
మద్దతు ధర ప్రకటించని కూటమి ప్రభుత్వం
ఉత్పత్తులను కొనుగోలు చేయని వైనం
బహిరంగ మార్కెట్‌లో లభించని గిట్టుబాటు ధర
క్వింటాకు 10 కిలోల చొప్పున దోచుకొంటున్న వ్యాపారులు
నల్లమాడ: ఉలవ రైతు నిలువు దోపిడీకి గురవుతున్నాడు. ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహిస్తున్నామంటూనే ఆ పంట దిగుబడులను కూటమి ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో రైతులు సంకట స్థితిని ఎదుర్కొంటున్నారు. గతేడాది రబీలో ప్రత్యామ్నాయ పంటగా రైతులు ఉలవ పంట సాగుచేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో పంట నూరి్పడి చేసి దిగుబడిని అమ్మేందుకు రైతులు సిద్ధమయ్యారు. అయితే కూటమి ప్రభుత్వం ఉలవకు మద్దతు ప్రకటించకపోగా కొనుగోలు సైతం చేయకపోవడంతో రైతులు బహిరంగ మార్కెట్‌లో దళారులను ఆశ్రయించి మోసపోవాల్సిన దుస్థితి నెలకొంది.
పెరిగిన సాగు విస్తీర్ణం
ప్రధాన వేరుశనగ పంట వల్ల పెద్దగా లాభం లేకపోగా పంట సాగు ఖర్చు తక్కువగా ఉండటం, కలుపు తీయడం, మందులు పిచికారీ చేసే అవసరం లేకపోవడంతో ఉలవ పంట సాగుపై రైతులు దృష్టి సారించారు. సబ్సిడీపై విత్తనం కూడా సరఫరా చేయడంతో గతంలో కంటే రబీ సీజన్‌లో ఉలవ సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగినట్లు తెలుస్తోంది. పుట్టపర్తి నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో దాదాపు 13,606 ఎకరాల్లో రైతులు ఉలవ పంట సాగు చేసినట్లు అధికారుల అంచనా.
ఉలవను కొనుగోలు చేయని ప్రభుత్వం
రైతు సంక్షేమ తమ ధ్యేయమంటూ బాకా ఊదుతున్న కూటమి ప్రభుత్వం ఇప్పటివరకు ఉలవకు మద్దతు ధర ప్రకటించకపోగా కొనుగోలు ప్రయత్నం కూడా చేయలేదు. ఉలవ పంట నమోదు (ఈ క్రాప్ బుకింగ్) చేసినా ఎలాంటి ప్రయోజనం లేదని రైతన్నలు నిట్టూరుస్తున్నారు. దీంతో గిట్టుబాటు ధర కోసం రైతులు ఉలవలను సంచుల్లో పోసి ఇళ్లలో నిల్వ చేయడం ప్రతి గ్రామంలోనూ కన్పిస్తోంది. నెలల తరబడి ఉలవలు అలాగే నిల్వ ఉంచితే పురుగులు పడి పాడైపోతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.
బహిరంగ మార్కెట్‌లో నిలువుదోపిడీ
ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో క్వింటా ఉలవలు రూ.3,500 నుంచి రూ.3,700 వరకు ధర పలుకుతోంది. అయితే నాణ్యత లోపించిందని, తేమ శాతం ఎక్కువగా ఉందని సాకులు చూపిపారులు ఒక క్వింటాకు ఎనిమిది నుంచి 10 కిలోల ఉలవలను అదనంగా తీసుకుంపలువురు రైతులు వాపోతున్నారు. ఉలవ పంట సాగుకు ఒక ఎకరాకు రూ.10 వేలు పెట్టుబడి పెట్టారు. ఎకరాకు మూడు క్వింటాళ్లు దిగుబడి రావడంతో బహిరంగ మార్కెట్‌లో విక్రయిస్తే తమకు మిగిలేదేమీ ఉండదని రైతన్నట్లు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించి ఉంటే క్వింటా రూ.4 వేలకుపైగా ధర లభించేదని చెబుతున్నారు.
ఉలవలు కొనుగోలు చేయాలి
ఉలవకు మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో బహిరంగ మార్కెట్‌లో వ్యాపారులు అడిగిన ధరకు ఉలవలు అమ్ముకోవాల్సిన దుస్థితి వచ్చింది. ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహిస్తున్నామంటూ వాటి దిగుబడులను ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడం బాధాకరం. అన్ని విధాలుగా రైతుకు నష్టమే జరుగుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఉలవకు మద్దతు ధర ప్రకటించి కొనుగోలు చేయాలి. – ఎం. నరసింహులు, రైతు, దొన్నికోట, నల్లమాడ మండలం
పంటను గొర్రెలకు వదిలేశా
నేను ఐదెకరాల్లో ఉలవ పంట సాగుచేశా. ట్రాక్టర్‌తో సేద్యం, క్వింటా విత్తన ఉలవలకు రూ.10 వేలకు పైగా ఖర్చు వచ్చింది. పంట నూరి్పడికి వచ్చే సమయానికి మార్కెట్‌లో క్వింటా ఉలవ ధర రూ.3,500 పలుకుతోంది. నూరి్పడి ఖర్చులు అన్నీ కలిపితే ఏం గిట్టుబాటు కాదని భావించి పంటను గొర్రెలకు వదిలేశా. ప్రభుత్వం స్పందించి ఉలవ రైతులను ఆదుకోవాలి. –దేవళానాయక్, రైతు, గోపేపల్లి తండా, నల్లమాడ మండలం
Comments
Please login to add a commentAdd a comment