్కలను ఐటీడీఏ సరఫరా చేస్తోంది. ఈ ఏడాది కొత్తగా 10వేల ఎకరాల్లో కాఫీ తోటలు విస్తరిస్తున్నారు. 15వేల ఎకరాల్లో పాతతోటలను పునరుద్ధరిస్తున్నారు. ఈ 25వేల ఎకరాల్లో అంతర పంటగా ఎకరానికి 100 చొప్పున మిరియాల మొక్కలను సరఫరా చేస్తున్నారు. మిరియాల సాగులో సస్యరక్షణ పద్ధతులను ఉద్యానాధికారి రాజాసాహేబ్ వివరించారు. సస్య రక్షణ... మిరియాల మొక్కలపై పురుగుల గు డ్లు కనిపించిన వెంటనే నీలస్త్రం, బ్రహ్మాస్త్రం, ఆగ్నేయాస్త్రం, దశవర్ణి కషాయాలను పిచికారీ చేసుకోవాలి. పురుగుల గుడ్లు కనిపించకపోతే పిచికారీ చే యాల్సి న అవసరం లేదు. మొక్కలకు తెగులు ఆశిస్తే 5లీటర్ల పులిసిన మజ్జిగ 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. పంట కోత మిరియాల మొక్కలు మే, జూన్ నెల ల్లో పూతకు వస్తాయి. నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు చెట్ల నుంచి మిరియాల గుత్తులను కత్తిరించుకోని సూర్యకాంతిలో ఆరబెట్టుకోవాలి. రెండు లేదా మూడు రోజులు సూర్యకాంతిలో ఉంచాలి. నాణ్యమైన ఎండు మిరియాల దిగుబడి కోసం చెట్టు నుంచి మిరియాల గుత్తుల కోతకు సరైన సమయాన్ని నిర్ణయించుకోవడం చాల అవసరం. సెప్టెంబర్‌లో నాటుకోవాలి సిల్వర్‌ఓక్ చెట్లకు 75 సెంటీమీటర్ల దూరంలో అడుగు లోతు గుంత తీసి మిరియాల మొక్కలను నాటుకోవాలి. మొక్క చుట్టూ నీరు నిల్వ ఉండకుండా వాటి చుట్టూ మట్టిని గట్టిగా నొక్కి జీవామతం జల్లి ఎండుటాకులతో అచ్ఛాదనం చేయాలి. మిరియాల తీగలకు సూర్యకాంతి, వేడిగాలులు తగలకుండా చూడాలి. వీటి తీగలపై 15రోజులకోసారి ఎకరాకు 200 లీటర్ల జీవామతాన్ని పిచికారీ చేయాలి.