13 నుంచి ఈ– ఫైల్స్
13 నుంచి ఈ– ఫైల్స్
Published Mon, Oct 3 2016 11:20 PM | Last Updated on Mon, Sep 4 2017 4:02 PM
– డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమంలో జేసీ
కర్నూలు సిటీ: ఈ నెల 13వ తేదీ నుంచి అన్ని శాఖలకు చెందిన అధికారులు ఈ – ఫైల్స్ (పేపరు రహిత ఫైల్స్)ను పంపించాలని జాయింట్ కలెక్టర్ సి.హరికిరణ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ సమావేశ మందిరంలో నిర్వహించిన డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమంలో జేసీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వినతులను పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమంకు వచ్చిన సమస్యల్లో అత్యధికంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, రోడ్లు, భవనాలు, జెడ్పీ, డీపీఓ, జల వనరుల శాఖ, ఎకై ్సజ్ శాఖల్లో అధికంగా ఉన్నాయన్నారు. కార్యక్రమంలో జేసీ–2 రామస్వామి, డీఆర్‌ఓ గంగాధర్‌గౌడు, ఆయా శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.
– ఓర్వకల్లు సమీపంలో జాతీయ రహదారి విస్తరణలో తమ భూమి పోయిందని, ఇంత వరకు పరిహారం రాలేదని ఓ రైతు ఫిర్యాదు చేశారు.
– వెల్దురి మండలం శ్రీరంగాపురం, చిన్న కొముల పల్లె గ్రామంలో గొర్రెల పెంపకదారులు అధికంగా ఉన్నారని, పశువైద్యశాల ఏర్పాటు చేయాలని స్థానికులు ఫిర్యాదు చేశారు.
– మద్దికెరలో 554 సర్వే సెంబరులో 17 ఎకరాల భూమిని మా తండ్రి కొనుగోలు చేస్తే, స్థానిక వీఆర్‌ఓ తన తమ్ముని పేరు మీద 33 సెంట్ల భూమి రాయించి పట్టాదారు పాస్ పుస్తకం తీసుకున్నారని ఓ రైతు జేసీకి ఫిర్యాదు చేశారు. జేసీ స్పందించి ఆదోని ఆర్డీఓను విచారించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Advertisement
Advertisement