సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో గిడ్డంగుల స్థలాలకు డిమాండ్ పెరుగుతుంది. 2023 ఆర్ధిక సంవత్సరంలో నగరంలో 51 లక్షల చ.అ. వేర్‌హౌస్ స్పేస్ లావాదేవీలు జరిగాయి. అయితే 2022 ఆర్ధిక సంవత్సరంలోని 54 లక్షల చ.అ. లావాదేవీలతో పోలిస్తే ఇది 7 శాతం తక్కువని నైట్‌ఫ్రాంక్ ఇండియా నివేదిక వెల్లడించింది. థర్డ్ పార్టీ లాజిస్టిక్స్ (3 పీఎల్), ఈ–కామర్స్ సంస్థల లావాదేవీలలో తాత్కాలిక మందగమనమే ఈ క్షీణతకు ప్రధాన కారణమని పేర్కొంది. ఆన్‌లైన్ షాపింగ్‌కు పెరుగుతున్న ఆదరణ, లాస్ట్‌మైల్ డెలివరీ ఆవశ్యకత నేపథ్యంలో గిడ్డంగుల విభాగానికి దీర్ఘకాలిక డిమాండ్ ఉంటుందని తెలిపింది.
- వేర్‌హౌస్ లావాదేవీలలో తయారీ రంగం హవా కొనసాగుతుంది. 2023 ఫైనాన్షియల్ ఇయర్‌లో జరిగిన గిడ్డంగుల లీజుల మాన్యుఫాక్చరింగ్ విభాగం వాటా 39 శాతం కాగా.. 3 పీఎల్ 21 శాతం, ఈ–కామర్స్ 17 శాతం, రిటైల్ రంగం 14 శాతం, ఎఫ్‌ఎంసీజీ 5 శాతం, ఎఫ్‌ఎంసీడీ 1 శాతం వాటాలను కలిగి ఉన్నాయి.
- మేడ్చల్ క్లస్టర్‌లో వేర్‌హౌస్‌కు డిమాండ్ ఎక్కువగా ఉంది. 2022 ఆర్ధిక సంవత్సరంలోని గిడ్డంగుల లావాదేవీలలో ఈ క్లస్టర్ వాటా 60 శాతం ఉండగా.. 2023 నాటికి 61 శాతానికి పెరిగింది. శంషాబాద్ క్లస్టర్‌లో క్షీణత, పటాన్‌చెరు క్లస్టర్లలో స్వల్ప వృద్ధి కనిపించింది. ఏడాది సమయంలో శంషాబాద్ వాటా 30 శాతం నుంచి 27 శాతానికి తగ్గగా.. పటాన్‌చెరు క్లస్టర్ వాటా 10 శాతం నుంచి 11 శాతానికి పెరిగింది.
- హైదరాబాద్ అనేక రంగాలు ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్‌ఐ) స్కీమ్ కింద అనుమతులు పొందాయి. ప్రధానంగా సెల్‌ఫోన్ల తయారీ, ఆటో అనుబంధ రంగానికి చెందిన సంస్థలు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకోవటంతో గిడ్డంగుల స్థలాలకు డిమాండ్ ఏర్పడిందని నైట్‌ఫ్రాంక్ ఇండియా సీఎండీ శిశిర్ బైజల్ అన్నారు.
నగరంలోని ప్రధాన గిడ్డంగుల క్లస్టర్లు ఇవే
మేడ్చల్ క్లస్టర్‌లో మేడ్చల్, దేవరయాంజాల్–గుండ్లపోచంపల్లి, కండ్లకోయ, యెల్లంపేట్, షామీర్‌పేట్, పటాన్‌చెరు ఇండస్ట్రియల్ ఏరియా, రుద్రారం, పాశమైలారం, ఎదులనాగులపల్లి, సుల్తాన్‌పూర్, ఏరోట్రోపోలిస్, శ్రీశైలం హైవే, బొంగ్లూరు, కొత్తూరు, షాద్‌నగర్. ఆయా ప్రాంతాలలో గ్రేడ్–ఏ గిడ్డంగుల అద్దె చ.అ.కు రూ.19–21గా, గ్రేడ్–బీ అయితే రూ.16–19గా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment