
సాక్షి, హైదరాబాద్: నగరంలో గృహాల అద్దెలు పెరిగాయి. ప్రీమియం ఇళ్లకు డిమాండ్, ఆఫీసు కేంద్రాలకు చేరువలో ఉండటం వంటి కారణంగా ప్రధాన నగరాలలో ఇళ్ల అద్దెలు వృద్ధి చెందుతున్నాయి. క్రితం త్రైమాసికంతో పోలిస్తే ఈ ఏడాది జూలై–సెపె్టంబర్‌లో 4.6 శాతం, ఏడాదితో పోలిస్తే 22.4 శాతం మేర అద్దెలు పెరిగాయని మ్యాజిక్‌బ్రిక్స్.కామ్ నివేదిక వెల్లడించింది. అత్యధికంగా థానేలో 57.3 శాతం, గుర్గావ్‌లో 41.4 శాతం, గ్రేటర్ నోయిడాలో 28.7 శాతం, నోయిడాలో 25.2 శాతం, హైదరాబాద్‌లో 24.2 శాతం మేర వృద్ధి చెందాయి.
దేశంలోని 13 నగరాలో 67 శాతంగా ఉన్న 18–34 ఏళ్ల వయసు ఉన్న మిల్లీనియల్స్ వల్లే గృహాల అద్దెలు పెరిగాయి. సెమీ ఫరి్నష్ గృహాలను రెంట్‌కు తీసుకునేందుకు నగరవాసులు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ తరహా అద్దెలకు 52.7 శాతం డిమాండ్ ఉండగా.. సప్లయి 48.7 శాతం మాత్రమే ఉందని మ్యాజిక్‌బ్రిక్స్ సీఈఓ సు«దీర్ పాయ్ తెలిపారు. నెలకు రూ.10–30 వేలు మధ్య అద్దె ఉన్న మధ్యస్థాయి గృహాలకు 41 శాతం మంది ఆసక్తి చూపిస్తున్నారని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment