అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఇల్లు అద్దెకు దొరకటం చాలా కష్టమైపోతోంది. ఒకవేళ దొరికినా రెంట్ ఆకాశాన్నంటేలా ఉంటుంది. అయినా అవసరమున్నవారు ఏ మాత్రం వెనుకడుగేయడం లేదు. ఇటీవల బెంగళూరులో 35 ప్లాట్లు కేవలం 48 గంటల్లో బుక్ అయిపోయాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
కరోనా తగ్గుముఖం పట్టిన తరువాత ఉద్యోగులంతా ఆఫీసుల బాట పడుతున్నారు. ఈ క్రమంలో నగరాల్లో అద్దె ఇళ్లకు డిమాండ్ భారీగా పెరిగిపోయింది. ఇటీవల బెంగళూరు సర్జాపుర ప్రాంతంలో కొత్తగా పూర్తయిన ప్రాజెక్ట్‌లో 35 అపార్ట్‌మెంట్లు అందుబాటులోకి వచ్చిన 48 గంటల్లోనే బుక్ చేసుకున్నారు. దీన్ని బట్టి చూస్తే బెంగళూరులో అద్దె ఇళ్లకున్న గిరాకీ ఇట్టే అర్థమైపోతోంది.
సర్జాపుర ప్రాంతం దక్షిణ, తూర్పు బెంగళూరులోని ఐటీ ఆఫీసులకు సమీపంలో ఉండటం వల్ల ఇంత డిమాండ్ ఉన్నట్లు స్పష్టమవుతోంది. 850 చదరపు అడుగుల నుంచి 1150 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్రాజెక్టులోని అపార్ట్‌మెంట్లు వారం రోజుల క్రితం అద్దెకు సిద్దమయ్యాయి. బుక్ చేసుకున్న వారు వచ్చే నెలలో వీటిలోకి చేరవచ్చు.
ఇదీ చదవండి: హైదరాబాద్‌లో నెలకు రూ. 40వేలు సేవ్ చేస్తున్నా.. టెకీ ట్వీట్ వైరల్
వీటి కోసం నెలకు రూ. 35,000 అద్దె చెల్లించాల్సి ఉంటుంది. గతంలో వీటిని రూ. 20 నుంచి రూ. 25వేలకు ఇవ్వాలని ఓనర్ డిసైడ్ చేసుకున్నారు, కానీ డిమాండ్ ఎక్కువగా ఉండటం వల్ల అద్దె 40 శాతం పెరిగినట్లు తెలిసింది. కేవలం సర్జాపురలో మాత్రమే కాకుండా ఎంజీ రోడ్, కోరమంగళ, వైట్‌ఫీల్డ్ మొదలైన ప్రాంతాల్లో అద్దెలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. లెవెల్లే ప్రాంతంలో సింగిల్ బెడ్ రూమ్ కోసం రూ. 75,000 చెల్లించాల్సిన పరిస్థితి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment