rented houses
-
హవ్వ.. ఇంత డిమాండా? కేవలం 48 గంటల్లో..
అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఇల్లు అద్దెకు దొరకటం చాలా కష్టమైపోతోంది. ఒకవేళ దొరికినా రెంట్ ఆకాశాన్నంటేలా ఉంటుంది. అయినా అవసరమున్నవారు ఏ మాత్రం వెనుకడుగేయడం లేదు. ఇటీవల బెంగళూరులో 35 ప్లాట్లు కేవలం 48 గంటల్లో బుక్ అయిపోయాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. కరోనా తగ్గుముఖం పట్టిన తరువాత ఉద్యోగులంతా ఆఫీసుల బాట పడుతున్నారు. ఈ క్రమంలో నగరాల్లో అద్దె ఇళ్లకు డిమాండ్ భారీగా పెరిగిపోయింది. ఇటీవల బెంగళూరు సర్జాపుర ప్రాంతంలో కొత్తగా పూర్తయిన ప్రాజెక్ట్‌లో 35 అపార్ట్మెంట్లు అందుబాటులోకి వచ్చిన 48 గంటల్లోనే బుక్ చేసుకున్నారు. దీన్ని బట్టి చూస్తే బెంగళూరులో అద్దె ఇళ్లకున్న గిరాకీ ఇట్టే అర్థమైపోతోంది. సర్జాపుర ప్రాంతం దక్షిణ, తూర్పు బెంగళూరులోని ఐటీ ఆఫీసులకు సమీపంలో ఉండటం వల్ల ఇంత డిమాండ్ ఉన్నట్లు స్పష్టమవుతోంది. 850 చదరపు అడుగుల నుంచి 1150 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్రాజెక్టులోని అపార్ట్మెంట్లు వారం రోజుల క్రితం అద్దెకు సిద్దమయ్యాయి. బుక్ చేసుకున్న వారు వచ్చే నెలలో వీటిలోకి చేరవచ్చు. ఇదీ చదవండి: హైదరాబాద్‌లో నెలకు రూ. 40వేలు సేవ్ చేస్తున్నా.. టెకీ ట్వీట్ వైరల్ వీటి కోసం నెలకు రూ. 35,000 అద్దె చెల్లించాల్సి ఉంటుంది. గతంలో వీటిని రూ. 20 నుంచి రూ. 25వేలకు ఇవ్వాలని ఓనర్ డిసైడ్ చేసుకున్నారు, కానీ డిమాండ్ ఎక్కువగా ఉండటం వల్ల అద్దె 40 శాతం పెరిగినట్లు తెలిసింది. కేవలం సర్జాపురలో మాత్రమే కాకుండా ఎంజీ రోడ్, కోరమంగళ, వైట్‌ఫీల్డ్ మొదలైన ప్రాంతాల్లో అద్దెలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. లెవెల్లే ప్రాంతంలో సింగిల్ బెడ్ రూమ్ కోసం రూ. 75,000 చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. -
ఈ రాజభవనం అద్దె ఎంతంటే......
సాక్షి, న్యూఢిల్లీ : అమెరికా కాలిఫోర్నియా రాష్ట్రంలోని ‘మాంటెసిటో మాన్షన్’ను గంటల ప్రాతిపదికన అద్దెకిస్తున్నట్లు రెంటల్ వెబ్సైట్ గిగ్స్టార్లో ఓ ప్రకటన వెలువడింది. 5.4 ఎకరాల విస్తీర్ణంలో 14,563 చదరపు అడుగుల్లో ఇటాలియన్ శైలిలో నిర్మించిన ఈ భవనాన్ని ‘ది చేత్యూ’ అని కూడా పిలుస్తారు. పాటలు, వీడియోలు, సినిమా షూటింగ్‌లతోపాటు మ్యూజియం కోసం దీన్ని అద్దెకు ఇస్తారని, గంటకు ఏడు వందల డాలర్లు (దాదాపు 51,500 రూపాయలు) చొప్పున కనీసం పది గంటలకు ఇస్తారు. లాస్ ఏంజెలిస్ నగరానికి దాదాపు రెండు గంటల ప్రయాణ దూరంలో కలిగిన ఈ భవనం ఆవరణలో ఈత కొలను, టెన్నీస్ కోర్టు, టీ హౌజ్, చిల్డ్రన్ కాటేజీలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈ భవనంలోనే ఓ గది నిండా వైన్ బాటిళ్లు ఉన్నప్పటికీ, వాటిని ఎవరూ తాకరాదు. బయటి నుంచి తీసుకొచ్చిన మద్యాన్ని కూడా ఈ భవనం లోపల తాగరాదు. చట్ట విరుద్ధ కార్యక్రమాలకు పాల్పడరాదు. ఎడల్ట్ వీడియో షూటింగ్‌లను కూడా అనుమతించరు. ఇంతకు ఈ భవనం యజమానులు ఎవరంటే బ్రిటీష్ యువరాజు ప్రిన్స్ హారీ, మేఘన్ మార్కెల్ దంపతులు. 2003లో నిర్మించిన భవనాన్ని అమెరికా వచ్చినప్పుడు ఉండేందుకు హారీ దంపతులు 14,7 మిలియన్ డాలర్లు (దాదాపు 108 కోట్ల రూపాయలు) వెచ్చించి కొనుగోలు చేశారట. -
కాంటాక్ట్ ఉందా... ఖాళీ చేయాల్సిందే!
సాక్షి, గుంటూరు: గుంటూరు నగరం నెహ్రూనగర్‌లో అద్దె ఇంట్లో ఉంటున్న ఓ యువకుడు ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. యువకుడి మామ ఇటీవల కరోనా వైరస్ బారిన పడ్డాడు. దీంతో పాజిటివ్ వ్యక్తికి ప్రైమరీ కాంటాక్ట్‌లో ఉన్న యువకుడి కుటుంబం మొత్తాన్ని వైద్యాధికారులు క్వారంటైన్‌కు తరలించారు. 14 రోజులు క్వారంటైన్లో ఉన్న అనంతరం యువకుడి కుటుంబ సభ్యులకు వైద్య పరీక్షలు నిర్వహించి కరోనా నెగిటివ్ అని నిర్ధారణ అవ్వడంతో వైద్యులు ఇంటికి పంపారు. అయితే ఇంటి యజమాని మరో 14 రోజులు ఇంట్లో ఉండటానికి వీల్లేదని తేల్చి చెప్పాడు. లేదంటే ఇళ్లు ఖాళీ చేయాలని ఒత్తిడి తెచ్చాడు. దీంతో చేసేదేమీ లేక యువకుడి కుటుంబం విజయవాడలోని తన బంధువుల ఇంటికి వెళ్లింది. విజయవాడ నుంచి రోజూ రాకపోకలు సాగిస్తూ గుంటూరులో యువకుడు విధులకు హాజరవుతున్నాడు. గుంటూరు నగరంలోని ఓ కాలనీకి చెందిన 50 ఏళ్ల వ్యక్తి గత నెలలో కరోనా వైరస్ బారిన పడ్డాడు. వైరస్‌ను జయించి ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయి ఇంటికి వచ్చాడు. అప్పటివరకూ ఆ వ్యక్తి, అతని కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా మాట్లాడే కాలనీ వాసులు, చుట్టుపక్కల వాళ్లు ఒక్కసారిగా వెలేసినట్టుగా వ్యవహరిస్తున్నారు. వారి మాటల్లో మునుపటి ఆప్యాయత కనపడటం లేదు. దీంతో ఈ వివక్షను భరించడం కన్నా ఇళ్లు ఖాళీ చేసి వేరే ప్రాంతానికి వెళ్లడం మంచిదని ఆ కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తోంది. కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేస్తోంది. పేద, ధనిక అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ వైరస్ బారిన పడుతున్నారు. అయితే వ్యాధితో పోరాడాల్సిన సమయంలో కొందరు రోగులతో పోరాటానికి దిగుతున్నారు. పాజిటివ్ రోగులు, వారి కుటుంబ సభ్యుల పట్ల వివక్ష చూపుతూ వారిని మరింత కుంగదీస్తున్నారు. ప్రభుత్వం, అధికారులు కరోనా బాధితుల పట్ల వివక్ష చూపరాదనీ, వారికి మరింత భరోసా కల్పించి ఆత్మవిశ్వాసం పెంపొందించాలని చెబుతూనే ఉన్నారు. అద్దె ఇళ్లలో ఉంటున్న బాధితుడు, కుటుంబ సభ్యులను ఇళ్లు ఖాళీ చేయాలని యజమానులు తీవ్ర వివక్ష చూపుతున్నారు. చుట్టుపక్కల వాళ్లు, కాలనీ వాసులు వెలేసినట్టుగా వ్యవహరిస్తున్నారు. దీంతో కరోనాను జయించిన వ్యక్తులు, వారి కుటుంబ సభ్యులు మనోవేదనకు గురవుతున్నారు. బయటపడకుండా... అప్పటికే తమ కాలనీలు, నివాస ప్రాంతాల్లో కరోనా పాజిటివ్ బాధితుల పట్ల కనబరుస్తున్న వివక్ష చూసి కొందరు వైరస్ లక్షణాలున్నప్పటికీ బయటపడటం లేదు. లక్షణాలున్నాయని వైద్య పరీక్ష చేయించుకున్నా, క్వారంటైన్లో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నా ఇళ్లు ఖాళీ చేయమంటారనో, చుట్టుపక్కల వాళ్లు వివక్ష చూపుతారనో కొందరు ఇంటి వైద్యానికే పరిమితం అవుతున్నట్టు తెలుస్తోంది. మెడికల్ షాపుల్లో మందులు కొని, ఇంట్లో చిట్కాలు పాటించడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కరోనా పాజిటివ్ వ్యక్తులతో సంబంధాలున్నా, వైరస్ లక్షణాలు కనిపించినా వెంటనే సమీపంలోని వైద్యాధికారులు, వలంటీర్లను సంప్రదించి కరోనా టెస్ట్ చేయించుకోవాలని సూచిస్తున్నారు. కేసులు నమోదు చేస్తాం కరోనా పాజిటివ్ బాధితులు, వారి కుటుంబ సభ్యుల పట్ల వివక్ష చూపవద్దు. ప్రొటోకాల్ ప్రకారం ప్రతి పాజిటివ్ రోగిని ఆసుపత్రికి తరలించి 14 రోజుల పాటు చికిత్స అందించి నెగిటివ్ అని నిర్ధారణ అయ్యాకే డిశ్చార్జ్ చేస్తున్నారు. వీరి కుటుంబ సభ్యులకు వైద్య పరీక్షలు నిర్వహించి పాజిటివ్ అయితే క్వారంటైన్ చేస్తున్నాం. అపోహలకు పోయి వారి పట్ల వివక్ష చూపడం మంచిది కాదు. వివక్షను ప్రదర్శించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. – ఆర్.ఎన్. అమ్మిరెడ్డి, గుంటూరు అర్బన్ జిల్లా ఎస్పీ ఒత్తిడి చేయవద్దు అద్దె ఇళ్లల్లో ఉంటున్న కరోనా పాజిటివ్ బాధితులు, వారి కుటుంబ సభ్యులను ఖాళీ చేయాలని యజమానులు ఒత్తిడి చేయవద్దు. వైరస్ పూర్తిగా నయమయ్యాకే వాళ్లు ఆసుపత్రి నుంచి ఇళ్లకు వస్తారు. అనంతరం కూడా హోం ఐసోలేషన్‌లో ఉంటారు. కరోనా వచ్చిందనే కారణంతో ఇళ్లు ఖాళీ చేయాలని ఒత్తిడి చేస్తే చర్యలు తీసుకుంటాం. – విశాల్ గున్నీ, గుంటూరు రూరల్ జిల్లా ఎస్పీ -
కరోనా కారణంగా కుదేలైన అద్దె రంగం
-
అద్దె భవనాల్లో అంగన్వాడీ కేంద్రాలు
గంభీరావుపేట(సిరిసిల్ల) : స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సమగ్ర శిశు అభివృద్ధి పథకం(ఐసీడీఎస్)ద్వారా అంగన్వాడీ కేంద్రాల నిర్వహణకు ఏటా ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు ఖర్చు చే స్తున్నా.. అద్దె భవనాలు, ఇరుకు గదుల్లోనే టీచర్లు, చిన్నారులు, లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. నిధుల కొరత కారణంగా పలు అంగన్వాడీ కేంద్రాల నిర్మాణ పనులు అసంపూర్తిగానే ఉ ంటున్నాయి. వాటిని పూర్తి చేయడంపై అధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టిసారించడం లేదు. 54 అంగన్వాడీ కేంద్రాలు.. ఒక్కరే సూపర్వైజర్ గంభీరావుపేట మండలంలో 53 అంగన్వాడీ కేంద్రాలు, ఒక మినీ అంగన్వాడీ కేంద్రం ఉంది. గంభీరావుపేట, లింగన్నపేట సెక్టార్ల పరి«ధిలో ఈ కేంద్రాలు ఉన్నాయి. ఆయా కేంద్రాలను ఒక్కరే సూపర్వైజర్ పర్యవేక్షిస్తున్నారు. అద్దె ఇళ్లలో 13 కేంద్రాలు మండలంలోని 15 అంగన్వాడీ కేంద్రాలకు మాత్రమే సొంత భవనాలు ఉన్నాయి. 13 కేంద్రాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. అదే విధంగా అద్దె లేకుండా వివిధ పాఠశాల భవనాల్లో 26 అంగన్వాడీ కేంద్రాలు కొనసాగుతున్నాయి. అసంపూర్తిగా ఏడు భవనాలు.. మండలంలోని కొత్తపల్లి, గజసింగవరం, ముస్తఫానగర్, సముద్రలింగాపూర్, దమ్మన్నపేట, నర్మాల క్యాంపు, గోరింటాల గ్రామాల్లో పక్కా భవనాలు అసంపూర్తిగా ఉన్నాయి. వాటి నిర్మాణాలు పూర్తి చేయడానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని పలువురు కోరుతున్నారు. అలాగే, అద్దె భవనాల్లో కొనసాగుతున్న వాటన్నింటికీ పక్కా భవనాలు మంజూరు చేయాలని చిన్నారుల తల్లిదండ్రులు, లబ్ధిదారులు కోరుతున్నారు. కాగా, అద్దె రూపంలో నెలనెలా లక్షలాది రూపాయలు చెల్లిస్తున్న ఐసీడీఎస్ అధికారులు సొంత భవనాల నిర్మాణాలను పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. తప్పని ఇబ్బందులు ఇరుకు గదుల్లో, అద్దె భవనాల్లో పిల్లల ఆటవస్తువులు, వంట సామగ్రి, బియ్యం అన్నీ ఒకే చోట ఉంచలేక నిర్వహకులు ఇబ్బందులు పడుతున్నారు. చిన్నారులు, కిశోరబాలికలు, గర్భిణులు, బాలింతలకు ప్రభుత్వం కొత్త పథకాలను ప్రవేశపెట్టి వాటి అమలును ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలకు అప్పగించింది. పథకాలు అమలు చేయడానికి పక్కా భవనాలు లేకు, అద్దె భవనాల్లో సౌకర్యాలు లేక అంగన్వాడీ టీచర్లు తీవక్ర ఇబ్బందులు పడుతున్నారు. తక్కువ అద్దె కారణంగా.. ప్రభుత్వం ఒక్కో కేంద్రానికి రూ.750 చొప్పున అద్దె చెల్లిస్తోంది. గత మార్చి వరకు అద్దె నిధులను విడుదల చేసింది. ఏప్రిల్ నుంచి బిల్లులు రావాల్సి ఉంది. తక్కువ అద్దెతో సౌకర్యవంతమైన గదులు కూడా దొరకడం లేదని, అద్దె ఇళ్లు సక్రమంగా దొరకడం లేదని టీచర్లు వాపోతున్నారు. ఏప్రిల్ నుంచి అద్దెను రూ.వెయ్యికి పెంచే అవకాశం ఉన్నట్లు ఐసీడీఎస్ అధికారులు భావిస్తున్నారు. అద్దె రూపంలో ఏటా గంభీరావుపేట మండలంలో రూ.1.17 లక్షల చొప్పున నిధులు ఖర్చు అ వుతున్నాయి. నిధులు నీళ్లలా ఖర్చు చేస్తున్నారు త ప్ప పక్కా భవనాల విషయాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. -
వసతి చూపవా గోవిందా..
సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులకు అద్దెగదుల కోసం తిప్పలు తప్పడంలేదు. గదులు కేటాయింపునకు సంబంధించిన వ్యవస్థ సక్రమంగా పనిచేయకపోవటం వల్లే ఇబ్బందులు ఎదురవుతున్నాయని భక్తులు అభిప్రాయపడుతున్నారు. సాంకేతిక సమస్యలే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఏడుకొండలవాని దర్శనానికి వివిధ రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు వస్తుంటారు. వచ్చే ప్రతి భక్తుడు తిరుమలలో ఓ రాత్రి నిద్రిస్తే అంతా మంచే జరుగుతుందని నమ్ముతాడు. గదుల కోసం భక్తులు ముందుగా తిరుమలలో సీఆర్వో కార్యాలయానికి చేరుకుంటారు. భక్తుల సౌకర్యార్థం ఇక్కడ జనరల్ కౌంటర్లు, దేవదాయశాఖ కౌంటర్, వీఐపీ, వీవీఐపీ, బోర్డు మెంబర్ల కోసం విడివిడిగా కౌంటర్లు ఏర్పాటు చేశారు. గదులు అవసరమైన వారు కౌంటర్ వద్ద పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో గదులు ఖాళీ అవుతుంటే... వరుస క్రమంలో ఉన్న భక్తుల మొబైల్ ఫోన్లకు మెసేజ్‌లు వస్తుంటాయి. ఆ సమాచారం తెలుసుకుని భక్తులు సీఆర్వో కార్యాలయానికి వెళ్లి గది తాళాలు తీసుకుంటారు. గతంలో అయితే గదులు ఖాళీ అవుతుంటే క్యూలో ఉండేవారికి కేటాయించేవారు. ఇలా గంటల తరబడి భక్తులు క్యూలో నిల్చొని ఇబ్బంది పడకుండా ఉండేందుకు రిజిస్ట్రేషన్ పద్ధతిని అమల్లోకి తీసుకొచ్చారు. మెసేజ్ రాకపోతే గది లేనట్టే.. తిరుమలలో గదుల రిజిస్ట్రేషన్ కోసం టీటీడీ 10 కౌంటర్లు ఏర్పాటు చేసింది. అందులో సిబ్బంది వారాంతపు సెలవులు, అత్యవసర సెలవులు, ఇతరత్రా కారణాలతో రోజుకి ఆరేడు కౌంటర్లు మాత్రమే పనిచేస్తుంటాయి. ఈ కౌంటర్ల వద్ద క్యూలో 200 మంది లోపు మాత్రమే నిలబడే అవకాశం ఉంది. ఒకసారి క్యూలోకి చేరుకున్న భక్తులు సుమారు ఒకటిన్నర గంట సమయం బయటే నిలబడి ఉండాలి. క్యూలో ఉన్న వారి కంటే బయట వేచి ఉన్న వారి సంఖ్యే అధికంగా ఉంటోంది. మొదట్లో టీటీడీ నిర్ధేశించిన ప్రకారం భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకుని బయటకు వచ్చేస్తే... గది ఖాళీ అయినప్పుడు భక్తుడు రిజిష్టర్ చేసుకున్న మొబైల్ నెంబర్‌కు మెసేజ్ వస్తుంది. సమాచారం అందిన అరగంటలో వెళ్లి గది తీసుకోవాలి. కానీ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిలో కొందరికి గది కేటాయించినా ఎటువంటి మెసేజ్ రావడంలేదు. దీంతో సీఆర్వో కార్యాలయం వద్ద డిస్ప్లే బోర్డు చూస్తూ గంటల తరబడి నిలబడుతున్నారు. మరి కొందరు.. గది కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ‘2 లేదా 3’ గంటల తరువాత కేటాయించవచ్చు అని ఉజ్జాయింపుగా రశీదుపై సమయాన్ని ముద్రించి ఇస్తారు. దీంతో భక్తులు ఇంకా సమయం ఉందని తిరుమలలోని దర్శనీయ స్థలాలు చూసి వచ్చేందుకు వెళ్తుంటారు. ఒక్కో సారి రిజిస్ట్రేషన్ అయిన అరగంటలోనే గది కేటాయిస్తుంటారు. ఆ సమాచారం భక్తులకు వెళ్లడం లేదు. గది అలాట్ అయిన అరగంటలో తీసుకోకపోతే ఆటోమేటిక్‌గా అది రద్దయిపోతుంది. మొబైల్‌కి సమాచారం రాలేదని భక్తులు తిరుమల అంతా చుట్టి సీఆర్వో కార్యాలయానికి చేరుకునే సరికి.. గది అలాట్ అయ్యిందని, అరగంటలో తీసుకోకపోవటంతో రద్దయిందని చెబుతుండటంతో భక్తులు షాక్‌కు గురవుతున్నారు. పర్యవేక్షణ లోపమే.. అనిల్‌కుమార్ సింఘాల్ ఈవోగా వచ్చిన తరువాత రిజిస్ట్రేషన్ పద్ధతి అమల్లోకి తీసుకొచ్చారు. అయితే ఈ విధానంలో లోపాలను సరిదిద్దేవారు కరువయ్యారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. భక్తులకు కేటాయించిన గదుల వివరాలపై వారికి ఎస్ఎంఎస్లు వెళ్లడం లేదని సంబంధిత అధికారులకు తెలియటం లేదని సమాచారం. కౌంటర్లు చాలక ఇబ్బంది పడుతున్న సమాచారమూ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడం లేదు. అదే విధంగా కౌంటర్లలో పనిచేస్తున్న అధికారులకు సుమారు ఏడేళ్లుగా బదిలీలు లేకపోవటంతో వారు గదుల కేటాయింపు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. -
తహసీల్దారు కార్యాలయాలకు భవనాలు
సీసీఎల్ఏకు ప్రభుత్వం ఆదేశం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా అద్దె భవనాల్లో నడుస్తున్న మండల తహసీల్దారు, ఆర్డీవో కార్యాలయాలకు పక్కా భవనాల నిర్మా ణం, సొంత భవనాల్లో ఉన్న కార్యాలయాల్లో ఆధునీకరణ పనులకు సర్కారు అంగీకారం తెలిపింది. కొత్త భవనాల నిర్మాణం, మరమ్మతుల కోసం ఇప్పటికే మంజూరు చేసిన రూ.10 కోట్లను వెంటనే అవసరమైన ప్రాంతాలకు కేటాయించాలని భూపరిపాలన విభాగం ముఖ్య కమిషనర్ (సీసీఎల్ఏ)ను సర్కారు ఆదేశించింది. ఇటీవల రెవెన్యూ ఉద్యోగుల సంఘాలు, తహసీల్దార్ల సంఘాలు చేసిన ఆందోళన సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సీసీఎల్ఏకు ప్రభుత్వం సూచిం చింది. అదనపు బడ్జెట్ అవసరమైనపక్షంలో తగిన ప్రతిపాదనలను పంపాలని సీసీఎల్ఏకు సర్కారు తాజాగా మెమో జారీచేసింది. సీసీఎల్ఏకు సర్కారు ఆదేశాలు ఇవీ.. - అద్దె వాహనాలు వినియోగించే మండల తహసీల్దార్లు, ఆర్డీవోలకు అదనపు బడ్జెట్ అవసరమైతే ప్రతిపాదనలు పంపాలి. - పనిభారం మేరకు తహసీల్దార్ కార్యాలయాలను విభజించే అంశాన్ని పరిశీలించాలి. విద్యుత్ బిల్లులు చెల్లించని కార్యాలయాలకు వెంటనే సరఫరా పునరుద్ధరణ చర్యలు చేపట్టాలి. నిధుల ప్రతిపాదనలు పంపాలి. - ఆహార భద్రత కార్డుల జారీ సమయంలో తహసీల్దార్లు చేసిన ఖర్చును పౌరసరఫరాల విభాగం ఇవ్వనందున, కార్డుకు రూ.10 చొప్పున తహసీల్దార్లకు వెంటనే చెల్లించాలి. - కోర్టు కేసుల్లో రెవెన్యూ ఉద్యోగులకు న్యాయ సలహాలను పొందేందుకు ప్రతి జిల్లాకు ఒక న్యాయవాదిని నియమించుకోవాలి. - డీటీలుగా పదోన్నతులు పొందేందుకు అర్హులైన తహసీల్దార్ల జాబితాను పంపాలి. కలెక్టరేట్లో ఉండే అదనపు జేసీల పని పంపిణీ ప్రతిపాదనలను పంపాలి. - ‘ఈ-ధాత్రి’పై ఉద్యోగులకు శిక్షణ ఇవ్వాలి. - జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల్లోని సూపరింటెండెంట్ పోస్టులను తహసీల్దారు కేడర్‌కు, ఏవో పోస్టును డిప్యూటీ కలెక్టర్ కేడర్‌కు అప్‌గ్రేడ్ చేసే అంశాన్ని సర్కారు పరిగణనలోకి తీసుకుంది.