ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో రెండు రోజుల క్రితం కిడ్నాప్ అయిన విద్యార్థిని ఉదంతంలో అసలు నిజం వెలుగు చూసింది. నిజానికి ఆ యువతి కిడ్నాప్‌కు గురి కాలేదని తేలింది. ఆమె డబ్బుల కోసం స్వయంగా ఫేక్ కిడ్నాప్ డ్రామా ఆడిందని వెల్లడయ్యింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం విద్యార్థి హన్సికా వర్మ ఇంజినీరింగ్ ఎంట్రన్ పాసయ్యింది. అడ్మిషన్ కోసం ఆమె రూర్కీలోని ఇంజినీరింగ్ కాలేజీకి వెళ్లాల్సి ఉంది. ఇంతలోనే ఆమె ఇంటి నుంచి మాయమయ్యింది.
రూ. 10 లక్షలు డిమాండ్
తరువాత ఆమె తండ్రి మొబైల్ ఫోనుకు ఒక వాట్సాప్ వీడియో మెసేజ్ వచ్చింది. దానిలో హన్సిక తాళ్లతో బందీగా కనిపిస్తోంది. ఈ వీడియోను పంపిన ఆగంతకులు హన్సిక తండ్రిని రూ. 10 లక్షలు డిమాండ్ చేశారు. అయితే హన్నిక తండ్రి ఈ విషయాన్ని వెంటనే పోలీసులకు తెలియజేశారు. తక్షణం పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు. అయితే ఈ కిడ్నాప్ డ్రామా వెనుక అసలు సంగతి వెల్లడి కావడంతో అంతా ఆశ్చర్యపోయారు.
హన్సిక తన ప్రియుడిని రహస్యంగా ప్రేమ వివాహం చేసుకునేందుకే ఈ డ్రామా ఆడిందని పోలీసుల దర్యాప్తుల్లో వెల్లడయ్యింది. ఆమె దగ్గర డబ్బులు లేకపోవడంతో ఆ ప్రేమ జంట ఫేక్ కిడ్నాపింగ్‌కు ప్లాన్ చేశారు. దాని ప్రకారమే హన్నిక ఒక బెదిరింపు వీడియోను తండ్రికి పంపించి, డబ్బులు డిమాండ్ చేసింది.
పెళ్లికి దారితీసిన ఇన్‌స్టాగ్రామ్ ప్రేమ
కాన్పూర్ జాయింట్ పొలీస్ కమిషనర్ ఆనంద్ ప్రకాష్ తివారీ ఆధ్వర్యంలో హన్సికను ఆమె ప్రియుడు రాజ్ సింగ్‌ను అరెస్టు చేశారు. వారి నుంచి వారికి సంబంధించిన మ్యారేజ్ సర్టిఫికెట్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హన్నిక, రాజ్‌లు మే 22న వివాహం చేసుకుని, దానిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని వెల్లడయ్యింది. ఈ ఉదంతంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో వారిద్దరికీ పరిచయం అయ్యిందని, అది ప్రేమకు,తరువాత పెళ్లికి దారితీసిందని పోలీసులు తెలిపారు. అయితే ప్రస్తుతం పోలీసులు ఆ సర్టిఫికెట్ నిజమైనదో కాదో తేల్చేపనిలో ఉన్నారు.
ఇది కూడా చదవండి: ఆ భారీ షాపింగ్ మాల్‌లో కనిపించని క్యాషియర్.. మరి పేమెంట్ ఎలాగంటే..
Comments
Please login to add a commentAdd a comment