సాక్షి, హైదరాబాద్: ఈ నెల 11న కొత్త జిల్లా కేంద్రాల్లో కార్యాలయ సముదాయాలకు భూమిపూజ చేయాలని శనివారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. సిద్దిపేట, సిరిసిల్ల, నిర్మల్ జిల్లాల్లో స్వయంగా సీఎం కేసీఆర్, మిగతా చోట్ల మంత్రులు శంకుస్థాపన చేయనున్నారు.
జనగామలో కడియం శ్రీహరి, వనపర్తిలో మహమూద్ అలీ, గద్వాల్‌లో లక్ష్మారెడ్డి, నాగర్ కర్నూల్‌లో జూపల్లి కృష్ణారావు, ఆసిఫాబాద్‌లో జోగు రామన్న, మంచిర్యాల, పెద్దపల్లిలో నాయిని నర్సింహారెడ్డి, మేడ్చల్‌లో శ్రీనివాసయాదవ్, రంగారెడ్డిలో పద్మారావు, వికారాబాద్‌లో మహేందర్ రెడ్డి, జగిత్యాలలో ఈటల రాజేందర్, కామారెడ్డిలో పోచారం శ్రీనివాసరెడ్డి, భూపాలపల్లిలో స్పీకర్ మధుసూదనాచారి శంకుస్థాపన చేయనున్నారు. కాగా, 12న సూర్యాపేటలో కార్యాలయ సముదాయానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. గతేడాది అక్టోబర్ 11న దసరా సందర్భంగా కొత్త జిల్లాలు ఏర్పడిన సంగతి తెలిసిందే.
20న టెక్స్‌టైల్ పార్కుకు శంకుస్థాపన
వరంగల్ జిల్లాలో కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కుకు ఈ నెల 20న శంకుస్థాపన చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment