సాక్షి, హైదరాబాద్: చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్‌కు సంబంధించిన బిల్లు ఆమోదం విషయంలో కేంద్ర ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. సోమవారం రాత్రి తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడాన్ని స్వాగతించారు. బిల్లులో పేర్కొన్న అంశాలపై స్పష్టత ఇవ్వాలని, ఆమోదంలో ఎలాంటి అడ్డంకులు తలెత్తకుండా చూడాలన్నారు.
మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించాల్సిందిగా ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి కేసీఆర్ మూడు రోజుల క్రితం లేఖ రాసిన విషయాన్ని కవిత గుర్తు చేశారు. ఇదే తరహాలో చట్టసభల్లో ఓబీసీలకు రిజర్వేషన్ బిల్లును కూడా ప్రవేశ పెడితే తాము మద్దతు ఇస్తామని కవిత ప్రకటించారు. కాగా మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్ర కేబినెట్ ఆమోదించిన నేపథ్యంలో సోమ, మంగళవారాల్లో హైదరాబాద్‌లోని ఎమ్మెల్సీ కవిత నివా సం వద్ద సంబురాలు జరి గాయి. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు పలకాల్సిందిగా కోరు తూ ఇటీవల 40కి పైగా రాజకీయ పార్టీల నేతలకు ఎమ్మెల్సీ కవిత లేఖలు రాసిన విషయా న్ని ప్రస్తావిస్తూ మిఠాయిలు పంచారు.
Comments
Please login to add a commentAdd a comment