మాట్లాడుతున్న జేసీ దేవరాజన్ దివ్య
ఖమ్మం జెడ్పీసెంటర్: నిత్యావసర వస్తువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక చెక్‌పోస్టులను ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ దేవరాజన్ దివ్య తెలిపారు. పౌరసరఫరాలు, పోలీసు, ఎక్సైజ్, వాణిజ్యపన్నులు, మార్కెటింగ్, రవాణాశాఖ అధికారులతో ఈ చెక్‌పోస్టుల ఏర్పాటుపై కలెక్టరేట్‌లోని ప్రజా ్ఞసమావేశ మందిరంలో మంగళవారం ^è ర్చించారు. అన్ని శాఖలను సమన్వయపరిచి జిల్లా, రాష్ట్ర సరిహద్దుల్లో ఈ చెక్‌పోస్టులను ఏర్పాటు చేస్తామన్నారు. అక్రమ రవాణాను అరికట్టేందుకు పౌరసరఫరాలతో పాటు ఎక్సైజ్, వాణిజ్యపన్నులు, మోటారు వాహనాల తనిఖీ, అటవీశాఖ, గనులశాఖ అధికారులందరూ ఒకే చెక్ పోస్టులో ఉండే విధంగా చర్యలు చేపడతామన్నారు. ఆయా శాఖలు ఇప్పటి వరకు నిర్వహిస్తున్న చెక్‌పోస్టుల వివరాలను జేసీ తెలుసుకున్నారు. సమావేశంలో ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ మహేష్‌బాబు, అడిషనల్ ఎస్పీ సాయిక్రిష్ణ, డీఎస్పీ సురేష్, మార్కెటింగ్ ఏడీ వినోద్, ఏఎస్‌ఓ లక్ష్మణ్, వాణిజ్య పన్నుల అధికారి వెంకటేశ్వర్లు, గనుల శాఖ ఏడీ కె. నర్సింహారెడ్డి, మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్ ఎం.వి. శ్రీనివాసరావు, ఎక్సైజ్, పోలీసు అధికారులు పాల్గొన్నారు.