రెవెన్యూ శాఖలో అలజడి
♦ రేపల్లెలో ‘భూ’పాలుడు కథనానికి స్పందన
♦ అధికారులతో సమీక్షించిన జేసీ
♦ విశ్రాంత తహసీల్దారు ప్రమేయంతోనే భూ కుంభకోణానికి తెరతీసినట్లు నిర్ధారణ
సాక్షి, అమరావతి బ్యూరో/గుంటూరు వెస్ట్/రేపల్లె రూరల్: ‘రేపల్లెలో ‘భూ’పాలుడు!’ శీర్షికన ‘సాక్షి’ ప్రధాన సంచికలో ఆదివారం ప్రచురితమైన కథనం గుంటూరు జిల్లాలో కలకలం రేపింది. రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ అనుయా యులు కొందరు రెవెన్యూ యం త్రాంగంతో కలసి 508 ఎకరాల ప్రభు త్వ భూమిని స్వాహాచేసిన వైనం వెలుగు చూడ టంతో జిల్లా ఉన్నతాధికారులు అప్రమత్త మయ్యారు.
ఈ కథనానికి స్పందించి న గుంటూరు జిల్లా కలెక్టర్ కోన శశిధర్.. ప్రభుత్వ భూముల తోపాటు మడ అడవుల అన్యాక్రాంతంపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిసింది. తక్షణమే సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశిం చారు. దీంతో రెవెన్యూశాఖ అధికారులు ఆదివారం ఉరు కులు పరుగులు పెడుతూ నిజాంపట్నం తహసీల్దారు కార్యాలయానికి చేరుకుని రికార్డులను తనిఖీ చేశారు. జాయింట్ కలెక్టర్ (జేసీ) కృతికా శుక్లా దాదాపు 45 నిమిషాలపాటు అధికారులతో సమీక్షిం చారు.
పలు రికార్డులు పరిశీలించాల ని తెనాలి ఆర్డీవో నరసింహులును ఆదేశిం చారు. కార్యాలయ సిబ్బంది కూడా దీనిపై జేసీకి కొంత సమాచారం అందించారు. ఇదిలా ఉండగా రెవెన్యూ రికార్డుల్లో పేర్ల నమోదుకు సంబంధించి తనకుగాని, ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌కుగాని ప్రమేయం లేదని కూచినపూడి మార్కెట్ యార్డు చైర్మన్ పంతాని మురళీధరరావు ఆదివారం రేపల్లెలోని ఎమ్మెల్యే అనగాని నివాసంలో విలేకరులతో చెప్పారు.