reasonable price
-
పట్టి పీడిస్తున్న దిగుబడి భూతం
దిగుబడి గురించి గొప్పలు చెప్పుకోవడం ప్రభుత్వాలకు అలవాటుగా మారింది. దిగుబడి, ఉత్పత్తి, ఉత్పాదకత మధ్య ఉన్న వివిధ కోణాలను అధికార గణం విస్మరిస్తున్నారు. దిగుబడి పెంపుదల నినాదంగా పెట్టుకుని, దేశీయ రైతుల జ్ఞానాన్నీ, శ్రమనూ కించపరుస్తున్నారు. ఈ దిగుబడి జాడ్యం విదే శాల నుంచి, ప్రత్యేకంగా అమెరికా నుంచి చుట్టుకున్నది. ఇప్పుడు ఆకలి తీర్చడం లక్ష్యం కాదు. ఆదాయం పెరగాలంటే దిగుబడులు పెంచాలంటు న్నారు. కానీ అనేక సమస్యల మధ్య దిగుబడులు ఎక్కువ అయినా ప్రతి సందర్భంలో రైతుకు గిట్టుబాటు ధర రాకపోవడం ప్రత్యక్షంగా చూస్తున్నాం. విత్తనాలు ఎరువులు అమ్మేవారు అధిక దిగుబడుల ఆశను రైతులలో కల్పిస్తూ, తమ లాభాలను మాత్రం పెంచుకుంటున్నారు. దిగుబడి ఒక ఆయుధం! ప్రభుత్వం దిగుబడి పెంచడానికి వివిధ రకాలుగా పెడుతున్న ఖర్చు... రైతులకు గిట్టు బాటు ధరలు అందించే వ్యవస్థ మీద పెట్టే దాని కంటే అనేక రెట్లు ఎక్కువ. వరి, గోధుమల అధిక ఉత్పత్తి కొరకు గత 50 ఏండ్లలో కేటాయించిన నిధులు, ఆహారం కొరకు చేసిన కృషిగా కొంత వరకు అర్థం చేసుకోగలం. కానీ గత 25 ఏండ్లలో వాణిజ్య పంటల దిగుబడులు పెంచడానికి ప్రకటించిన విధానాలు, కంపెనీలకు ఇస్తున్న సబ్సిడీలు, సరళీకరించిన నిబంధనలు రైతుకు మేలు చేయకపోగా కీడు చేస్తున్నాయి. కొత్త వంగడాలు ప్రకటించి పంటల దిగుబడి చూసుకుని మురుస్తున్నారే కానీ దాంట్లో పోషకాల శాతం ఎంత అనేది మరుస్తున్నారు. రోజూ మనం తీసుకుంటున్న ఆహారంలో పోషకాలు లేవని, తగ్గుతున్నాయని వైద్యులు, ఆహార నిపుణులు హెచ్చరి స్తున్నారు. ఆహారంలో పోషకాలు ఉండాలంటే వైవిధ్యం అవసరాన్ని వారు గుర్తు చేస్తున్నారు. కానీ, వైవిధ్యం కాదు, ఏక పంట విధానం ద్వారానే అధిక దిగుబడి వస్తుందని ఆధునిక దిగుబడి శాస్త్రం మనకు నూరిపోస్తున్నది. ఏదైనా వస్తువు, లేదా పని ఎక్కువ చేయాలంటే ఉత్పాదకతను కొలమానంగా తీసుకుంటారు. మౌలిక వనరులను సరి అయిన మోతాదులో ఉపయోగించడం ద్వారా ఉత్పత్తిని పెంచడం ఉత్పాద కతను సాధించినట్టుగా భావిస్తారు. ఏదైనా పరిశ్రమలో అధిక ఉత్పా దకత కొరకు ప్రోత్సాహకాలు ఇస్తారు. అదే రైతు ఉత్పాదకతను పెంచితే ప్రోత్సాహకంగా పంట ధర పెరగడం లేదు. 2010, 2019లో భారత రైతులకు మైనస్ రూ.2.36 లక్షల కోట్లు, మైనస్ రూ.1.62 లక్షల కోట్ల మేర ప్రతికూల మద్దతు లభించిందని ఒక అంతర్జాతీయ నివేదిక (ఓఈసీడీ– ఐరోపా దేశాల ఆర్థిక కూటమి) అంచనా వేసింది. 2000 మినహా 2000–2019 మధ్య కాలంలో రైతులకు మద్దతు స్థిరంగా ప్రతికూలంగా ఉంది. ఓఈసీడీ అంచనా ప్రకారం మైనస్ 1.62 లక్షల కోట్ల రూపాయల ప్రతికూల మద్దతు 2019లో వ్యవసాయ మంత్రిత్వ శాఖ మొత్తం బడ్జెట్ కేటాయింపుల కంటే రూ.1.09 లక్షల కోట్లు ఎక్కువ. రైతులకు రావాల్సిన పైకం ఎక్కువ, కాని వస్తున్నది తక్కువ అని ఈ నివేదిక సారాంశం. 2016–17లో ఒక క్వింటాల్ గోధుమ ఉత్పత్తికి హరియాణా రైతుకు రూ.2,219 ఖర్చయిందనీ, కేంద్రం నిర్ణయించిన క్వింటాలుకు రూ.1,625 కనీస మద్దతు ధర కంటే అది రూ. 594 ఎక్కువనీ అక్కడి ప్రభుత్వం స్వయంగా అంగీకరించింది. ఈ పరిస్థితి అధిక దిగుబడి వల్ల మారుతున్నదా? గిట్టుబాటు ధర రానప్పుడు రైతుకు దిగుబడి దిగులు ఎందుకు? ‘ఉత్పత్తి పెంచండి’ అని పిలుపునిచ్చే శాస్త్రవేత్తలు, అధికారులు, నాయకులు, గిట్టుబాటు ధర విషయంలో మాత్రం కిమ్మనరు. విత్తనాలు, ఎరువులు, పంట రసాయనాలు అమ్మేవారు మాత్రం అధిక దిగుబడుల ఆశను రైతులలో కల్పిస్తూ తమ లాభాలను పెంచుకుంటున్నారు. వీరి వాణిజ్య ప్రకటనలకు దన్నుగా శాస్త్రవేత్తలు ఫిడేలు వాయిస్తుంటారు. వ్యవసాయంలో పంటల దిగుబడులు పెంచాలంటే అనేక మార్గాలు ఉన్నాయి. నేల సారం అధికంగా ఉంటే పంట పోషకాలతో కూడి ఎక్కువ కాత, పూత వస్తుంది. సరి అయిన నీరు అందిస్తే మొక్కల ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. పూతకు, కాతకు గాలిలో, నేలలో తేమ ఉపయోగపడుతుంది. ఈ తేమ ఉండాలంటే, ప్రాంతీయంగా పచ్చదనం ఉండాలి. జీవ వైవిధ్యం ఎక్కువగా ఉంటే వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మొక్కలు ఆరోగ్యంగా ఉంటే పురుగుల తాకిడి తక్కువగా ఉంటుంది. నేలలో పోషకాలు పెంచే ఉపాయాలు అనేకం ఉన్నాయి. నిరంతరంగా, సహజంగా నేలలో సారం పెంచితే రైతు మీద ఆర్థిక భారం తగ్గుతుంది. ప్రకృతి వ్యవసాయం ద్వారా, దేశీ విత్తనాల ద్వారా అధిక దిగుబడులు సాధించి సంతోషంగా ఉన్న రైతులు కోకొల్లలు. ప్రపంచ రికార్డు వరి దిగుబడి ఒక వ్యవసాయ పరిశోధనా కేంద్రం లేదా అమెరికాలో పెద్ద భూస్వామి కాకుండా, బిహార్ రాష్ట్రంలో ఒక రైతు సాధించాడు. దర్వేశ్పుర గ్రామంలో సుమంత్ కుమార్‌కు హెక్టారుకు 22.4 టన్నుల దిగుబడి వచ్చింది. అది కూడా సిస్టం ఆఫ్ రైస్ ఇంటెన్సిఫికేషన్ (ఎస్ఆర్ఐ) పద్ధతి వల్ల వచ్చింది. రైతు మీద భారం లేకుండా సహజ పద్ధతుల ద్వారా, ప్రమాదకర రసాయనాల అవసరం లేకుండా,కంపెనీల గత్తర విత్తనాలు నాటకుండా, దిగుబడి వస్తే మంచిదే కదా! దిగుబడి మీద పరిమితులు ఉంటాయి. ఒక దశ తరువాత దిగుబడి పెరగదు. ఎంత దక్షత ఉన్నా ఉత్పాదకతను ఒక స్థాయికి మించి పెంచలేము. ప్రకృతి నుంచి వచ్చే ఉత్పత్తులలో అనేక కారణాల రీత్యా దిగుబడిలో కాలానుగుణంగా హెచ్చుతగ్గులు ఉంటాయి. దీనిని వ్యవసాయ ఆర్థిక శాస్త్రంలో ఎప్పుడూ పరిగణనలోకి తీసుకోలేదు. పాల ఉత్పత్తి ఒక మంచి ఉదాహరణ. ఒక పాడి పశువు నుంచి తీసుకునే పాల దిగుబడి పెంచడానికి మొదట్లో హైబ్రిడ్ ఆవులను ప్రవేశపెట్టారు. తదుపరి వాటి పొదుగులను భారీగా పెంచారు. విదేశాలలో ఈ భారీ పొదుగులతో ఆవులు నడవలేని స్థితికి వచ్చాయి. అయినా పాల దిగుబడి ఇంకా పెంచాలని మేతలో మార్పులు చేశారు. ఆక్సిటోసిన్ ఇంజెక్షన్లు ఇవ్వడం మొదలుపెట్టారు. వీటి అన్నింటి పర్యవసానంగా ఆవు బలహీనపడి, రోగాల బారిన పడింది. కచ్చితంగా అవి అనారోగ్యానికి గురి అవుతాయని తెలిíసీ మేతలో ‘మందులు’ కలుపుతున్నారు. అంటురోగాలు వస్తాయని నిర్ణీత కాలంలో అవసరమున్నా లేకున్నా వ్యాక్సిన్లు, ఇతర ‘మందులు’ అల వాటు చేశారు. ఇవన్నీ కూడా దిగుబడి తగ్గకూడదు అని చేస్తున్నారు. ఇప్పుడు ఆవులను జన్యుమార్పిడి ప్రయోగాలకు బలి చేస్తున్నారు. ఎన్ని చేసినా ఒక ఉత్థాన దశ చేరుకున్న తరువాత ప్రకృతిలో భాగం అయిన ఆవు పాలు ఎక్కువగా ఇవ్వదు. ఇంకొక వైపు పాలలో కలుషితాలు పెరిగినాయి. ఒక పాడి పశువు 2 లీటర్లు ఇస్తే, ఇంకొక రకం 3 ఇవ్వచ్చు. సంఖ్యాపరంగా తేడా ఉన్నా ఇస్తున్న పాలు నాణ్యంగా ఉన్నాయా లేదా అనేది ముఖ్యం. కాని ఆధునిక దిగుబడి శాస్త్రంలో ‘పిండుకోవటం’ ఒక వ్యాపార సూత్రంగా మారింది. దానినే ఇప్పుడు ‘ఎక్స్ట్రాక్టివ్ టెక్నాలజీస్ అండ్ ఎకానమీ’ అని పరిగణిస్తున్నారు. వరి, గోధుమలు, పత్తి వంటి పంటల విషయంలో కూడా ఇదే తీరు కనిపిస్తున్నది. పత్తి దిగుబడులు పెరుగుతాయని ఒక విదేశీ కంపెనీ చెబితే జోరుగా అనుమతులు ఇచ్చి 2003లో బీటీ పత్తిని రైతులకు అంటగట్టారు. గత 15 ఏండ్ల నుంచి 883 బీజీఐఐ హైబ్రిడ్లు మార్కెట్లో అమ్ముతున్నారు. మూడు లేదా నాలుగేళ్లకు హైబ్రిడ్ విత్త నాలు మార్చాలని రైతులకు సూక్తులు చెప్పే శాస్త్రవేత్తలు, అధికారులు ఇన్ని ఏండ్లుగా అవి మార్చకున్నా పట్టించుకోవటం లేదు. దీంతో పత్తిని ఆశించే పురుగులు, చీడ పీడల బెడద పెరిగింది. విష రసాయనాల మీద ఖర్చు పెరిగింది.ఎకరాకు 14 క్వింటాళ్ళు వస్తాయని నమ్మబలికిన కంపెనీలు ఇప్పుడు కేవలం 2 లేదా 3 క్వింటాళ్ళు వస్తుంటే మాట్లాడటం లేదు. జాతీయ సగటు లెక్కల ప్రకారం 2014లో హెక్టారుకు 510 కిలోలు వస్తే, 2022 అది 445 కిలోలకు పడిపోయింది. దిగుబడుల కోసం హైబ్రిడ్ రకాలను ప్రకటించడంలో ఉన్న చిత్తశుద్ధి ఆ యా విత్తనాల పని తీరును ఎప్పటికప్పుడు అంచనా వేయడంలో లేదు. ఒక ఊత పదంగా మారిన దిగుబడి సందేశాల వెనుక రాజకీయాలు ఉన్నాయి. స్వార్థపర వ్యాపార ప్రయోజనాలు ఉంటు న్నాయి. లోపభూయిష్ట విధానాలను దిగుబడి ఒక కవచంగా మారింది. అధిక ఉత్పత్తి సాధించడానికి ప్రకటిస్తున్న విధానాలలో సంపూర్ణత లోపించింది. డాక్టర్ దొంతి నరసింహారెడ్డి వ్యాసకర్త విధాన విశ్లేషకులు -
కోవిడ్-19 : పరిశీలనలో అతి చవకైన మందు
సాక్షి, చెన్నై: కరోనా వైరస్ వల్ల సంభవించే మరణాలను నిరోధించగలిగే అతి చవకైన మందును ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) ట్రయల్స్ కోసం పరిశీలించనుంది. కరోనా బాధితుల మరణాలకు కారణంగా భావిస్తున్న సైటోకిన్ ఉధృతిని ఎదుర్కొనేందుకు యాంటీ ఇన్ ఫ్లమేటరీ ఆర్థరైటిస్ ఔషధం ఇండోమెథాసిన్ ఉపయోగపడుతుందని చెన్నైకి చెందిన వైద్య నిపుణుడు డాక్టర్ రాజన్ రవిచంద్రన్ తాజాగా వెల్లడించారు. ఈ మేరకు ఆయన ట్రయల్స్ కోసం తన ప్రతిపాదనలను ఐసీఎంఆర్ తోపాటు, అమెరికా, కెనడా దేశాలకు ఏప్రిల్ 29 న పంపించారు. దీనిపై స్పందించిన యూకే విభాగం వీటిని తమ చికిత్సా టాస్క్ ఫోర్స్ కు పంపించినట్టు తెలిపింది. కిడ్నీ మార్పిడి రోగుల్లో సైటోకిన్ తీవ్ర ప్రభావాన్ని ఆపడానికి ఇండోమెథాసిన్ ఉపయోగించిసఫలమైనట్టు కిడ్నీ మార్పిడి సర్జన్ రవి చంద్రన్ తెలిపారు. కోవిడ్-19 బాధితులపై దీనిని ఔషధంగా ఉపయోగించవచ్చని డాక్టర్ రవిచంద్రన్ సూచించారు. అయితే ఆశాజనక ఫలితాలకు పెద్ద ఎత్తున నిర్వహించే మెడికల్ ట్రయిల్స్ కీలకమన్నారు. ఇండోమెథాసిన్ క్యాప్సూల్ ధర కేవలం రూ. 5 మాత్రమే. మరోవైపు కోవిడ్-19 రోగుల్లో ఇప్పుడు ఉపయోగించే టోసిలిజుమాబ్ ఒక మోతాదు ధర రూ. 60 వేలు ఖర్చు అవుతుంది. (హైడ్రాక్సీక్లోరోక్విన్ ట్రయల్స్‌పై తాత్కలిక నిషేధం: డబ్ల్యూహెచ్ఓ) ఇలాంటి 185 ప్రతిపాదనలు తమ దృష్టికి వచ్చినట్టు ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరామ్ భార్గవ తెలిపారు. సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం బయోటెక్నాలజీ విభాగంలోని నిపుణులు, కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ అనాలిసిస్ తో కలిసి ఐసీఎంఆర్ ఒకదాని తరువాత మరొక ప్రతిపాదనను పరిశీలిస్తోందన్నారు. మరోవైపు హైడ్రాక్సిక్లోరోక్విన్ కంటే ఇండోమెథాసిన్ సమర్ధవంతంగా పనిచేస్తోందని బ్రూక్లిన్‌లోని ఒక ప్రధాన వైద్యుడు డాక్టర్ జోనాథన్ లీబోవిట్జ్ ప్రకటించారు. దాదాపు 60 మంది కరోనా రోగుల్లో సాధారణంగా కంటే ఎక్కువగా ఇది సమర్థవంతంగా పనిచేసినట్టు తెలిపారు. అలాగే ఈ ఔఫధానికి కావాల్సిన ప్రాముఖ్యతనివ్వడం లేదని కూడా పేర్కొన్నారు. నిర్మాణాత్మక ప్రభావాన్ని కలిగి ఉన్నట్లు కనిపిస్తోందనీ, కానీ దీనిపై అదనపు పరిశోధనలు అవసరమని ఆయన సూచించారు. కాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కరోనా వైరస్ నివారణకు యాంటి మలేరియా డ్రగ్ హైడ్రాక్సీక్లోరోక్విన్ పనిచేస్తుందని..తాను వాడి చూశానని ప్రకటించగా, హైడ్రాక్సీక్లోరోక్విన్ క్లినికల్ ట్రయల్స్ తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా వెల్లడించింది. -
పల్లిరైతుల కన్నెర్ర
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్) : పాలమూరులో పల్లికి మద్దతు ధర ఇవ్వడం లేదని రైతులు కన్నెర్రజేశారు. కనీస మద్దతు ధర ఇవ్వడం లేదని ఆగ్రహించిన రైతులు మార్కెట్ యార్డు కార్యాలయంలోని ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. శుక్రవారం మార్కెట్ యార్డుకు రికార్డు స్థాయిలో 29,819 బస్తాల పల్లి వచ్చింది. దీంతో ట్రైడింగ్కు చాలా ఆలస్యమైంది. ఆగ్రహించి న రైతులు ఒక్కసారిగా మార్కెట్ యా ర్డు కార్యాలయంలోకి దూసుకువెళ్లి బీరువాలు, ఫర్నీచర్, అద్దాలును ధ్వం సం చేశారు. అనంతరం రైతులు కా ర్యాలయం ఎదుట బైఠాయించి మద్ద తు ధర ఇవ్వాలని నినాదాలు చేశారు. అక్కడితో శాంతించని వారు బోయ పల్లిగేట్ చౌరస్తాలో రోడ్డుపై సుమారు అరగంటల పాటు బైఠాయి ంచడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఎంపీ, ఎమ్మెల్యే వచ్చే వరకు రోడ్డుపై నుంచి లేవమని భీష్మించి కూర్చున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు డీఎస్పీ భాస్కర్ నేతృత్వంలో సీఐ రాజు, ఎస్ఐలు తమ సిబ్బందితో వచ్చి పరిస్థితిని అదుపు చేశారు. మార్కెట్ చైర్మన్ రాజేశ్వర్, మహబూబ్‌నగర్ అర్బన్ తహసీల్దార్ ప్రభాకర్ రైతులను శాంతింపజేశారు. మూడురోజులుగా పడిగాపులు పల్లికి మద్దతు ధర రాకపోవడంతో రైతులు మూడు రోజులుగా మార్కెట్ యార్డులోనే పడిగాపులు కాస్తున్నారు. ప్రభుత్వం ప్రకారం నాణ్యత ఉన్న ధాన్యానికి కూడా ధర ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. రాత్రి చలికి ధాన్యం పక్కలే పడుకుంట్టున్నామని చెప్పుకొస్తున్నారు. రైతుల ఆందోళన కు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఎన్పీ వెంకటేశ్, సీపీఐ (ఎం ఎల్ న్యూడెమోక్రసీ) జిల్లా నాయకు డు వెంకటేశ్ మద్దతు తెలిపారు. రైతులకు ప్రభుత్వం ప్రకటించిన రూ. 4,459 ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులకు నష్టం రానివ్వం రైతులకు మద్దతు ధర విషయంతో నష్టం రానివ్వమని మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేశ్వర్ అన్నారు. 30 వేల పల్లి మార్కెట్‌కు వచ్చిందని, దీంతో కొనుగోలుకు కొంత ఆలస్యమైందన్నా రు. ఇందులో రూ.2 వేల ధర వచ్చిన బస్తాలు కేవలం 17 మాత్రమేనని చె ప్పారు. ఎక్కువ శాతం రైతులకు మ ద్దతు ధర వచ్చిందని రైతులు ఆందో ళన చెందవద్దన్నారు. ధర రాని రైతుల కు శనివారం మంచి ధర వచ్చేలా ట్రెడర్లతో మాట్లాడుతామని మార్కెట్ యార్డు చైర్మన్ పేర్కొన్నారు. -
రైతుల ఆందోళన
ఏన్కూరు : సుబాబుల్‌కు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ మండల కేంద్రంలో గురువారం రైతులు ఆందోళన నిర్వహించారు. ఐటీసీ సుబాబుల్ కర్ర కొనుగోలులో రోజుకో అంక్షలు పెడుతూ ఇబ్బందులకు గురి చేయడాన్ని నిరసిస్తూ భారీ ప్రదర్శనగా వెళ్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. తొలుత వివిధ గ్రామాల నుంచి రైతులు కమ్మవారి కళ్యాణ మండపానికి చేరుకున్నారు. అక్కడ సమావేశమై తమ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాటం చేస్తామన ప్రతినబూనారు. అనంతరం అక్కడ నుంచి అఖిలపక్ష నాయకులతో పాటు రైతులు భారీ ప్రదర్శనతో తహసీల్దార్ కార్యాలయం చేరుకున్నారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ నినాదాలు చేసారు. డిమాండ్లతో కూడిని వినతి పత్రాన్ని అందజేశారు. అఖిలపక్ష నాయకుల మాట్లాడుతూ రైతులు పండించిన సుబాబుల్‌ను నేరుగా కోనుగోలు చేయాలని, మార్కెట్ యార్డుల ద్వారా కోనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు. దళారీ వ్వవస్థతో టన్నుకు రూ.1000 నష్టాపోతున్నామని, రైతులకు వే బిల్లులు అందించి విక్రÆయించే అవకాశం కల్పించాలని అన్నారు. ఐటీసీ సంస్థ విధిస్తున్న రంపంతో కోయాలని ,కర్ర తొక్కతీసి తేవాలని అంక్షలు రద్దు చేయలన్నారు. త్వరలో ఐటీసీ ముట్టడికి జిల్లా వ్యాప్తంగా రైతులు సన్నద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అ«ఖిలపక్ష నాయకులు మోత్కూరి వెంకటేశ్వరావు, నల్లమల వెంకటేశ్వరావు, బొంతు రాంబాబు, స్వర్ణ ప్రహ్లాదరావు, స్వర్ణ నరేందర్, తాళ్లూరి అప్పారావు. భూక్యా సక్రు నాయక్, కొవ్వూరి నాగేశ్వరావు, తెప్పల సత్యం పాల్గొన్నారు. -
ధాన్యానికి మద్దతు ధర చెల్లించాలి
–జేసీ కోటేశ్వరరావు ఏలూరు (మెట్రో): రాబోయే ఖరీఫ్ సీజనులో మద్దతు ధర ప్రకారం ధాన్యం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని జాయింట్ కలెక్టర్ పి.కోటేశ్వరరావు జిల్లా రైస్‌మిల్లర్లను కోరారు. కలెక్టరేట్లో జిల్లా రైస్‌మిల్లర్స్ అసోసియేషన్, సివిల్ సప్లయీస్ అధికారులతో ఆయన సమీక్షించారు. జిల్లాలో వచ్చేనెల 1 నుంచి రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేసేందుకు వెలుగు విభాగం ద్వారా 160 ఐకేపీ, సహకార సొసైటీల ద్వారా 100 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయాలని సివిల్ సప్లయీస్ అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం రా రైస్ 67 శాతం, బాయిల్డ్ రైస్ 68 శాతం సరఫరా అవుతుందని, బ్రాస్ రైస్, బ్రొకెన్ రైస్ ఎంత శాతం నమోదైందన్న వివరాలు కూడా ఆన్లైన్లో పొందుపర్చాలని సూచించారు. మిల్లర్లు కొన్న ధాన్యానికి తప్పనిసరిగా లెక్కలుండాలని, పారదర్శకంగా మిల్లర్లు పనిచేయాలని, రైతులకు ధాన్యం ధరను బ్యాంకు ఖాతాల ద్వారా చెల్లిస్తామని చెప్పారు. సివిల్ సప్లయీస్ అధికారి డి.శివశంకర్‌రెడ్డి, సివిల్ సప్లయిస్ అసిస్టెంట్ మేనేజర్ టెక్నికల్ వెంగప్ప, అసిస్టెంట్ మేనేజర్ జనరల్ షర్మిల, రైస్‌మిల్లర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎన్బీఎస్వీ ప్రసాద్, సెక్రటరీ ఎన్బీకే ప్రసాదరావు, వైస్ ప్రెసిడెంట్ కె.హరిబాబు, జాయింట్ సెక్రటరీ బాబి, ట్రెజరర్ చక్కా సత్యనారాయణ పాల్గొన్నారు. -
రైతు కంట మిర్చి మంట
మిర్చికి గిట్టుబాటు ధర దక్కడం లేదు. నెల రోజుల క్రితం ఉన్న ధర కూడా ప్రస్తుతం లేకపోవడంతో ఆరుగాలం శ్రమించి పండించిన రైతుల కంట కన్నీరొలుకుతోంది. తమకు అప్పులే మిగులుతాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీరులపాడు : పశ్చిమ కృష్ణాలో ఈ ఏడాది 21 వేల 140 ఎకరాల్లో మిర్చి సాగు చేశారు. గత ఏడాది కంటే ఈ ఏడాది అధిక పెట్టుబడులు పెట్టామని రైతులు చెబుతున్నారు. ఈ ఏడాది వాతావరణం అనుకూలించకపోవడం ఒక కారణమైతే పంట చేతికొచ్చే సమయంలో నీటి తడులకు అవసరమైన సాగునీరు లేకపోవడంతో పంటలు ఎండు దశకు చేరుకున్నాయి. ఎన్ఎస్పీ కాలువల్లో చుక్కనీరు కూడా లేకపోవడంతో రైతులు నేలబావుల పైనే ఆధారపడి మిర్చి పంటకు చాలీచాలని తడులను ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీనికితోడు మిర్చి పంటలో బొబ్బర తెగుళ్లు అధికంగా ఉండటంతో వాటి నివారణకు రైతులు అధిక మొత్తంలో పెట్టుబడులు పెట్టారు. ముఖ్యంగా నెలరోజుల క్రితం క్వింటా మిర్చి రూ.9 వేల నుంచి రూ.10 వేల వరకు ధర పలికిందని, ప్రస్తుతం రూ.6 వేల నుంచి రూ.6,500కు పడిపోవడంతో దిక్కుతోచడం లేదని రైతులు తలలు పట్టుకుంటున్నారు. నెల రోజులు గడవకముందే మిర్చి ధర అమాంతం పడిపోవడంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కౌలు రైతుల పరిస్థితి మరీ దారుణం... మిర్చికి ఎకరాకు లక్షా 20 వేల రూపాయల వృరకు ఖర్చులు అయ్యాయృని, పంట దిగుబడి అంతంతగానే ఉండటం, సరైన గిట్టుబాటు ధర లేకపోవడంతో అప్పులే మిగులుతాయని రైతులు వాపోతున్నారృు. కౌలు రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఎకరాకు రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు అదనంగా వెచ్చించారు. పండించిన పంటను మార్కెట్లోకి తీసుకువస్తే పెట్టుబడులు కూడా రాని పరిస్థితులు నెలకొన్నాయని, గత మూడేళ్లుగా ఈ పరిస్థితి ఉన్నప్పటికి తమను ఆదుకోవడంలో ప్రభుత్వం ఎటువంటి చర్యలూ తీసుకోలేదనే రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలువురు రైతులు అప్పుల బాధ తట్టుకోలేక వచ్చిన ధరకు దళారులకు విక్రయించుకోగా, మరికొందరు మద్దతు ధర కోసం వేచిచూస్తూ కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేస్తున్నారు. ప్రభుత్వం మిర్చికి మద్దతు ధర లభించేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. గిట్టుబాటు ధర కల్పించాలి నేను మూడెకరాల్లో మిర్చి సాగు చేశాను. ఎకరాకు రూ.1.20 లక్షల వరకు పెట్టుబడి పెట్టాను. ఎన్నో వ్యయప్రయాసలు పడి పంటను పండించి చేతికొచ్చే దశలో ధర ఒక్కసారిగా పడిపోవడంతో అప్పులే మిగిలేలా ఉన్నాయి. ప్రభుత్వం మిర్చికి గిట్టుబాటు ధర కల్పిస్తే రైతులకు కొంత ఊరట కలుగుతుంది. - పూర్ణచంద్రరావు, రైతు