రైతులకు నచ్చజెప్పుతున్న డీఎస్పీ, అధికారులు
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్) : పాలమూరులో పల్లికి మద్దతు ధర ఇవ్వడం లేదని రైతులు కన్నెర్రజేశారు. కనీస మద్దతు ధర ఇవ్వడం లేదని ఆగ్రహించిన రైతులు మార్కెట్ యార్డు కార్యాలయంలోని ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. శుక్రవారం మార్కెట్ యార్డుకు రికార్డు స్థాయిలో 29,819 బస్తాల పల్లి వచ్చింది. దీంతో ట్రైడింగ్‌కు చాలా ఆలస్యమైంది. ఆగ్రహించి న రైతులు ఒక్కసారిగా మార్కెట్ యా ర్డు కార్యాలయంలోకి దూసుకువెళ్లి బీరువాలు, ఫర్నీచర్, అద్దాలును ధ్వం సం చేశారు. అనంతరం రైతులు కా ర్యాలయం ఎదుట బైఠాయించి మద్ద తు ధర ఇవ్వాలని నినాదాలు చేశారు. అక్కడితో శాంతించని వారు బోయ పల్లిగేట్ చౌరస్తాలో రోడ్డుపై సుమారు అరగంటల పాటు బైఠాయి ంచడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఎంపీ, ఎమ్మెల్యే వచ్చే వరకు రోడ్డుపై నుంచి లేవమని భీష్మించి కూర్చున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు డీఎస్పీ భాస్కర్ నేతృత్వంలో సీఐ రాజు, ఎస్‌ఐలు తమ సిబ్బందితో వచ్చి పరిస్థితిని అదుపు చేశారు. మార్కెట్ చైర్మన్ రాజేశ్వర్, మహబూబ్‌నగర్ అర్బన్ తహసీల్దార్ ప్రభాకర్ రైతులను శాంతింపజేశారు.
మూడురోజులుగా పడిగాపులు
పల్లికి మద్దతు ధర రాకపోవడంతో రైతులు మూడు రోజులుగా మార్కెట్ యార్డులోనే పడిగాపులు కాస్తున్నారు. ప్రభుత్వం ప్రకారం నాణ్యత ఉన్న ధాన్యానికి కూడా ధర ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. రాత్రి చలికి ధాన్యం పక్కలే పడుకుంట్టున్నామని చెప్పుకొస్తున్నారు. రైతుల ఆందోళన కు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఎన్పీ వెంకటేశ్, సీపీఐ (ఎం ఎల్ న్యూడెమోక్రసీ) జిల్లా నాయకు డు వెంకటేశ్ మద్దతు తెలిపారు. రైతులకు ప్రభుత్వం ప్రకటించిన రూ. 4,459 ఇవ్వాలని డిమాండ్ చేశారు.
రైతులకు నష్టం రానివ్వం
రైతులకు మద్దతు ధర విషయంతో నష్టం రానివ్వమని మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేశ్వర్ అన్నారు. 30 వేల పల్లి మార్కెట్‌కు వచ్చిందని, దీంతో కొనుగోలుకు కొంత ఆలస్యమైందన్నా రు. ఇందులో రూ.2 వేల ధర వచ్చిన బస్తాలు కేవలం 17 మాత్రమేనని చె ప్పారు. ఎక్కువ శాతం రైతులకు మ ద్దతు ధర వచ్చిందని రైతులు ఆందో ళన చెందవద్దన్నారు. ధర రాని రైతుల కు శనివారం మంచి ధర వచ్చేలా ట్రెడర్లతో మాట్లాడుతామని మార్కెట్ యార్డు చైర్మన్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment