ధాన్యానికి మద్దతు ధర చెల్లించాలి
Published Wed, Oct 26 2016 10:19 PM | Last Updated on Mon, Sep 4 2017 6:23 PM
–జేసీ కోటేశ్వరరావు
ఏలూరు (మెట్రో): రాబోయే ఖరీఫ్ సీజనులో మద్దతు ధర ప్రకారం ధాన్యం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని జాయింట్ కలెక్టర్ పి.కోటేశ్వరరావు జిల్లా రైస్‌మిల్లర్లను కోరారు. కలెక్టరేట్‌లో జిల్లా రైస్‌మిల్లర్స్ అసోసియేషన్, సివిల్ సప్లయీస్ అధికారులతో ఆయన సమీక్షించారు. జిల్లాలో వచ్చేనెల 1 నుంచి రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేసేందుకు వెలుగు విభాగం ద్వారా 160 ఐకేపీ, సహకార సొసైటీల ద్వారా 100 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయాలని సివిల్ సప్లయీస్ అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం రా రైస్ 67 శాతం, బాయిల్డ్ రైస్ 68 శాతం సరఫరా అవుతుందని, బ్రాస్ రైస్, బ్రొకెన్ రైస్ ఎంత శాతం నమోదైందన్న వివరాలు కూడా ఆన్‌లైన్‌లో పొందుపర్చాలని సూచించారు. మిల్లర్లు కొన్న ధాన్యానికి తప్పనిసరిగా లెక్కలుండాలని, పారదర్శకంగా మిల్లర్లు పనిచేయాలని, రైతులకు ధాన్యం ధరను బ్యాంకు ఖాతాల ద్వారా చెల్లిస్తామని చెప్పారు. సివిల్ సప్లయీస్ అధికారి డి.శివశంకర్‌రెడ్డి, సివిల్ సప్లయిస్ అసిస్టెంట్ మేనేజర్ టెక్నికల్ వెంగప్ప, అసిస్టెంట్ మేనేజర్ జనరల్ షర్మిల, రైస్‌మిల్లర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎన్‌బీఎస్‌వీ ప్రసాద్, సెక్రటరీ ఎన్‌బీకే ప్రసాదరావు, వైస్ ప్రెసిడెంట్ కె.హరిబాబు, జాయింట్ సెక్రటరీ బాబి, ట్రెజరర్ చక్కా సత్యనారాయణ పాల్గొన్నారు.
Advertisement