సూర్యాపేటటౌన్ : సూర్యాపేట పట్టణంలోని ఇందిరానగర్‌లోని ప్రభుత్వ భూమిలో కొంత మంది వ్యక్తులు నిర్మించుకున్న ఇళ్లను జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ గురువారం పరిశీలించారు. ఇళ్లు నిర్మించుకున్న వారు జీఓ నంబర్ 58, 59 ప్రకారం అసైన్‌మెంట్ పట్టాలు అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఇటీవల తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తులు చేసుకున్నారు. ఈ విషయమై జాయింట్ కలెక్టర్ స్వయంగా పరిశీలించి మాట్లాడుతూ 125 గజాలలో 2014 జూన్ 2 నాటికి ఇంటి నిర్మాణం చేసుకున్న వారికి ఉచితంగా పట్టాలు ఇచ్చే విధంగా చర్యలు చేపడతామని తెలిపారు. ఆయన వెంట ఆర్డీఓ శ్రీనివాస్‌రెడ్డి, తహసీల్దార్ వెంకటేశంతో పాటు ఐబీ అధికారులు పాల్గొన్నారు.
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి
కట్టంగూర్ అంగన్‌వాడీ సిబ్బంది విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ సూచించారు. గురువారం కట్టంగూర్‌లో అంగన్‌వాడీ కేంద్రం-3ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులను, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి మాట్లాడారు. సరుకుల నాణ్యతను పరిశీలించిన అనంతరం వంటలు చేసి విద్యార్థులకు అందించాలన్నారు. ఆయన వెంట తహసీల్దార్ ప్రమీల, ఆర్‌ఐ పద్మ, వీఆర్‌ఓ వహీద్ తదితరులు ఉన్నారు.
ఇళ్ల నిర్మాణాలను పరిశీలించిన జేసీ
Published Fri, Mar 20 2015 4:18 AM | Last Updated on Sat, Sep 2 2017 11:06 PM
Advertisement