Office buildings
-
గృహాల అద్దెలు పెరిగాయి!
సాక్షి, హైదరాబాద్: నగరంలో గృహాల అద్దెలు పెరిగాయి. ప్రీమియం ఇళ్లకు డిమాండ్, ఆఫీసు కేంద్రాలకు చేరువలో ఉండటం వంటి కారణంగా ప్రధాన నగరాలలో ఇళ్ల అద్దెలు వృద్ధి చెందుతున్నాయి. క్రితం త్రైమాసికంతో పోలిస్తే ఈ ఏడాది జూలై–సెపె్టంబర్లో 4.6 శాతం, ఏడాదితో పోలిస్తే 22.4 శాతం మేర అద్దెలు పెరిగాయని మ్యాజిక్‌బ్రిక్స్.కామ్ నివేదిక వెల్లడించింది. అత్యధికంగా థానేలో 57.3 శాతం, గుర్గావ్లో 41.4 శాతం, గ్రేటర్ నోయిడాలో 28.7 శాతం, నోయిడాలో 25.2 శాతం, హైదరాబాద్‌లో 24.2 శాతం మేర వృద్ధి చెందాయి. దేశంలోని 13 నగరాలో 67 శాతంగా ఉన్న 18–34 ఏళ్ల వయసు ఉన్న మిల్లీనియల్స్ వల్లే గృహాల అద్దెలు పెరిగాయి. సెమీ ఫరి్నష్ గృహాలను రెంట్‌కు తీసుకునేందుకు నగరవాసులు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ తరహా అద్దెలకు 52.7 శాతం డిమాండ్ ఉండగా.. సప్లయి 48.7 శాతం మాత్రమే ఉందని మ్యాజిక్‌బ్రిక్స్ సీఈఓ సు«దీర్ పాయ్ తెలిపారు. నెలకు రూ.10–30 వేలు మధ్య అద్దె ఉన్న మధ్యస్థాయి గృహాలకు 41 శాతం మంది ఆసక్తి చూపిస్తున్నారని పేర్కొన్నారు. -
11న కొత్త జిల్లాల్లో భూమి పూజ
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 11న కొత్త జిల్లా కేంద్రాల్లో కార్యాలయ సముదాయాలకు భూమిపూజ చేయాలని శనివారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. సిద్దిపేట, సిరిసిల్ల, నిర్మల్ జిల్లాల్లో స్వయంగా సీఎం కేసీఆర్, మిగతా చోట్ల మంత్రులు శంకుస్థాపన చేయనున్నారు. జనగామలో కడియం శ్రీహరి, వనపర్తిలో మహమూద్ అలీ, గద్వాల్లో లక్ష్మారెడ్డి, నాగర్ కర్నూల్లో జూపల్లి కృష్ణారావు, ఆసిఫాబాద్‌లో జోగు రామన్న, మంచిర్యాల, పెద్దపల్లిలో నాయిని నర్సింహారెడ్డి, మేడ్చల్‌లో శ్రీనివాసయాదవ్, రంగారెడ్డిలో పద్మారావు, వికారాబాద్‌లో మహేందర్ రెడ్డి, జగిత్యాలలో ఈటల రాజేందర్, కామారెడ్డిలో పోచారం శ్రీనివాసరెడ్డి, భూపాలపల్లిలో స్పీకర్ మధుసూదనాచారి శంకుస్థాపన చేయనున్నారు. కాగా, 12న సూర్యాపేటలో కార్యాలయ సముదాయానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. గతేడాది అక్టోబర్ 11న దసరా సందర్భంగా కొత్త జిల్లాలు ఏర్పడిన సంగతి తెలిసిందే. 20న టెక్స్టైల్ పార్కుకు శంకుస్థాపన వరంగల్ జిల్లాలో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుకు ఈ నెల 20న శంకుస్థాపన చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. -
దిష్టిబొమ్మల్లా శిలా ఫలకాలు
- నిర్మాణాలకు నోచుకోని ప్రభుత్వ కార్యాలయాల భవనాలు - నిధులు మంజూరైనా.. నిర్లక్ష్య ధోరణిలో అధికారులు కలెక్టరేట్ కాంప్లెక్స్ ఏదీ? జిల్లా కేంద్రంలో ప్రస్తుతం ఉన్న కలెక్టరేట్ భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో నూతనంగా కలెక్టరేట్ కాంప్లెక్స్ నిర్మించాలని 2011లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. రూ.35 కోట్ల అంచనా వ్యయం కాగల ఈ పనులకు అప్పటి సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం ఈ కాంప్లెక్స్‌లోనే ప్రభుత్వానికి చెందిన 54 ఇతర శాఖల కార్యాలయాలు ఏర్పాటు చేయాలని భావించడంతో, అంచనా మొత్తం రూ.100 కోట్లకు చేరింది. పూణెకు చెదిన జీకేకే కన్స్ట్రక్షన్స్ సంస్థ 8 ఎకరాల విస్తీర్ణంలో యూ ఆకారంలో ఈ కాంప్లెక్స్ నిర్మించేందుకు డిజైన్ సిద్ధం చేసింది.ప్రస్తుతం కలెక్టరేట్ 6.75 ఎకరాల స్థలంతోపాటు, పక్కనే ఉన్న జేఎన్టీయూకి చెందిన మరో 2 ఎకరాలను స్థలాన్ని సేకరించాలని అధికారులు భావించారు. ఇందుకు సంబంధించిన టెండర్ల బాధ్యత ఆర్అండ్బీ శాఖకు అప్పగించినా ఇప్పటికీ కనీసం పునాదికి కూడా నోచుకోలేదు. ఆర్డీఓ కార్యాలయాలదీ అదే దుస్థితి జిల్లాలో నూతనంగా ఏర్పడిన కళ్యాణదుర్గం, కదిరి రెవెన్యూ డివిజన్ కార్యాలయ భవనాలు కూడా నిర్మాణానికి నోచుకోలేదు. కల్యాణదుర్గం తహశీల్దార్ కార్యాలయ ఆవరణలోని 17 సెంట్లు, కదిరిలోని హిందూపురం రోడ్డులో 10 సెంట్ల స్థలం ఆర్డీఓ కార్యాలయాల నిర్మాణానికి కేటాయించడంతోపాటు, ఒక్కో భవన నిర్మాణానికి రూ.2 కోట్ల బడ్జెట్ కేటాయించారు. అయితే, ఇప్పటికీ ఈ రెండు కార్యాలయ భవనాల పనులు ప్రారంభం కాలేదు. ఏఈ కార్యాలయాల నిర్మాణాలు అంతంత మాత్రమే.. జిల్లాలోని ప్రతి మండల కేంద్రంలో ఒకటి చొప్పును గృహ నిర్మాణ శాఖ ఏఈ కార్యాలయాల నిర్మాణానికి ఒక్కోదానికి రూ.20 లక్షల చొప్పున నిధులు మంజూరయ్యాయి. జిల్లాలో 63 మండలాలుండగా ఇప్పటి దాకా 33 కార్యాలయాల భవనాల నిర్మాణాలు మాత్రమే పూర్తయ్యాయి. కాగా, అవసరమైన నిధులు అందుబాటులో ఉన్నా భవనాల నిర్మాణంలో జాప్యానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.