ర్యాలీ నిర్వహిస్తున్న రైతులు
ఏన్కూరు : సుబాబుల్‌కు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ మండల కేంద్రంలో గురువారం రైతులు ఆందోళన నిర్వహించారు. ఐటీసీ సుబాబుల్ కర్ర కొనుగోలులో రోజుకో అంక్షలు పెడుతూ ఇబ్బందులకు గురి చేయడాన్ని నిరసిస్తూ భారీ ప్రదర్శనగా వెళ్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. తొలుత వివిధ గ్రామాల నుంచి రైతులు కమ్మవారి కళ్యాణ మండపానికి చేరుకున్నారు. అక్కడ సమావేశమై తమ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాటం చేస్తామన ప్రతినబూనారు. అనంతరం అక్కడ నుంచి అఖిలపక్ష నాయకులతో పాటు రైతులు భారీ ప్రదర్శనతో తహసీల్దార్ కార్యాలయం చేరుకున్నారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ నినాదాలు చేసారు.
డిమాండ్లతో కూడిని వినతి పత్రాన్ని అందజేశారు. అఖిలపక్ష నాయకుల మాట్లాడుతూ రైతులు పండించిన సుబాబుల్‌ను నేరుగా కోనుగోలు చేయాలని, మార్కెట్ యార్డుల ద్వారా కోనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు. దళారీ వ్వవస్థతో టన్నుకు రూ.1000 నష్టాపోతున్నామని, రైతులకు వే బిల్లులు అందించి విక్రÆయించే అవకాశం కల్పించాలని అన్నారు. ఐటీసీ సంస్థ విధిస్తున్న రంపంతో కోయాలని ,కర్ర తొక్కతీసి తేవాలని అంక్షలు రద్దు చేయలన్నారు. త్వరలో ఐటీసీ ముట్టడికి జిల్లా వ్యాప్తంగా రైతులు సన్నద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అ«ఖిలపక్ష నాయకులు మోత్కూరి వెంకటేశ్వరావు, నల్లమల వెంకటేశ్వరావు, బొంతు రాంబాబు, స్వర్ణ ప్రహ్లాదరావు, స్వర్ణ నరేందర్, తాళ్లూరి అప్పారావు. భూక్యా సక్రు నాయక్, కొవ్వూరి నాగేశ్వరావు, తెప్పల సత్యం పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment