Rental residence
-
గృహాల అద్దెలు పెరిగాయి!
సాక్షి, హైదరాబాద్: నగరంలో గృహాల అద్దెలు పెరిగాయి. ప్రీమియం ఇళ్లకు డిమాండ్, ఆఫీసు కేంద్రాలకు చేరువలో ఉండటం వంటి కారణంగా ప్రధాన నగరాలలో ఇళ్ల అద్దెలు వృద్ధి చెందుతున్నాయి. క్రితం త్రైమాసికంతో పోలిస్తే ఈ ఏడాది జూలై–సెపె్టంబర్లో 4.6 శాతం, ఏడాదితో పోలిస్తే 22.4 శాతం మేర అద్దెలు పెరిగాయని మ్యాజిక్‌బ్రిక్స్.కామ్ నివేదిక వెల్లడించింది. అత్యధికంగా థానేలో 57.3 శాతం, గుర్గావ్లో 41.4 శాతం, గ్రేటర్ నోయిడాలో 28.7 శాతం, నోయిడాలో 25.2 శాతం, హైదరాబాద్‌లో 24.2 శాతం మేర వృద్ధి చెందాయి. దేశంలోని 13 నగరాలో 67 శాతంగా ఉన్న 18–34 ఏళ్ల వయసు ఉన్న మిల్లీనియల్స్ వల్లే గృహాల అద్దెలు పెరిగాయి. సెమీ ఫరి్నష్ గృహాలను రెంట్‌కు తీసుకునేందుకు నగరవాసులు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ తరహా అద్దెలకు 52.7 శాతం డిమాండ్ ఉండగా.. సప్లయి 48.7 శాతం మాత్రమే ఉందని మ్యాజిక్‌బ్రిక్స్ సీఈఓ సు«దీర్ పాయ్ తెలిపారు. నెలకు రూ.10–30 వేలు మధ్య అద్దె ఉన్న మధ్యస్థాయి గృహాలకు 41 శాతం మంది ఆసక్తి చూపిస్తున్నారని పేర్కొన్నారు. -
వాస్తు ‘బాట’లో చంద్రబాబు
ఓటుకు కోట్లు కేసుతో చిక్కుల్లో పడ్డ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ఇంటి వాస్తుపై దృష్టి కేంద్రీకరించారు. ఇందులో భాగంగా ఆయన తన రాకపోకల దారి మార్చుకున్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నెం. 24లోని తన అద్దె నివాసంలోని గేటు నం. 1 నుంచి వారం క్రితం వరకూ రాకపోకలు సాగించేవారు. అయితే ఈ దిశ వాస్తుకు విరుద్ధంగా ఉందని, అందుకే ‘ఓటుకు కోట్లు’లో ఇరుక్కుపోయారని వాస్తు పండితులు చెప్పడంతో వారం రోజుల నుంచి రూటు మార్చారు. గేటు నం. 1 నుంచి కాకుండా ఇప్పుడు గేటు నం. 2 నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. ఇప్పుడు వాస్తు బాగా కుదిరిందని, వాస్తు దోషాలు పోయాయని పండితులు చెప్పడంతో ఇక నడక కూడా రెండో గేటు నుంచే మొదలు పెట్టారు. ఇంట్లో నుంచి బయటకు వచ్చాక ఇప్పటివరకూ కుడివైపు తిరిగేవారు. ఇక నుంచి ఎడమ వైపునకు తిరిగి రాకపోకలు సాగించనున్నారు. - హైదరాబాద్